దినేష్రెడ్డి అహంకారంతో మాట్లాడారు: ఆనం | Anam Ramanarayana Reddy Attack on Dinesh Reddy | Sakshi
Sakshi News home page

దినేష్రెడ్డి అహంకారంతో మాట్లాడారు: ఆనం

Published Tue, Oct 8 2013 5:49 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

దినేష్రెడ్డి అహంకారంతో మాట్లాడారు: ఆనం - Sakshi

దినేష్రెడ్డి అహంకారంతో మాట్లాడారు: ఆనం

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేష్రెడ్డి చేసిన విమర్శలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తప్పుబట్టారు. సీఎంను విమర్శించేస్థాయి దినేష్రెడ్డికి లేదని అన్నారు. నలుగురు సీనియర్లను కాదని రెండేళ్లు డీజీపీగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. డీజీపీ పోస్ట్ ఎలా వచ్చిందే గుర్తుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. దినేష్రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

రిటైర్మెంట్ వయసు దాటినా పదవిలో కొనసాగాలనుకోవడం మంచిదికాదన్నారు. డీజీపీ పదవి నుంచి దినేష్రెడ్డిని తొలగించారనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిపై కక్ష సాధిస్తావా అంటూ నిలదీశారు. భూకబ్జాకోరుడని దినేష్రెడ్డిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, దాని నుంచి సచ్ఛీలుడిగా బయటపడిన తర్వాత మాట్లాడాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే గుణపాఠం చెప్పడానికి పోలీసు మాజీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఆనం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement