
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగతనం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆయన ఇంట్లో రూ. 2 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు చిరంజీవి మేనేజర్ గంగాధర్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా చిరంజీవి ఇంటి పనిమనిషి చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిరు ఇంట్లో చెన్నయ్య కొంతకాలంగా సర్వర్‌గా పనిచేస్తున్నాడు. ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్‌లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment