Former DGP
-
Tspsc: చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని సభ్యులుగా మరో నలుగురిని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకాలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే ఆమోదం తెలపడంతో చైర్మన్, సభ్యుల బాధ్యతల స్వీకరణకు లైన్ క్లియరైంది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను ప్రభుత్వం త్వరితగతిన నియమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ పరీక్షల పదేపదే వాయిదాలతో పాటు, పేపర్ లీకేజీల వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇదీచదవండి.. తమిళిసై ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి.. కేటీఆర్ ఫైర్ -
లైంగిక వేధింపుల కేసులో మాజీ డీజీపీకి మూడేళ్ల శిక్ష
తమిళనాడు:లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు మాజీ డీజీపీకి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీఎస్ అధికారి, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) రాజేశ్ దాస్‌ను విల్లుపురం న్యాయస్థానం దోషిగా తేల్చింది. తోటి సీనియర్ అధికారి రాజేశ్ దాస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ఐపీఎస్ అధికారి 2021లో ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి కే పళనిస్వామి భద్రతపై విధులకు వెళ్లిన క్రమంలో తనను వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపై దాస్‌ను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దర్యాప్తు చేయడానికి ఆరుగురి వ్యక్తులతో కూడిన ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కేసు అప్పటి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఎన్నికల బరిలో నిలిచిన ఎంకే స్టాలిన్.. తనను గెలిపిస్తే ఈ కేసును న్యాయబద్దంగా దర్యాప్తు చేపిస్తానని ప్రజలకు హామీ కూడా అప్పట్లో ఇచ్చారు. ఇదీ చదవండి:గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం.. -
సీబీఐ డైరెక్టర్‌కు సమన్లు
ముంబై: మహారాష్ట్ర మాజీ డీజీపీ, సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్‌కు ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఫోన్‌ట్యాపింగ్, డేటా లీక్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ–మెయిల్ ద్వారా జైశ్వాల్‌కు సమాచారమిచి్చనట్లు సైబర్ విభాగం పోలీసులు చెప్పారు. మహారాష్ట్రలో పోలీసు బదిలీల్లో అక్రమాల ఆరోపణలపై గతంలో ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదిక తయారు చేశారు. రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులను విచారిస్తున్న సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని అనిపించేలా, కావాలనే ఈ నివేదికను లీక్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో జైశ్వాల్‌కు తాజాగా సమన్లు పంపారు. -
లైంగిక వేధింపుల కేసు: మాజీ డీజీపీకి ఊరట
సాక్షి, చెన్నై: ఓ మహిళా ఐపీఎస్‌ను లైంగికంగా వేధించిన కేసులో మాజీ డీజీపీ రాజేష్ దాస్ సోమవారం విల్లుపురం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. వివరాలు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యేక డీజీపీ రాజేష్ దాసు ఓ మహిళా ఐపీఎస్‌తో అసభ్యకరంగా వ్యవహరించినట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగిన విషయం తెలిసిందే. అప్పటి సీఎం పళనిస్వామి పర్యటన బందోబస్తుకు వెళ్లి.. చెన్నైకి తిరుగు పయనంలో ఉన్న సమయంలో కారు డ్రైవర్‌ను కిందకు దించేసి మరీ.. తనను వేధించినట్లు ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీనిని మరికొందరు ఐపీఎస్‌లు అడ్డుకోవడం చర్చకు దారి తీసింది. వ్యవహారం మీడియాలో రావడంతో అన్నాడీఎంకే పాలకులు విశాఖ కమిటీని రంగంలోకి దించారు. సీబీసీఐడీ సైతం విచారణ చేపట్టింది. రాజేష్ దాస్‌తో పాటుగా ఆయనకు వత్తాసు పలికిన పోలీసు అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఈ కేసు విచారణలో ఉండగానే రాజేష్ దాస్ పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో సోమవారం విల్లుపురం కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. దీంతో విచారణకు మాజీ డీజీపీ హాజరయ్యారు. సీబీసీఐడీ 400 పేజీలతో చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. వాదనల అనంతరం మాజీ డీజీపీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చదవండి: Lockdown Update: ఈనెల 23 వరకు పొడిగింపు: సీఎం -
మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూత
-
మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో డీజీపీగా సేవలందించిన మాజీ ఐపీఎస్ అధికారి బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. ఇటీవల అమెరికా వెళ్లిన ఆయన ఆదివారం రాత్రి ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో మృతిచెందారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జన్మించిన ప్రసాదరావు మద్రాస్ ఐఐటీలో ఎమ్మెస్సీ (ఫిజిక్స్) చేశారు. 1979లో ఐపీఎస్ సర్వీసులో చేరారు. ఉమ్మడి ఏపీకి ఆఖరి డీజీపీ ఆయనే కావడం గమనార్హం. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలకు ఎస్పీగా, విశాఖపట్నం, హైదరాబాద్‌లకు కమిషనర్‌గా పనిచేశారు. ఇంగ్లిష్ భాషపై, సైన్స్‌పై ఆయనకు మంచి పట్టు ఉండేది. ఏపీఎస్ ఆర్టీసీకి ఎండీగా కూడా ఆయన సేవలందించారు. ప్రసాదరావు సమర్థుడైన అధికారి అని, తన తరువాత తరాలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని పలువురు ఐపీఎస్ అధికారులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. పోలీసు విభాగంలో విద్యావేత్త..! సాధారణంగా ఎవరైనా ఫోన్ ఎత్తగానే హలో అంటుంటారు. అయితే ‘నమస్తే ప్రసాదరావు’అనడం ఆయనకే సొంతం. 1955 సెప్టెంబర్ 11న పుట్టిన ప్రసాదరావు ఇంటర్ వరకు గుంటూరు జిల్లాలో తెలుగు మీడియంలో చదువుకున్నారు. ఆంధ్రా లయోలా కాలేజ్‌లో డిగ్రీలో చేరాక ఆంగ్లంలో మాట్లాడటానికి ఇబ్బందులు ఎదురుకావడంతో ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలని నిర్ణయించుకున్నారు. అలా ప్రారంభమైన తపన దాదాపు 11 వేల పదాలు ఆయన మేధస్సు అనే నిఘంటువులో నిక్షిప్తం అయ్యే వరకు వెళ్లింది. అయినప్పటికీ ప్రసాదరావు చేపట్టిన ‘ఆపరేషన్’కు పుల్‌స్టాప్ పడలేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఆయన పత్రికలు, పుస్తకాలు, నవలల నుంచి 20కి తక్కువ కాకుండా సాధ్యమైనన్ని కొత్త పదాలను ఎంపిక చేసుకుని, నిఘంటువు ద్వారా అర్థాలు తెలుసుకుంటూ జాబితా తయారు చేసేవారు. ఇలా ‘ఎ’టు ‘జెడ్’వరకు అన్ని అక్షరాలకు సంబంధించిన పదాలతో దాదాపు 500 కథనాలు రాసిన ఆయన 11 వేల ఆంగ్ల పదాలను ఔపోశన పట్టారు. వీటిలో ‘సి’అక్షరానికి సంబంధించిన 640 పదాలతో రూపొందించిన కథనాల సమాహారాన్ని ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’పేరుతో పుస్తకంగా మలిచారు. దీన్ని 2012లో ఆవిష్కరించారు. ఇక సైన్స్ పట్ల కూడా ప్రసాదరావు ఎంతో ఆసక్తి చూపేవారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లోనే పెద్ద ఫిజిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ శాస్త్రంపై మంచి పట్టు సాధించిన ఆయన, సుదీర్ఘ పరిశోధన చేసి ‘థియరీ ఆఫ్ లైట్’లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ ‘న్యూ లైట్ ఆన్ లైట్’సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగారు. దీంతో ప్రసాదరావును డాక్టరేట్ వరించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం మాజీ డీజీపీ ప్రసాద్‌రావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రసాద్‌రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏపీ గవర్నర్ సంతాపం.. మాజీ డీజీపీ ప్రసాదరావు మృతి పట్ల ఏపీ గవర్నర్ హరిచందన్ సంతాపం తెలిపారు. ప్రసాద్‌రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గవర్నర్, సీఎం సంతాపం ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా సేవలందించిన ప్రసాదరావు మరణం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డీజీపీ, కొత్వాల్ దిగ్భ్రాంతి ప్రసాదరావు మృతిపై డీజీపీ మహేందర్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతి తెలిపారు. ప్రసాదరావు మరణించారనే వార్త షాక్‌కు గురి చేసిందని, ఆ విద్యావేత్తకు ఆంగ్లంలో కష్టమైన పదాలు నేర్చుకునే ఆసక్తి ఉండేదని నగర కొత్వాల్ అంజనీకుమార్ అన్నారు. ప్రసాదరావు లేరనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపీరెడ్డి అన్నారు. చదవండి: కాంట్రాక్టరు పాపం, అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు ఏం జరిగిందో ఏమో.. యువతి అనుమానాస్పద మృతి -
సీబీఐ కొత్త చీఫ్‌గా శుక్లా
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త చీఫ్‌గా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషి కుమార్ శుక్లా(58)ను కేంద్రం ఎంపిక చేసింది. ఆయన సీబీఐ డైరెక్టర్‌గా రెండేళ్లపాటు కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంతో కీలకమైన సీబీఐ డైరెక్టర్ పదవిని భర్తీ చేయకుండా ఇంకా ఎంతకాలం ఖాళీగా ఉంచుతారని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, సీబీఐ డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలతో కూడిన అత్యున్నత ఎంపిక కమిటీ జనవరి 24వ తేదీన భేటీ అయినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తిరిగి ఈ నెల ఒకటో తేదీన సమావేశమై అర్హులైన కొందరు అధికారుల పేర్లను పరిశీలించింది. వీరందరిలోనూ ఏకాభిప్రాయంతో ఎంపిక చేసిన అన్ని విధాలుగా అర్హుడైన ఆర్కే శుక్లాను సీబీఐ చీఫ్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శుక్లా 2016 నుంచి ఈ ఏడాది జనవరి వరకు మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బదిలీ చేసింది. కాగా, శుక్లా ఈనెల 4వ తేదీన సీబీఐ చీఫ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ,, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం ఇద్దరినీ సెలవుపై పంపిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో ఎం.నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. ఖర్గే అసంతృప్తి సీబీఐ చీఫ్‌గా రిషి కుమార్ శుక్లాను కేంద్రం ఎంపిక చేయడంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతి కేసుల విచారణలో ఏమాత్రం అనుభవం లేని శుక్లాను నియమించడం ఎంపిక ప్రక్రియను, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. శుక్లా నియామకంపై అసంతృప్తి తెలుపుతూ అత్యున్నత ఎంపిక కమిటీ సభ్యుడు అయిన ఖర్గే శనివారం ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘అవినీతి వ్యతిరేక కేసుల విచారణలో అనుభవం లేని అధికారిని నియమించడం ద్వారా అత్యున్నత ఎంపిక కమిటీ నిబంధనలను అతిక్రమించడంతోపాటు సీబీఐ డైరెక్టర్ ఎంపికలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పట్టించుకోలేదు. కీలకమైన పోస్టులకు అనుభవాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. అవినీతి కేసుల దర్యాప్తులో అనుభవంతోపాటు సీబీఐలో పనిచేసిన అనుభవాన్ని పరిశీలించాలి’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. తప్పుదోవ పట్టించేందుకు ఖర్గే యత్నం సీబీఐ చీఫ్ ఎంపిక ప్రక్రియను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ నేత, అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ సభ్యుడైన మల్లికార్జున ఖర్గే ప్రయత్నించారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. తను సూచించిన వ్యక్తులకు సీబీఐలో స్థానం కల్పించేందుకు, అత్యున్నత స్థాయి సమావేశాల్లో జరిగిన పరిణామాలపై మీడియాకు తన సొంత భాష్యం చెప్పారని విమర్శించారు. మధ్యప్రదేశ్ కేడర్ నుంచి తొలి అధికారి మధ్యప్రదేశ్ కేడర్ నుంచి సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపికైన మొదటి వ్యక్తిగా ఆర్కే శుక్లా చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఆర్కే శుక్లా ఫిలాసఫీలో పీజీ చేశారు. జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ అనంతరం రాయ్‌పూర్, దామోహ్, శివ్‌పురి, మంద్సౌర్ జిల్లాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. మధ్యప్రదేశ్ డీజీపీగా ఆయన దాదాపు రెండున్నరేళ్లు పనిచేశారు. డీజీపీగా.. లైంగిక దాడి కేసులపై త్వరితంగా విచారణ చేపట్టి, శిక్షలు పడేలా చేయడం ద్వారా రాష్ట్రంలో అటువంటి ఘటనల సంఖ్యను గణనీయంగా తగ్గించ గలిగారు. ఆయనకు సీబీఐలో పనిచేయకున్నా ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లో పలు సున్నితమైన కేసులను పరిష్కరించిన అనుభవం ఉంది. బందీలపై సంప్రదింపుల ప్రక్రియ, సంక్షోభ నిర్వహణ వంటి వివిధ అంశాలపై అమెరికా, బ్రిటన్లలో శిక్షణ పొందారు. సీబీఐ పలు వివాదాలతో రచ్చకెక్కిన సమయంలో శుక్లా బాధ్యతలు చేపట్టనుండటంతో అందరి దృష్టీ ఆయనపైనే పడింది. -
మాజీ డీజీపీకి రూ.46 లక్షల భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటి నిర్మాణం కోసం రిజర్వు ఫారెస్టులో స్థలం కొనుగోలు చేయడంతోపాటు విచక్షణారహితంగా చెట్లు నరికేయడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మండిపడింది. బాధ్యత గల పదవిలో ఉండి చట్ట విరుద్ధంగా వ్యవహరించాడని మాజీ డీజీపీపై కొరడా జలిపించింది. అనుమతులు లేకుండా చెట్లు నరికేశారనీ రూ.46 లక్షల భారీ జరిమానా విధించింది. వివరాలు... ఉత్తరాఖండ్‌కు డీజీపీగా పనిచేస్తున్న కాలంలో బీఎస్ సిద్ధు ముస్సోరి రిజర్వు ఫారెస్టులో భూమి కొనుగోలు చేశారు. ఇంటి నిర్మాణం కోసం అందులో ఉన్న 25 సాల్ చెట్లను నరికేయించారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి రిజర్వు ఫారెస్టు ఏరియాలో భూమి కొనుగోలు చేయడంతో పాటు అనుమతులు లేకుండా చెట్లను తొలగించి పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కాడంటూ ఆయనపై ఎన్జీటీ బార్ అసోషియేషన్ ఫిర్యాదు చేసింది. పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ మాజీ పోలీస్ అధికారికి చట్టం గుర్తు చేసింది. నేల కొరిగిన మొత్తం చెట్ల ఖరీదుకు 10 రెట్లు చెల్లించాలని జస్టిస్ ఆర్.ఎస్.రాథోర్ నేతృత్వంలోని బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. 1988 జాతీయ అటవీ విధానం, 1980 జాతీయ అడవుల పరిరక్షణ చట్టం ప్రకారం రిజర్వు ఫారెస్టులో భూమి కొనుగోలు అక్రమమని తేల్చిచెప్పింది. -
నిర్భయ ఇంకెంత అందంగా ఉండేదో..
బెంగళూరు: దేశరాజధానిలో 2012లో కామాంధుల చేతిలో అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన నిర్భయతో పాటు ఆమె తల్లి ఆశాదేవిపై కర్ణాటక మాజీ డీజీపీ హెచ్‌టీ సంగ్లియానా చెత్త వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో పలు రంగాల్లో కృషిచేసిన మహిళలను సన్మానించేందుకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆశాదేవితో కలసి పాల్గొన్న సంగ్లియానా.. ‘నేను నిర్భయ తల్లి ఆశాదేవిని చూశాను. ఈ వయసులోనే ఆమె ఇంతమంచి శరీరాకృతితో ఉందంటే.. నిర్భయ ఇంకెంత అందంగా ఉండేదో ఊహించుకోగలను’ అని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా రేపిస్టులకు దొరికిపోతే ప్రతిఘటించకుండా వారికి లొంగిపోవాలనీ, తద్వారా ప్రాణాలు నిలుపుకోవచ్చని ఆయన సదస్సుకు హాజరైన మహిళలకు సూచించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో తాను ఆశాదేవి, నిర్భయలను పొగిడాననీ, ఎవ్వరినీ అవమానించలేదని సంగ్లియానా వివరణ ఇచ్చారు. మరోవైపు దీనిపై స్పందించిన ఆశాదేవి.. వ్యక్తిగత వ్యాఖ్యలకు బదులుగా సంగ్లియానా తమ పోరాటంపై మాట్లాడి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆలోచనా విధానం మారలేదని తాజా ఘటన రుజువు చేస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. -
కర్నూలులో మాజీ డీజీపీ
కర్నూలు : హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్కావరా స్వగ్రామం అనంతపురం జిల్లాకు వెళ్తూ ఆదివారం సాయంత్రం మాజీ డీజీపీ జేవీ రాముడు కర్నూలులో ఆగారు. ఏపీఎస్పీ బెటాలియన్స్ మూడో రేంజ్ డీఐజీ గోగినేని విజయ్‌కుమార్, కమాండెంట్ శామ్యుల్‌జాన్, ఎస్పీ ఆకె రవికృష్ణ తదితరులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. స్థానిక అతిథిగృహంలో కొద్దిసేపు సమావేశమై జిల్లాలోని శాంతిభద్రతల సమస్యలపై చర్చించారు. ఎస్పీ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయంటూ ఆరా తీశారు. ఇటీవల కాలంలో జిల్లాలో చోటు చేసుకున్న ఫ్యాక్షన్ హత్యల విషయంపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. -
నయీమ్‌ను చూడలేదు: దినేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బతికున్నంతకాలం అతన్ని చూడలేదని, ఎన్కౌంటర్ తర్వాతే మీడియాలో చూశానని రిటైర్డ్ డీజీపీ, బీజేపీ నేత వి.దినేశ్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో శని వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నయీమ్ అధ్యాయం ముగిసిందన్నారు. నయూమ్‌ను ఎన్కౌంటర్ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు అభినందనలు తెలిపారు. అవినీతి, అరాచకాలకు, గ్యాంగ్స్టర్లకు ప్రధాని మోదీ ప్రభుత్వం, బీజేపీ చాలా దూరమన్నారు. నయీమ్ ఘటనపై ఏర్పాటైన సిట్ పటిష్టంగా దర్యాప్తు చేయాలని, దోషులను కఠినంగా శిక్షించేలా చూడాలని దినేశ్‌రెడ్డి కోరారు. సిట్ పనితీరు సరిగ్గా లేకుంటే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. తాను డీజీపీగా పనిచేసినంతకాలం నయీమ్‌ను పట్టుకునే అవకాశం రాలేదన్నారు. మాజీ మావోయిస్టులను ఇన్ఫార్మర్లుగా వాడుకోవడం సహజమని, అయితే నయీమ్‌లాగా గ్యాంగ్స్టర్లను ప్రోత్సహించడం సరికాదన్నారు. మాజీ డీజీపీకి నయీమ్‌తో సంబంధాలున్నాయని మీడియాలో వార్తలు రావడం సరికాదన్నారు. తొందరపడి, పనిగట్టుకుని ఒక మీడియా తనపై దుష్ర్పచారం చేస్తోందని దినేశ్‌రెడ్డి ఆరోపించారు. ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య జరిగినప్పుడు తాను పక్కన ఉన్నట్టు ప్రచారం చేయడం కూడా సరికాదన్నారు. అప్పుడు తాను 400 గజాల దూరంలో ఉన్నానని దినేశ్‌రెడ్డి వెల్లడించారు. డీజీపీ స్థాయి వంటి వారికి నయీమ్ లాంటి వారితో ప్రత్యక్ష సంబంధాలు ఉండవన్నారు. అమాయకులను వేధిస్తే కూడా ఊరుకునేది లేదని దినేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. -
నయీంను చంపడం మంచిదే: దినేశ్ రెడ్డి
-
నయీంను చంపడం మంచిదే: దినేశ్ రెడ్డి
గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్‌కు ఏ డీజీపీ స్థాయి అధికారితోను సంబంధం లేదని మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి తెలిపారు. సంచలనం కోసమే ఇలాంటి ప్రచారం జరిగిందని అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నయీంను చంపడం మంచిదేనని, ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సలాం చేస్తున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరానని, ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన కొంత సున్నితమైన సమాచారాన్ని ఆయనకు అందిస్తానని చెప్పారు. పోలీసు శాఖలో డీజీపీ అంటే అత్యున్నత స్థాయి అధికారి అని, ఇన్ఫార్మర్లను వాళ్లు డీల్ చేయరని చెప్పారు. మహా అయితే డీఐజీ స్థాయి అధికారి మాత్రమే ఇన్ఫార్మర్లను వాడుకుంటారన్నారు. సాధారణంగా లొంగిపోయిన నక్సలైట్లను ఇన్ఫార్మర్లుగా వాడుకుంటారని, అందులో తప్పులేదని తెలిపారు. కానీ దాన్ని సొంత లావాదేవీల కోసం, ఆస్తులు సంపాదించుకోడానికి దుర్వినియోగం చేయడం సరికాదని చెప్పారు. నయీంను చంపడం మంచిదేనని, ఈ కేసులో ఉన్నవారందరినీ బయటకు తేవాలని దినేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని, ఆ విచారణను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. ఈ కేసులో రాజకీయ నాయకులు, పోలీసులు, ఇంకా ఎవరున్నా కూడా వారిని తప్పనిసరిగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో, ఈ కేసుతో సంబంధం లేనివారిని ఇరికిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో కలీముద్దీన్ అనే వ్యక్తి కోసం మాత్రం సీబీఐ వెతికినట్లు తనకు తెలుసని, అంతే తప్ప నయీముద్దీన్ కోసం ఎవరూ రాలేదని తెలిపారు. తాను పార్టీ ప్రతినిధిగా మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పారు. సిట్ విచారణలో తేడా ఏమైనా వచ్చిందనుకుంటే అప్పుడు ఎన్ఐఏ విచారణకు డిమాండ్ చేస్తామన్నారు. ఇలాంటి కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. తనపై ఇంతకుముందు కొంత దుష్ప్రచారం జరిగిందని ఆయన అన్నారు. గతంలో కూడా తాను డీజీపీ కాకముందు కేఎస్ వ్యాస్ పక్కన తాను ఉన్నానని, కాల్పులు జరిపానని ప్రచారం జరిగిందని, కానీ అసలు తాను ఆయన పక్కన లేనని చెప్పారు. వ్యాస్‌కు, తనకు మధ్య 400 గజాల దూరం ఉందని అన్నారు. అలాగే, తాను డీజీపీ కాకముందు శంషాబాద్ ప్రాంతంలో తనకు 1500 ఎకరాల భూములు ఉన్నట్లు నకిలీ పత్రాలతో ప్రచారం జరిగిందని గుర్తుచేశారు. -
దినేశ్ రెడ్డి ప్రెస్‌మీట్ వాయిదా
-
దినేశ్ రెడ్డి ప్రెస్‌మీట్ వాయిదా
హైదరాబాద్: మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు దినేశ్ రెడ్డి విలేకరుల సమావేశం వాయిదా పడింది. బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ వద్దని ఆ పార్టీ నాయకులు సూచించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మరోచోట ఆయన విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశముంది. ఎన్కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీంతో పలువురు పోలీసు మాజీ ఉన్నతాధికారులుకు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విలేకరుల సమావేశంలో ఆయన వివరణ ఇస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, టీడీపీ నాయకులు ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఈ వ్యవహారంపై వివరణయిచ్చారు. నయీం ముఠాతో తమకు ఎటువంటి సంబధాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రికి నయాం గ్యాంగ్ తో సంబంధాలున్నట్టు ఆరోపణలు వచ్చాయి. -
మానవతావాది జేవీ రాముడు
అనంతపురం సెంట్రల్ : మాజీ డీజీపీ జేవీ రాముడు గొప్ప మానవతావాది అని వక్తలు కొనియాడారు. ఇటీవల రాష్ట్ర డీజీపీగా పదవీ విరమణ పొందిన జేవీ రాముడుకు మంగళవారం జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ కన్వెన్షన్ హాలులో ఆత్మీయ సన్మానసభ నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబం నుంచి అత్యున్నత శిఖరాలను అధిరోహించారని కొనియాడారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ జేవీ రాముడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడడంతో పాటు, సమస్యను సావధానంగా వినడం ఆయనకున్న గొప్ప వరమన్నారు. డీజీపీగా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ఎమ్మెల్సీలు మెట్టుగోవిందరెడ్డి, శమంతకమణి తదితరులు మాట్లాడుతూ జేవీ రాముడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు జేవీ రాముడు, పద్మజ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గేయానంద్, జెడ్పీ చైర్మన్ చమన్, మేయర్ స్వరూప, డీఐజీ ప్రభాకర్‌రావు, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, వైఎస్సార్సీపీ నాయకులు మహాలక్ష్మి శ్రీనివాసులు, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, డీఎస్పీలు, సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మాజీ డీజీపీపై దాడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అతివేగం వద్దన్నందుకు తమిళనాడు మాజీ డీజీపీ రామానుజన్‌పై ఓ లారీ డ్రైవర్ దాడి చేసి గాయపరిచిన ఘటన సేలం జిల్లాలో చోటుచేసుకుంది. తమిళనాడు జైళ్లశాఖ డీజీపీగా పనిచేసి ఉద్యోగవిరమణ చేసిన రామానుజన్ ప్రస్తుతం తన సొంతూరైన సేలం సూరమంగళంలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. తన సొంత పని కోసం సోమవారం సాయంత్రం కారులో సెవ్వాయ్‌పేట సత్రం వంతెనపై వెళుతుండగా ఎదురుగా ఒక లారీ అతివేగంతో అతని కారును ఢీకొనే రీతిలో వచ్చింది. కారు నుంచి కిందకు దిగిన రామానుజన్ ఎందుకు ఇంత వేగంగా లారీ నడుపుతున్నావని మందలించారు. దీంతో లారీడ్రైవర్ సైతం కిందకు మాజీ డీజీపీని దుర్భాషలాడడంతో పాటూ పిడిగుద్దులు కురిపిస్తూ దాడికి పాల్పడ్డాడు. కిందపడిపోయిన రామానుజన్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు లారీ డ్రైవర్ పాండియన్ (28)ను అరెస్ట్ చేశారు. -
కాపులు ఏమైనా టెర్రరిస్టులా: మాజీ డీజీపీ
కాపుల ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తగదని మాజీ డీజీపీ ఎంవీ భాస్కరరావు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడుగుతున్న కాపులు ఏమైనా టెర్రరిస్టులా అని ఆయన ప్రశ్నించారు. కాపు ఉద్యమాన్ని కవర్ చేస్తున్న సాక్షి చానల్‌ను నియంత్రించడం సరికాదని, ఇది మీడియా గొంతును నొక్కేయడమే అవుతుందని భాస్కరరావు తెలిపారు. కాపులు కొత్తగా హామీలు ఇవ్వాలని ఏమీ అడగడం లేదని, ఇప్పటికే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే అడుగుతున్నారని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి మూడు నెలల సమయం సరిపోతుందని, అంతే తప్ప అరెస్టులు ఈ సమస్యకు పరిష్కారం కాదని ఆయన చెప్పారు. -
బాబా సేవా స్ఫూర్తి కొనసాగింపే లక్ష్యం
► మాజీ డీజీపీ హెచ్‌జే దొర పుట్టపర్తి : సత్యసాయి సేవా స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే దిశగా ప్రతి సాయిభక్తుడు అడుగులు వేయాలని సత్యసాయి సేవా సంస్థల సమ్మేళనంలో మాజీ డీజీపీ హెచ్‌జే దొర పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సత్యసాయి సేవా సమితులు, భజన మండళ్లు, జిల్లా పదాధికారుల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ఘనంగా ముగిసింది. హెచ్‌జే దొర మాట్లాడుతూ సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలను వారసత్వంగా భావించి కాపాడుకోవాలన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు చలం మాట్లాడుతూ ప్రతి సత్యసాయి భక్తుడు ధృడ సంకల్పం, చిత్తశుద్ధి,అంకితం భావంతో సత్యసాయి సేవా సంస్థలు నిరే్ధశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రాబోవు రోజులలో సత్యసాయి సేవలను విస్తృతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ముగింపు సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జె.రత్నాకర్రాజు సమ్మేళనానికి హాజరైన ప్రతినిధులకు నూతన వస్త్రాలను, సత్యసాయి ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రసాద్‌రావు, సత్యసాయి భజన మండళ్లు,సేవా సమితుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మాజీ డీజీపీ బంధువు ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్:హైదరాబాద్: మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బంధువు ఇంట్లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ లోని ఆయన సోదరుడి కుమార్తె ఇంట్లో సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో పాటు పలు విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం-58 లో ఉండే దినేష్ రెడ్డి సోదరుడి కుమార్తె దివ్యారెడ్డి గతనెల 4 న అమెరికా వెళ్లింది. వెళ్లు ముందు వజ్రపు ఉంగరాలు, గాజులు దుస్తుల మధ్యలో ఉంచి, వాటిని ఒక బ్యాగ్ లో పెట్టి తన తల్లి వద్దకు పంపింది. అయితే దుస్తుల్లో నగలు పెట్టిన విషయాన్ని తల్లికి చెప్పడం మరిచిపోయింది. గత నెల 17 న దివ్యారెడ్డి అమెరికా నుంచి తిరిగి రావడంతో తల్లి తన వద్ద ఉన్న బ్యాగులో మరికొన్ని దుస్తులు పెట్టి తిరిగి పంపింది. అయితే అప్పటి నుంచి దివ్యారెడ్డి బ్యాగ్ లోని నగలను చూసుకోలేదు. కాగా గత నెల 30 న బ్యాగ్ లో చూసుకోగా నగలు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దివ్యారెడ్డి నివాసంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు నిందితుల ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది. -
ఆధారాలుంటే ఏసీబీ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి స్పష్టీకరణ * కేసీఆర్‌పై ఏపీలో కేసులు నమోదైనా విచారణ జరగాల్సింది ఇక్కడే * ఒక రాష్ట్రంలో మరో రాష్ట్ర పోలీస్స్టేషన్లు ఉండవు సాక్షి, హైదరాబాద్: ఏదైనా నేరంపై తమ వద్ద ఉన్న ఆధారాలతో సీఆర్పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) కింద ఎవరినైనా విచారించే విశేషాధికారాలు ఏసీబీకి ఉన్నాయని మాజీ డీజీపీ, బీజేపీ నేత వి.దినేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించి ఆధారాలుంటే ఆయనకూ నోటీసులివ్వొచ్చన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ ్యంలో దినేష్‌రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.. ⇒ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఫిర్యాదు మేరకు ఏసీబీ స్టింగ్ ఆపరే షన్ నిర్వహించింది. దీనికి ఆడియో విజువల్ సాక్ష్యాలున్నాయి. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుగుతోంది. ఏసీబీ దర్యాప్తులో నిందితులుగా భావించిన వారెవరికైనా, సీఎంకైనా నోటీసులు జారీచేసే అధికారాన్ని సీఆర్పీసీ కల్పిస్తోంది. దీనికి ఎవరి అనుమతులూ అక్కర్లేదు. ⇒గవర్నర్ రాజ్యాంగబద్ధంగా పనిచేసే పౌరుడు. రెండు రాష్ట్రాల గవర్నర్‌గా ఆయనకు రెండు ప్రాంతాల ప్రజలూ ముఖ్యమే. పక్షపాతంగా వ్యవహరిస్తారని నేననుకోను. రెండు రాష్ట్రాల వివాదంలో కేంద్రం నేరుగా జోక్యం చేసుకోదు. గవర్నర్‌కే బాధ్యతను అప్పగిస్తుంది. ⇒ కేసీఆర్‌పై ఏపీలో కేసులు నమోదైనా.. ట్యాపింగ్ హైదరాబాద్లోజరిగిందంటున్నప్పుడు విచారణా ఇక్కడే జరగాలి. ఇక్కడ కేసులు పెడితే న్యాయం జరగదని ఏపీ ప్రభుత్వం భావిస్తే గవర్నర్ ఈ అంశాన్ని కోర్టుకే అప్పగిస్తారు. హైదరాబాద్ టీ సర్కార్, పోలీసుల పరిధిలో ఉంది. ఇక్కడ వేరే రాష్ట్రాలకు చెందిన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం సరికాదు. ⇒ సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులకు నష్టం కలిగించే విధంగా టీ సర్కార్, పోలీసులు వ్యవహరిస్తే గవర్నర్ జోక్యం చేసుకుంటారు. కానీ మొత్తం శాంతిభద్రతలు గవర్నర్ చేతిలోకి వెళ్లడం అనేది కాదు. కేవలం రాష్ట్రపతి పాలనలో మాత్రమే రాష్ట్ర శాంతిభద్రతల బాధ్యతను గవర్నర్ పర్యవేక్షిస్తారు. -
ఉతికిన ఆ తెల్లచొక్కా...
బెస్ట్ కేస్ విజయవాడలో ఏఎస్పీగా చేరిన కొత్తలో నాకు అంతా కొత్తగానే ఉండేది. ముఖ్యంగా గ్రామాల్లో వాతావరణం! మనుషులు అలవాటు పడటానికి సమయం పడుతుంది కదా! విజయవాడలోని నందిగామ గ్రామంలో 1975లో జరిగిన ఆ సంఘటన... నెల కూడా గుర్తుంది... సెప్టెంబర్. ఒకరోజు సాయంత్రం ఆరుగంటలకు ఓ ఇద్దరు కుర్రాళ్లు పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. అందులో ఒకతను ‘మా అమ్మను ఎవరో చంపేశారు’ అంటూ ఆయాసపడుతూ చెప్పాడు. సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే గుడిసెలో 45 ఏళ్ల మహిళ మృతదేహం రక్తపుమడుగులో పడివుంది. భర్త లేడు. ఒక్కడే కొడుకు. అతనికి పెళ్లయింది. ఎవరో ఆ మహిళని చెంబుతో తలమీద మోది చంపేశారు. వెంటనే జాగిలాలను రప్పించాను. అవి గుడిసెలో నుంచి బయటకి వచ్చి ఊళ్లోకి వెళ్లాయి. అక్కడ కొంతదూరం వెళ్లాక ఆగిపోయాయి. ఆ పరిసరాల్లోనే మృతురాలి కొడుకు స్నేహితుడి ఇల్లు ఉన్నట్టు అక్కడివారు చెప్పారు. జోస్యం కోసం... ‘‘నేను, నా భార్య, నా స్నేహితుడు, అతని భార్య... అందరం కలిసి సినిమాకి వెళ్లాం సార్. తిరిగొచ్చిచూస్తే అమ్మ ఇలా శవమై కనిపించింది’’ అంటూ బోరుమన్న పాతికేళ్ల కొడుకుని ఓదార్చి విచారణ మొదలుపెట్టాం. ముందుగా మృతురాలి వివరాలు సేకరించాం. ఆమె మంత్రతంత్రాలు తెలిసిన మహిళ. ఆ గ్రామం వాళ్లే కాదు, చుట్టుపక్కల ఊళ్లవాళ్లు కూడా ఏ చిన్న సమస్య ఉన్నా ఆమె దగ్గరికి వచ్చేవారు. కడుపులో నొప్పి నుంచి మొదలుపెట్టి, తప్పిపోయిన పశువుల ఆచూకీ వరకు అన్నింటికీ ఆమెను సంప్రదించేవారు. ఆమె మంత్రమో, అంజనమో వేసి వాళ్లకు పరిష్కారాలు సూచిస్తుందన్నమాట. పల్లెటూళ్లలో ఇలాంటివారుండటం సహజమే కదా! రోజూ ఆమెను కలవడానికి చాలామంది వచ్చేవారు. ఆమెకు ఎవరితోనైనా తగాదాలున్నాయోమోనని ఆరా తీస్తే అలాంటివేమీ లేవని తేలింది. గుడిసెలో అణువణువూ గాలించడం మొదలుపెట్టాం. ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆమెపై దాడికి ఉపయోగించిన చెంబుపై వేలిముద్రలు కూడా దొరకలేదు. హంతకుడు చాలా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు కనిపించడం లేదని చెప్పాడు కొడుకు. ముఖ్యంగా తల్లి మెడలోని బంగారు గొలుసు! ఆ పెట్టె లోపల... గుడిసెలో ఒక మూలన చాలా పాత ఇనప్పెట్టె ఒకటి కనిపించింది. దానికి తాళం వేసి ఉంది. తాళం గురించి అడిగితే మృతురాలి కొడుకు ‘ఏమో తెలియ’దంటూ అమాయకంగా మొహం పెట్టాడు. ఎందుకో అతని సమాధానం కరెక్టు కాదని అనిపించింది నాకు. లాభం లేదని పెట్టెని పగలగొట్టాం. అందులో ఏమీ లేదు. ఒక తెల్లని చొక్కాగుడ్డ ఉంది. చూడ్డానికి చాలా కొత్తగా ఉంది. విప్పి చూస్తే అక్కడక్కడా చిన్న చిన్న రక్తపు మరకలు కనిపించాయి. ‘ఏంటి’వని అడిగితే ఆమె కొడుకు నాకు తెలియదంటాడు. అతని స్నేహితుణ్ణి పిలిచి అడిగినా అదే సమాధానం చెప్పాడు. హంతకుడు మాకోసం వదిలిన క్లూ మాత్రం అదేనని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. దానిపైనే దృష్టి పెట్టాను. ఒక టీమ్‌ని ఆ ప్రాంతంలోని బట్టల షాపుల వివరాలు కనుక్కురమ్మని పంపాను. ఆ ఫొటో వెనక... ఆ ప్రాంతంలో మొత్తం మూడే మూడు బట్టల షాపులున్నాయి. వాళ్లకి ఈ క్లాత్‌ని చూపించాం. దాన్ని అమ్మిన షాపు దొరికింది. వారికి మృతురాలి కొడుకు ఫొటో చూపించగానే ‘ఇతనే సార్, నెలరోజుల కిందట వచ్చి పెళ్లి కోసమని నాలుగైదు షర్టు పీసులు కొనుక్కెళ్లాడు’ అని చెప్పారు. నా అనుమానం బలపడింది. తిరిగి గుడిసె దగ్గరికి వెళ్లి మరింత పరిశీలనగా చూస్తే దండెంపై ఆరేసి ఉన్న తెల్లచొక్కాకి అక్కడక్కడా ఆరెంజ్ రంగు మరకలున్నట్టు కనిపించింది. దాన్ని వెంటనే ఫొరెన్సిక్ ల్యాబ్‌కి పంపిస్తే చొక్కాపై రక్తపు మరకలు పడ్డట్టూ, దాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించినట్టూ చెప్పారు. విచారణలో భాగంగా మా జాగిలాలు వెళ్లిన అతని స్నేహితుడి ఇంటికి కూడా వెళ్లి అంతా సోదా చేస్తే ఆ ఇంట్లో గోడకు తగిలించిన దేవుడి పటం వెనక మృతురాలి గొలుసు దొరికింది. ఇక దొరికిన సాక్ష్యాలు చాలని చెప్పి... మృతురాలి కొడుకుని స్టేషన్‌కి తీసుకెళ్లి విచారిస్తే విషయం బయటపడింది. కన్నతల్లిని తానే స్వయంగా హత్య చేసిన వైనం చెప్పుకొచ్చాడు. అక్రమ సంబంధం... ఎప్పుడూ వెంట తిరిగే తన స్నేహితుడికీ, తల్లికీ అక్రమ సంబంధం ఉన్నట్టు అప్పటికి నెలరోజుల క్రితం బయటపడింది. తన పెళ్లయితే తల్లి ప్రవర్తన మారుతుంది కదా అని ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. అయినా ఎలాంటి మార్పూ రాలేదు. స్నేహితుణ్ణి మందలించి అతణ్ణి కూడా పెళ్లిచేసుకోమని చెప్పి దగ్గరుండి పెళ్లి చేశాడు. ఒకరోజు తల్లి ఇతని స్నేహితుడితో గొడవకు దిగింది. ‘నాతో నీకు సంబంధం ఉండగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకు తెలియదా నాకున్న మంత్రశక్తుల గురించి. నిన్నూ, నీ భార్యనూ బూడిద చేసేస్తాను...’ అంటూ తల్లి... స్నేహితుడిపై విరుచుకు పడుతుండగా కొడుకు ఎదురుపడి తల్లిని నిలదీశాడు. దాంతో కొడుకుని కూడా అదేవిధంగా బెదిరించడం మొదలుపెట్టింది. తల్లి ప్రవర్తనతో విసిగిపోయిన కొడుకు, అతని స్నేహితుడు ఒకరోజు సాయంత్రం ఆమెను హతమార్చారు. ఇదీ విషయం. చనిపోయిన వ్యక్తి మంత్రగత్తె కావడంవల్లనేమో తెల్లవారే సరికి గ్రామస్తులంతా ఆమె గుడిసెముందు, మా పోలీస్టేషన్ ముందు ఉండేవారు. ‘సార్, హంతకుడు దొరికాడా... దొరికాడా...’ అంటూ అడుగుతుండేవారు. అలాగని విచారణకు ఏమైనా సాయం చేస్తారా అంటే ఏమడిగినా తెలియదని చెప్పేవారు. తక్కువ సమయంలో... నాకేమో అక్కడి వాతావరణం కొత్త. పల్లె ప్రజల పద్ధతులు, నమ్మకాల గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ఇలాంటి కేసుని నాలుగురోజుల్లో విజయవంతంగా చేధించినందుకు మా పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: రాజేశ్ -
అడవిలో అర్ధరాత్రి...
బెస్ట్ కేస్ మాజీ డీజీపీ ఎ.కె.ఖాన్ చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ కరీంనగర్ జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తున్నప్పుడు నేను ఛేదించిన ఒక కేసు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కరీంనగర్‌కి, వరంగల్‌కి సరిహద్దు ప్రాంతం తాడిచర్ల మండలం దగ్గర జరిగిన ఘటన అది. ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు కబురు వచ్చింది. దగ్గర్లోని అటవీ అధికారులపై జంతువులు దాడి చేసి చంపేశాయని. ఎక్కడో, ఏమిటో వివరాలు సరిగ్గా లేవు. నేను, ముగ్గురు పోలీసులం జీపులో బయలుదేరాం. కొంతదూరం వెళ్లాక కాలినడకన ప్రయాణం మొదలుపెట్టాం. అమావాస్య రోజులు కావడంతో చిమ్మచీకటి. టార్చిలైట్ల వెలుతురులో అడుగులు వేసుకుంటూ వెళుతుంటే దారికడ్డంగా కొండచిలువ. దాని తలెక్కడుందో తెలీలేదు. మెల్లగా తప్పించుకుని ముందుకు వెళ్లాం. విషయం ఏంటంటే ఆ అడవి క్రూరమృగాలకు నెలవు. చిరుతపులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవి. పైగా వాటి ‘చేతిలో’ చనిపోయిన అధికారుల దేహాలను వెతకడానికి వెళుతున్నాం. భయం ఖాకీ చొక్కాకి ఉండదేమోగానీ ఆ చొక్కా లోపల ఉన్న మాకుంటుంది కదా! రాత్రి రెండు గంటలకు... ఓ రెండుగంటల కాలినడక ప్రయాణం తర్వాత అటవీ అధికారుల మృతదేహాలు కనిపించాయి. ఒళ్లంతా రక్కినట్టు ఉంది. పులి దాడిచేసిందనుకున్నాం. మృతదేహాలను అడవిని ఆనుకుని ఉన్న తండాకు తీసుకెళ్లాం. తెల్లారాక తిరిగి ఆ మృతదేహాలు దొరికిన సంఘటనా స్థలానికి వెళ్లాం. అంతకు ముందురోజు మేం నడిచిన ఆనవాళ్లతో సహా సంఘటనా స్థలంలో కూడా కొన్ని గుర్తులు కనిపించాయి. ముఖ్యంగా మృతదేహాలు దొరికిన చోటుకు నాలుగు అడుగుల దూరంలో ఎండ్లబండి చక్రాల గుర్తులు కనిపించాయి. ‘‘సార్, పులులు దాడి చేసి చంపి వుంటే ఇక్కడ ఈ ఎండ్లబండి చక్రాల ఆనవాళ్లేంటి? ఎవరో వీరిని చంపి ఇక్కడ పడేయలేదు కదా’’ అన్న మా కానిస్టేబుల్ మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి. ఆ చక్రాల గుర్తులు ఎండ్లబండివే కానీ చక్రానికీ, చక్రానికీ మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ ఎండ్లబండి అందరి దగ్గర ఉండే ఎండ్లబండి లాంటిది కాదు! వెంటనే ఆ చక్రాల మధ్య ఉన్న దూరాన్ని కొలిచి... చుట్టుపక్కల ఊళ్లలోకి వెళ్లి అలాంటి బండ్లు ఎక్కడున్నాయో తెలుసుకున్నాం. అడవి చుట్టుపక్కల పది ఊళ్లలో అలాంటి బండ్లు మూడు ఉన్నట్టు తెలిసింది. రక్తపు చుక్కలు... మూడు బండ్ల యజమానులను రప్పించి మాట్లాడాం. అధికారులు చనిపోయిన రాత్రి ఆ మూడు బండ్లు ఎక్కడున్నాయో సాక్ష్యాలతో చెప్పమన్నాం. రెండు బండ్ల సమాచారం బాగానే వచ్చింది కానీ మూడో బండి యజమాని చెప్పిన విషయాలు కాస్త తేడాగా అనిపించాయి. ‘‘అంతకు ముందురోజు మా పక్కూరి నుంచి బండి కావాలని వచ్చారు సార్. పైసలిస్తామన్నారు కదా అని ఇచ్చాను. మరి వాళ్లు దేనికి వాడుకున్నారో నాకు తెలీదు’’ అన్నాడు. వెంటనే ఎండ్లబండిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎడ్లను కట్టే కాడెపై నాలుగైదు రక్తపు మరకలు కనిపించాయి. ఇవేమిటని అడిగితే బండిని వాడుకున్నవాళ్లు చెప్పిన సమాధానం నమ్మాలనిపించలేదు. ‘‘వేసవికాలం కదా సార్... ఎడ్ల ముక్కుల్లోంచి రక్తం కారుతుంది. వాటి మరకలేమో!’’ అన్నారు. వెంటనే ఆ కాడెపై ఎండిన రక్తం శాంపిల్స్‌ని సేకరించి హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించాం. వివరాలు వెంటనే పంపమని ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని పంపించాను. సవాల్‌గా తీసుకున్నాను... అడవిని రక్షించడం కోసం పనిచేస్తున్న అధికారులను హత్య చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ హత్యను మేం తేలిగ్గా తీసుకుంటే ఏకంగా అటవీశాఖా యంత్రాంగాన్నే చులకనగా చూస్తారు. అటవీ సంపదను దోచుకోవడానికి వచ్చే స్మగ్లర్ల నుంచి ప్రతి నిమిషం ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా ధైర్యంగా పనిచేసే అధికారులపై చెయ్యివేసే ధైర్యం ఎవరికొచ్చిందని నా గుండె రగిలిపోతోంది. దాంతో ఈ కేసుని డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టల విషయంగా తీసుకున్నాను. ఏ గ్రామం వాళ్లయితే ఆ బండిని అద్దెకు తీసుకున్నారో అక్కడే ఒక వారంరోజులు తిష్టవేశాం. ఎవరిని అడిగినా మాకేం తెలుసంటారు! ఒక్క బండిపై ఉన్న రక్తపు మరకలు తప్ప ఇంకే ఆధారాలూ దొరకలేదు. సంఘటనా స్థలంలో దొరికిన చిన్న చిన్న ఆధారాలు చేతిలో ఉన్నా అవి హంతకుల చిరునామాని చెప్పలేకపోయాయి. ఇంతలో హైదరాబాద్ నుంచి సమాచారం వచ్చింది. ఆ రక్తం ఎద్దుది కాదు మనిషిదని! అంతే విచారణ వేగం పెంచాం. ఆ నలుగురు... అటవీ అధికారుల్ని చంపింది పులులు, సింహాలు కాదనీ, మనుషులనీ స్పష్టమైన విషయాన్ని అన్ని గ్రామాల్లోని వారికి తెలియజేశాం. అయినా మేం తిష్టవేసిన గ్రామవాసుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఎవరూ కూడా అయ్యోపాపం అనలేదు. నాకు సందేహం వచ్చి ఓ నలుగురు కుర్రాళ్లను విచారిస్తే విషయం బయటపడింది. ఆ గ్రామస్తులే అధికారుల్ని హత్య చేశారని. వారిపై అనుమానం రాకుండా ఉండేందుకు అధికారుల శరీరంపై గోళ్లతో రక్కినట్టు చేశారు. కళ్ల గుడ్లని బయటికి తీసేశారు. అలా జంతువులే చేస్తాయనీ, వారిపై మాకు అస్సలు అనుమానం రాదనీ వారి నమ్మకం. కాని మాకు విషయం తెలిసిపోయాక గ్రామస్తులంతా ఒకచోట కూడి మాకు జరిగిన విషయం చెప్పారు. అధికారులు వారి గ్రామస్థుల్ని బాగా ఇబ్బందిపెట్టేవారట. డబ్బులకోసం, అవసరమైన వస్తువుల కోసం వారిని వేధించేవారట. చాలా రకాలుగా అధికారులతో విసిగిపోయి, వారి పీడని వదిలించుకోవడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అడవిలోకి ఆవుల్ని తోలుకెళ్లినా, గొర్రెల్ని కొట్టుకెళ్లినా ఫైన్ కట్టమంటూ ఇబ్బంది పెట్టేవారనీ, వారితో ఇంకా ఏవో ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొన్నామనీ చెప్పుకొచ్చారు. ఏదైతేనేం... అధికారులు నిజంగా గ్రామస్థుల్ని ఇబ్బంది పెట్టారనుకోండి. దానికి పరిష్కారం ఇంత ఘోరంగా హత్యచేయడం కాదు కదా! పైగా ఎప్పుడూ మేం అందుబాటులో ఉంటాం. డిపార్ట్మెంటు ఉద్యోగులపై దాడి చేయడం అటవీశాఖలోనే కాదు, మా పోలీసుశాఖలో కూడా తీవ్ర కలకలం రేపింది. ఏ దుండగులో అంటే కాదు... గ్రామం మొత్తం ఏకమై చేసిన పని. హత్యలో ఎంతమంది పాల్గొన్నారని ఆరాతీస్తే మేమందరం అంటూ ఊరి ప్రజలంతా చేతులెత్తుతున్నారు. రెండుమూడు వందలమంది ఉంటారు. ఎవరినని అరెస్టు చేస్తాం. అయినా మా పద్ధతి ప్రకారం విచారణలో ఒక్కక్కరిని వదిలి అసలు హంతకుల పేర్లను రాబట్టాం. అధికారులను వెంటాడినవారు, హత్య చేసినవారు, అనుమానం రాకుండా వారిపై గోళ్లగాట్లను పెట్టినవారు, ఎండ్లబండిపై తీసుకెళ్లి అక్కడ పడేసినవారు, చూసి కూడా తెలియనట్టు నటించినవారు... ఇలా హత్యలో పాల్గొన్న పాత్రధారులందరిని వేరు చేసి, వారిపై వేర్వేరు కేసులు పెట్టి సాక్ష్యాలను కోర్టుకి అప్పగించాం. కేసు విచారణ తర్వాత అందరికీ శిక్షలు పడ్డాయి. వారి వారి నేరాల్ని బట్టి అందరికీ పెద్ద శిక్షలే పడ్డాయి. ఇది జరిగిన నేటికి ముప్పైరెండేళ్లవుతోంది. కానీ ఇప్పటికీ క్రైమ్ అనగానే నా కళ్లముందు ఉండే కేస్ ఇది! రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటోలు: రాజేశ్ రెడ్డి ఆ చక్రాల గుర్తులు ఎండ్ల బండివే కానీ చక్రానికీ, చక్రానికీ మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ ఎండ్లబండి అందరి దగ్గర ఉండే ఎండ్లబండి లాంటిది కాదని అర్థమైంది. అడవిని రక్షించడం కోసం పనిచేస్తున్న అధికారులను హత్య చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ హత్యను మేం తేలిగ్గా తీసుకుంటే ఏకంగా అటవీశాఖా యంత్రాంగాన్నే చులకనగా చూస్తారు. -
మాజీ డీజీపీకి బెయిల్ మంజూరు
పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన శారద చిట్ ఫండ్ కుంభకోణంలో ఆ రాష్ట్ర మాజీ డీజీపీ, ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు రజత్ మజుందార్‌కు కోల్‌కతా హైకోర్టు సోమవారం బెయిల్ మజూరు చేసింది. స్కాంలో రజత్ ప్రమేయం ఉన్నట్లు సీబీఐ నిరూపించలేకపోయిందని రజత్ తరఫు న్యాయవాది వాదించగా, ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ సీబీఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం రూ. 11లక్షల వ్యక్తిగత పూచీకత్తు, పాస్ పోర్టుల స్వాధీనం వంటి షరతులతో రజత్‌కు బెయిల్ మంజూరుచేసింది. -
'అప్పన్న' పచ్చలపతకం చోరీ స్టోరీ
మాజీ డీజీపీ ఎం.వి.భాస్కరరావు చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ పొద్దున్నే ఐదున్నరకు సింహాచలం ఆలయ పూజారుల నుంచి ఫోన్... ‘‘గర్భగుడిలో దొంగలు చొరబడి స్వామివారి ఆభరణాలన్నీ దోచుకుపోయా’’రని. తిరుపతి తర్వాత ఆ స్థాయి ఆదరణ ఉన్న ఆలయం సింహాచలం. తెలుగువారు, ఒడిశా భక్తులతో ఎప్పుడూ కిటకిటలాడే దేవాలయంలోకి దొంగలు రావడమేంటి? వెళ్లి చూస్తే దొంగలు గుడి వెనకద్వారం గొళ్లెం పగులగొట్టి లోపలికి వచ్చారు. స్వామివారి ఒంటిపై ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్లిపోయారు. ఇంకా నయం... బోషాణం పెట్టె దగ్గరికి పోలేదని మనసులో అనుకుంటుండగా... ఆలయ పూజారి కంగారుగా ‘సార్... స్వామివారి మెడలోని పచ్చలపతకంతో ఉన్న హారం కూడా పోయింది సార్’ అన్నాడు. ఆ జిల్లా ఎంపీ హడావుడి చేయడం మొదలుపెట్టాడు. దొంగలెత్తుకుపోయిన పచ్చలపతకం ఐదు వందల ఏళ్లక్రితపుదనీ, అంతర్జాతీయ మార్కెట్లో దాని వెల ఎనిమిది వందల నుంచి వెయ్యికోట్లవరకూ పలుకుతుందనీ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. 1978లో జరిగిన ఈ దొంగతనం కేసు చాలా పాపులర్ అయ్యింది. అప్పుడు నేను విశాఖపట్నం ఎస్పీగా పనిచేస్తున్నాను. ఎప్పటిలాగే ఉదయం నాలుగున్నరకు గుడి పూజారులు తమ పనులకు దిగారు. ఐదింటికి గర్భగుడి దగ్గరికి వెళ్లేసరికి దొంగతనం జరిగిన విషయం తెలిసింది. వెంటనే మాకు కబురు పంపారు. వాచ్‌మేన్‌ని అడిగితే రాత్రి ఒంటిగంటవరకూ మెలకువగా ఉన్నట్లు చెప్పాడు. తాను నిద్రలో ఉండగా ఈ ఘోరం జరిగినట్టు చెప్పాడు. దొంగతనం జరిగిన తీరును చూస్తే గుడిలో దొంగలు రెండుగంటలపాటు ఉన్నట్లు అర్థమవుతోంది. ఆరు కిలోమీటర్ల ఎత్తున ఉన్న దేవాలయం కొండ దిగి మెయిన్‌రోడ్డుపైకి వెళ్లాలంటే కనీసంరెండు మూడు గంటలు పడుతుంది. గుడికి వెళ్లే రోడ్డుగుండా దొంగలు వెళ్లే ఆస్కారం లేదు. ఎందుకంటే నాలుగింటినుంచే పాలవాళ్లు, పూలవాళ్లు, పండ్ల వ్యాపారులు ఆ మార్గం నుంచి వస్తుంటారు. ఇక మరో మార్గం అంటే గుడి వెనకవైపున్న అడవిలోనుంచి కాలినడకన పారిపోవాలి. ఆలస్యం చేయకుండా పోలీసులు అడవంతా గాలిస్తే దొంగలు దొరికే అవకాశం ఉంది. ఒకర్ని ఇద్దరినీ కాదు... డీఎస్పీతో సహా వందమందికిపైగా పోలీసుల్ని ఐదారు జట్లుగా చేసి అడవిలోకి పంపించాను. ఒత్తిడి కారణంగా... జరిగింది చిన్నచోరీ కాదు. బంగారం రెండు కిలోలకుపైగా ఉంటుందని చెబుతున్నారు. పచ్చలపతకమున్న హారం వల్ల నాపై ప్రెజర్ పెరిగిపోయింది. ఇప్పట్లోలా డాగ్స్టీం వంటివి లేవు. ఒకవేళ హైదరాబాద్ నుంచి కుక్కల్ని రప్పిద్దామన్నా రోజు పడుతుంది. హైదరాబాద్ నుంచి ఐజీ, డీఐజీ, ముఖ్యమంత్రిల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అడవిలోకి వెళ్లిన పోలీసులేమో వెనక్కి వచ్చేసి ఎవరూ కనిపించలేదని చెప్పడం మొదలెట్టారు. నా అంచనా ప్రకారం వారు అడవిదాటిపోయే అవకాశమే లేదు. బాస్ దగ్గర లేకపోతే ఎవరికైనా అలుసేకదా! ఏం చేస్తాను... సంఘటనా స్థలానికి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించాను. తాళం పగలగొట్టిన గడ్డపారకు బట్టచుట్టడం, దేవుడి దగ్గర ప్రసాదం మొత్తం తినడం, సగం కాల్చిన సిగరెట్ పీకలు... ఇది కచ్చితంగా బిట్రగుంట గ్యాంగ్ పనే అనుకున్నాను. వాళ్లే అనడానికి ఆలయ ప్రాంగణంలో దొరికిన సిజర్స్ బ్రాండ్ సిగరెట్ పెట్టె ఒక ఆధారమైంది. అప్పట్లో అంత ఖరీదైన సిగరెట్ కాల్చేవారు విశాఖపట్నం ప్రాంతంలోనే లేరు. గర్ల్‌ఫ్రెండ్‌ని అడిగితే... నేను ఉద్యోగంలోకి చేరిన కొత్తల్లో కొన్నాళ్లు గుంటూరులో పనిచేశాను. అక్కడే ఉండే బిట్రగుంట దొంగల గురించి తెలుసుకున్నాను. వాళ్లు దొంగతనం చేసే విధానం గురించి నాకు అవగాహన ఉంది. నాకు ఎప్పుడయితే అనుమానం వచ్చిందో ఆ గ్యాంగ్ లీడర్ చవటా ప్రసాద్ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను. అతని స్పెషాలిటీ ఏంటంటే... దాదాపు నలభై ప్రాంతాల్లో గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారు. మా సింహాచలం ప్రాంతంలో కూడా ఒకామె ఉంది. ఆమెని స్టేషన్‌కి తీసుకొచ్చి నాలుగు కేకలు వేయగానే జరిగిందంతా చెప్పింది. చవటా ప్రసాద్, అతని గ్యాంగ్ మూడురోజుల క్రితమే తన ఇంటికి వచ్చి గుడికి సంబంధించి రెక్కీలు వేసుకుని పనిపూర్తిచేసుకుని పారిపోయారని చెప్పింది. బిట్రగుంట దొంగలముఠాకి అప్పట్లో పెద్ద పేరు. వాళ్లు క్రిమినల్ ట్రైబ్స్ అన్నమాట. దృఢంగా, తెలివిగా ఉండేవారు. చవటా ప్రసాద్‌పై అప్పటికే నలభై కేసులున్నాయి. ఆరుసార్లు పోలీసుల చేతుల్లోనుంచి తప్పించుకున్నాడు. మద్రాసు సెంట్రల్‌జైలు నుంచి కూడా తప్పించుకున్న చరిత్ర ఉంది. పదిహేను రోజుల్లో... దొంగలెవరో తెలిసిపోయింది కాబట్టి ప్రెజర్ తగ్గింది. కానీ ప్రతిపక్షంవారు, ఢిల్లీ అధికారులు పచ్చలపతకం దేశం దాటిపోతోందంటూ చేస్తున్న ఊహగానాలు ప్రశాంతత లేకుండా చేశాయి. ఆ పతకం శ్రీకృష్ణదేవరాయలు ఎంతో ప్రేమతో స్వామివారికి బహుమానంగా ఇచ్చారనీ, ఇలాంటి పతకం ఎలిజిబెత్‌రాణి దగ్గర కూడా లేదనీ, ఆ పతకంగానీ దొరక్కపోతే డిపార్టుమెంట్ పరువుపోతుందనీ నానాయాగీ చేశారు. దొంగలు ఎక్కడివారో తెలియగానే నేను వెంటనే గుంటూరు ఫోన్ చేసి బిట్రగుంట దొంగలుండే ప్రాంతంపై నిఘా పెట్టమన్నాను. నేను చెప్పిన పద్ధతిలోనే మెరుపుదాడి చేసి వారిని పట్టుకున్నారు. అందరూ దొరికారు కానీ చవటా ప్రసాద్ దొరకలేదు. దొరికినవారు బంగారాన్ని పంచేసుకుని ఎవరికివారు దాచేసుకున్నారు. అందరినీ ఇంటరాగేషన్ చేసి సొమ్ము మొత్తాన్ని రాబట్టాం. అరవైశాతం బంగారం దొరికింది. పెద్దవాటా తీసుకోవడం వల్ల ప్రసాద్ దగ్గర 40 శాతం సొమ్ము ఉండిపోయింది. పచ్చలపతకం ఉందో లేదో చూస్తే...