'వాళ్లిద్దరినీ ఉద్దేశపూర్వకంగానే దాచారు' | lawyer files memo on chandra babu in acb court | Sakshi
Sakshi News home page

'వాళ్లిద్దరినీ ఉద్దేశపూర్వకంగానే దాచారు'

Published Mon, Jun 22 2015 4:40 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

'వాళ్లిద్దరినీ ఉద్దేశపూర్వకంగానే దాచారు' - Sakshi

'వాళ్లిద్దరినీ ఉద్దేశపూర్వకంగానే దాచారు'

ఓటుకు కోట్లు కేసులో నిందితులైన సండ్ర వెంకట వీరయ్య, జెరూసలెం మత్తయ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టిందని అరుణ్ కుమార్ అనే న్యాయవాది ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆయన ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు.

తెలంగాణ ఏసీబీ అధికారులను భయభ్రాంతులకు గురిచేసి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆ మెమోలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి తదితరులపై చర్య తీసుకోవాలంటూ మెమో దాఖలు చేశారు. కాగా న్యాయవాది అరుణ్ కుమార్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు స్వీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement