మేడ్చల్, న్యూస్‌లైన్: మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిపిస్తే దాని పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మేడ్చల్ పట్టణంలో పాదయాత్ర నిర్వహించిన అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిఉండడం బాధాకరమన్నారు. గతంలో మేడ్చల్ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మోసంచేసి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అలాంటిది కాదని, చేసే పనులే చెబుతామని, చెప్పిన పనులు తప్పకుండా చేస్తామని అన్నారు.
ఫ్యాన్ గుర్తుకు ఓటేయడం వల్ల దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ పాలన మరోసారి పొందవచ్చన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మురికి వాడ లు, రోడ్లు బాగలేకపోవడం, ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుం టే ఇక్కడి పాలకులు ఏమేరకు అభివృద్ధి చేశారో స్పష్టమవుతోందన్నారు. తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే సమస్యలు లేని నియోజకవర్గంగా మేడ్చల్‌ను తీర్చిదిద్దుతానన్నారు. తాను డీజీపీగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానన్నారు. డీజీపీగా ఉం డి పోలీసులను ప్రజలకు చేరువ చేసిన ఘనత తనదేనన్నారు.
ఆర్టీసీ ఎండీగా ఉండి నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తీసుకువెళ్లానన్నారు. మేడ్చల్ నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేసి ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానన్నా రు. సమావేశంలో ఆర్టీసీ ఎన్‌ఎంయూ నాయకుడు మహమూద్, నియోజ కవర్గ నాయకులు సుఖేందర్‌రెడ్డి, అనిల్, పలు మండలాల నాయకులు పాల్గొన్నారు.
స్వతంత్ర అభ్యర్థి ప్రకాష్ వంజరి సంఘీభావం
మేడ్చల్ రూరల్: మేడ్చల్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రము ఖ వైద్యుడు డాక్టర్ ప్రకాష్ వంజరి వైఎస్సార్‌సీపీకి పూర్తి మద్దతు తెలిపారు. సోమవారం వైఎస్సార్‌సీపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి దినేష్‌రెడ్డి మేడ్చల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయనకు మద్దతు ప్రకటించారు. మేడ్చల్‌లో దినేష్‌రెడ్డిని కలిసి వైఎస్సార్‌సీపీకి తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను మొదటి నుంచి వైఎస్ అభిమానినని, ఆయన అభిమానులంతా ఐక్యంగా ఉండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల న్నారు. ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి స్వ తంత్ర అభ్యర్థి వంజరి ప్రకాష్‌కు స్వాగ తం పలికారు. కార్యకర్తలతో కలిసి పని చేయాలని కోరారు.
అవకాశమివ్వండి అభివృద్ధి చేస్తా
Published Tue, Apr 15 2014 12:23 AM | Last Updated on Mon, Oct 8 2018 8:52 PM
Advertisement