క్యాట్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేసిన దినేష్ రెడ్డి | Dinesh reddy files lunch motion petition in highcourt | Sakshi
Sakshi News home page

క్యాట్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేసిన దినేష్ రెడ్డి

Published Sat, Sep 28 2013 12:35 PM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

క్యాట్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేసిన దినేష్ రెడ్డి

క్యాట్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేసిన దినేష్ రెడ్డి

తన పదవీ కాలాన్ని పొడిగించేది లేదంటూ క్యాట్ వెలువరించిన నిర్ణయాన్ని డీజీపీ దినేష్ రెడ్డి హైకోర్టులో సవాలు చేశారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. పదవీ విరమరణ వయస్సుతో సంబంధం లేకుండా డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు సేవ చేయొచ్చని, ఆ మేరకు తన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడగించాలని ఆయన ఆ పిటిషన్లో కోరారు.

తనను మరో ఏడాదిపాటు డీజీపీగా కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దినేష్‌రెడ్డి విన్నపాన్ని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే డీజీపీగా ఆయన రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేశారని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని శుక్రవారమే క్యాట్ తేల్చిచెప్పింది. క్యాట్ అలా చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే... ప్రభుత్వం ఆయన పదవీ విరమణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 1953 సెప్టెంబర్ 18న జన్మించిన దినేష్‌రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి అందులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement