'హోదాతో పనిలేదు.. ఎవరికైనా నోటీసులివ్వచ్చు'
స్పష్టమైన ఆధారాలుంటే ఏసీబీ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చని మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు దినేష్రెడ్డి చెప్పారు. నోటీసులు ఇవ్వడానికి హోదాలతో సంబంధం లేదని, అలాగే అందుకు ఎవరి పర్మిషన్లు కూడా అవసరం లేదని వ్యాఖ్యానించారు. చట్టం పరిధిలో ఉన్న అంశాలపై గవర్నర్ కూడా జోక్యం చేసుకోలేరని ఆయన అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ మీద కేంద్రం సుమోటోగా జోక్యం చేసుకోబోదని, నోటీసులు ఇచ్చే అంశం తెలంగాణ ఏసీబీ పరిధిలోనే ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల స్వేచ్ఛకు, ఆస్తులకు రక్షణ లేకపోతే సెక్షన్-8లో గవర్నర్ జోక్యం చేసుకుంటారని దినేష్ రెడ్డి వివరించారు. అంతేతప్ప మొత్తం శాంతి భద్రతలు పూర్తిగా గవర్నర్ చేతుల్లోకి వెళ్లవన్నారు. రాష్ట్రపతి పాలనలో మాత్రమే గవర్నర్కు పూర్తి అధికారాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులపై దాడులు జరిగితే గవర్నర్ జోక్యం చేసుకుంటారన్నారు.