మాజీ డీజీపీ బంధువు ఇంట్లో భారీ చోరీ | robbery in former DGP relatives home | Sakshi
Sakshi News home page

మాజీ డీజీపీ బంధువు ఇంట్లో భారీ చోరీ

Published Wed, Jul 8 2015 9:20 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbery in former DGP relatives home

హైదరాబాద్:హైదరాబాద్: మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బంధువు ఇంట్లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది.  జూబ్లీహిల్స్ లోని ఆయన సోదరుడి కుమార్తె ఇంట్లో సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో పాటు పలు విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

జూబ్లీహిల్స్ రోడ్ నెం-58 లో ఉండే దినేష్ రెడ్డి సోదరుడి కుమార్తె దివ్యారెడ్డి గతనెల 4 న అమెరికా వెళ్లింది. వెళ్లు ముందు వజ్రపు ఉంగరాలు, గాజులు దుస్తుల మధ్యలో ఉంచి, వాటిని ఒక బ్యాగ్ లో పెట్టి తన తల్లి వద్దకు పంపింది. అయితే దుస్తుల్లో నగలు పెట్టిన విషయాన్ని తల్లికి చెప్పడం మరిచిపోయింది. గత నెల 17 న దివ్యారెడ్డి అమెరికా నుంచి తిరిగి రావడంతో  తల్లి తన వద్ద ఉన్న బ్యాగులో మరికొన్ని దుస్తులు పెట్టి తిరిగి పంపింది.

అయితే అప్పటి నుంచి దివ్యారెడ్డి బ్యాగ్ లోని నగలను చూసుకోలేదు. కాగా గత నెల 30 న బ్యాగ్ లో చూసుకోగా నగలు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దివ్యారెడ్డి నివాసంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు నిందితుల ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement