వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యం: దినేష్‌రెడ్డి | YSRCP Can not be improved: Dinesh Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యం: దినేష్‌రెడ్డి

Published Tue, Apr 22 2014 4:30 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యం: దినేష్‌రెడ్డి - Sakshi

వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యం: దినేష్‌రెడ్డి

కుషాయిగూడ, న్యూస్‌లైన్: ఒంట్లో శక్తి ఉన్నంత వరకూ ప్రజాసేవకే అంకితమవుతానని వైఎస్సార్‌సీపీ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఈసీఐఎల్ మహేష్ నగర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం, ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల అమలు కేవలం తమ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు.

రెండు ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు మేకల నవీన్ నాయుడు.. దినేష్‌రెడ్డికి మహానేత వైఎస్ భారీ చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్ యాదవ్, పురుషోత్తంరెడ్డి, డాక్టర్ కొండారెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు
 
కీసర: దినేష్‌రెడ్డి సోమవారం కీసరలో రోడ్‌షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని, వారి అండతో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం దినేష్‌రెడ్డి కీసరగుట్టలో శివుడి అభిషేక సేవలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సేవాదళ్ కన్వీనర్ సుఖేందర్‌రెడ్డి, కీసర ఇన్ చార్జి ముజీబ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement