
గెలుపును అడ్డుకోవడానికి కుట్ర: దినేష్‌రెడ్డి
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ గెలుపును అడ్డుకోవడానికి అధికారులు, అన్ని పార్టీల నాయకులు అడుగడుగునా కుట్రలు పన్నారని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి దినేష్‌రెడ్డి అన్నారు. బుధవారం కేపీహెచ్‌బీ కాలనీలోని మూడవఫేజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అనేక చోట్ల అధికారులు ఓటరు స్లిప్‌లను పంచలేదన్నారు.
కావాలనే వందలాది ఓట్లను తొలంగించారన్నారు. అయినా వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన యువత తప్పకుండా వైఎస్సార్ సీపీకి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.