దాన్ని ఐదు ముక్కలు చేశారు. మూడు ముక్కలు మాత్రమే దొరికాయి. 15వేలు మాత్రమే... దొరికిన బంగారం మొత్తం తీసుకెళ్లి మార్వాడి ముందుపెడితే పదిహేనువేల రూపాయలు కూడా ఉండదన్నాడు. పచ్చలపతకం గురించి అడిగితే... అవి జైపూర్ పచ్చలని చెప్పాడు. పెద్ద ఖరీదు కావన్నాడు. పూర్వంనాటి హారం కావడంతో నలుగురు నాలుగు రకాలుగా ఊహించుకుని మమ్మల్ని పరుగులు పెట్టించారు. అఫ్కోర్స్... ఖరీదైంది కాకపోయినా మా డ్యూటీ మేం చేసేవాళ్లం. దొంగలు దొరికినా, బంగారం దొరికినా... అసలైనవాడు దొరకలేదు. మా గాలింపు ఆగలేదు. ఐదేళ్ల తర్వాత... చవటా ప్రసాద్‌ని అరెస్ట్ చేస్తేగానీ సింహాచలం ఆలయం కేసు ఫైలు మూతపడదు. వెంటనే దొరకడానికి వాడు సామాన్యమైన దొంగా? వాడెంత డెడికేటెడ్ ఫెలో అంటే దొంగకి బలహీనత ఉండకూడదని మద్యం కూడా తీసుకోడు. ఎక్కడికక్కడ బలమైన నెట్వర్క్ ఉంటుంది. ప్రాంతాలవారీగా పోలీసుల బలహీనతలు కూడా తెలుసు వాడికి. సింహాచలం కేసు పెద్దదవడంతో జిల్లా జిల్లా జల్లెడ పట్టడం మొదలుపెట్టాను. ఇక లాభం లేదనుకుని వాడు దగ్గరున్న బంగారాన్ని అమ్మేసి వరంగల్ దగ్గర ములుగు ప్రాంతానికెళ్లి లారీల వ్యాపారం పెట్టాడు. చాలా బుద్ధిమంతుడిగా రంగేసుకుని బతకడం మొదలుపెట్టాడు. ఏదో ఒక సందర్భంలో మా కంట్లో పడ్డాడు. వెంటనే అరెస్ట్ చేశాం. మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరికి ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ రోజు సింహాచలం ఆలయం కేసు ఫైలు మూతపడింది. బిట్రగుంట దొంగలు దొంగతనం వృత్తిలో బాగా రిచ్ క్యాడరన్నమాట. వారు కేవలం అమావాస్య చీకట్లోనే దొంగతనానికి బయలుదేరేవారు. దానికి కూడా ఒక సెంటిమెంటు ఉండేది. అర్ధరాత్రి కోడిని కోసి దాని తలను నేలమీదకు విసిరేవారు. దాని ముక్కు ఏ దిశను చూపిస్తే ఆ దిశగా దొంగతనానికి బయలుదేరేవారు. దొంగతానికి వెళ్లినచోట ఏదైనా తినివస్తే... పాపం తగలదని వారి నమ్మకం! రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: ఎస్. ఎస్ ఠాకూర్ -
ఆర్మీపై గూర్ఖా తుపాకి
బెస్ట్ కేస్ మాజీ డీజీపీ హెచ్.జె దొర చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ కమిషనర్ అబ్దుల్ సలాంఖాన్ ఆదివారం తనతోపాటు సరదాగా రేస్కోర్సుకి రమ్మని పిలిచారు. పొద్దున్నే రెడీ అవుతున్నాను. ఇంతలో బయట జీపులో వైర్లెస్ మెసేజ్ చెవిలో పడింది. ‘గూర్ఖా ఫైరింగ్... పాయగా పాలెస్’ అని వినపడగానే పరుగున జీపెక్కాను. పాయగా పాలెస్ ఆర్మీ ఉద్యోగుల కార్యాలయం. చాలా పెద్ద భవంతి. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న కంట్రీక్లబ్, అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ ఉన్నవి దాని ప్రాంగణంలోనే. అప్పుడు నేను డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నాను. సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే లోకల్ పోలీసులంతా గుమిగూడారు. విషయం కమిషనర్గారికీ తెలిసింది. ఆ ప్రాంతం సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఏసీపీ, ఇన్స్పెక్టర్, సీఐ ఏం చేయాలో తోచక కంగారు పడుతున్నారు. జీతం కోసం! పాయగా పాలెస్ నిజాంకాలంనాటి భవంతి. నిజాం ఇంటివారు కేవలం పాయగా పాలెస్‌కి చెందినవారితోనే పెళ్లి సంబంధం అందుకునేవారట. ఆ పాలెస్ తలుపులు ఏడెనిమిది అడుగుల పొడవుండేవి. ఏసీపీ నాకెదురొచ్చి... ‘‘సార్, ఇక్కడ భవంతికి కాపలా ఉంటున్న గూర్ఖా... మేజర్‌పై కాల్పులు జరిపి, పైన మేడపైకి వెళ్లిపోయాడు. అతన్ని పట్టుకోడానికి వెళదామంటే పై మెట్లపై నుంచి కాలుస్తానని బెదిరిస్తున్నాడు. మేం ఎప్పుడూ ఈ భవంతిలోకి వెళ్లలేదు. అతన్ని ఎలా పట్టుకోవాలో తెలియడం లేదు. పైన అంతస్థులో పదుల సంఖ్యలో ఆర్మీ సిబ్బంది ఉన్నారు. వారంతా తలుపులు మూసుకుని లోపలే ఉన్నారు. ఎవ్వరినీ బయటికి రావొద్దని చెప్పాం...’’ అంటూ వివరించాడు. మేజర్ని అప్పటికే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాపాలా ఉండే గూర్ఖా... కాల్పులు జరపడం ఏంటని ఆరా తీస్తే... తెల్లవారితే దసరా పండగ. శాలరీ అడ్వాన్స్ ఇవ్వనందుకు ఆర్మీ సిబ్బందితో గొడవపడ్డాడట. బయట ఉన్న మేజర్ లోపలికి వెళ్లి ఏంటని గట్టిగా గద్దించడంతో తుపాకి గురిపెట్టాడు. వారించినా వినకుండా మేజర్‌పై కాల్పులు జరిపి మెట్లెక్కి మేడపైకి వెళ్లిపోయాడు. ఇదీ విషయం! కొందరేమో జీతంకోసమే కాల్చాడంటున్నారు. ఇంకొందరు అతనికి మతిస్థిమితం లేదంటున్నారు. పొద్దున్నే తాగేసి వచ్చాడంటారు కొందరు. ఏదీ క్లారిటీ లేదు. ఆయుధపూజ కారణంగా... ఆర్మీ ఆఫీసర్లంటే పోలీసువారికన్నా స్ట్రాంగ్ కదా! వారి దగ్గర బోలెడన్ని ఆయుధాలుంటాయి. మరి ఒక గూర్ఖాకి బెదిరిపోయే పరిస్థితి ఎందుకొచ్చిందంటే... దసరా ముందురోజు కదా! ఆయుధపూజ కోసం వెపన్లన్నింటినీ శుభ్రం చేసి ఒక గదిలో పెట్టారట. దాంతో పై అంతస్థులో ఉన్న అధికారుల దగ్గర ఒక్క ఆయుధం కూడా లేకుండా పోయింది. కిందున్నవారి దగ్గర ఉన్నా... హంతకుడు పైన ఏ మూలన నక్కివున్నాడో తెలీదు. విషయాలన్నీ విన్న తర్వాత అయోమయంగా తోచింది. అంత పెద్ద అంతస్థులో పైకి వెళ్లడానికి ఒకే ఒక్క మెట్లమార్గం తప్ప మరే దారీ లేదు. నలుగురు పోలీసుల్ని వెంటేసుకుని గోడపైనుంచి పైకి ఎక్కడానికి ప్రయత్నించాను. లాభం లేకపోయింది. గూర్ఖా ఉన్న ప్రాంతంలోకి వెళ్లడం కుదరలేదు. ఇంతలో కమిషనర్‌గారు, ప్రెస్ అందరూ వచ్చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నది ఆర్మీ అధికారులు కావడంతో నాక్కూడా ఒకింత భయం వేసింది. నా కింది ఆఫీసర్లకు చెప్పి వెంటనే ఫైర్ ఇంజన్ని రప్పించమని చెప్పాను. బాగా పొడవైన లాడర్ ఉన్న ఇంజన్ కావాలన్నాను. నా ఐడియా ఏంటంటే, ఆ నిచ్చెన సాయంతో పై అంతస్థులోకి ఎక్కొచ్చు కదా అని. ఫైర్ ఇంజన్ సాయంతో... మాయదారి గూర్ఖా మేడపై ఎక్కడ దాక్కున్నాడో తెలియడం లేదు. ఫైర్ ఇంజన్ రాగానే భవంతి ముందువైపు లాడర్ ఓపెన్ చేయించి సిద్ధంగా పెట్టుకున్నాను. వాడు చూస్తే ప్రమాదం... అందుకని లోపల మెట్లదగ్గర మా పోలీసువాళ్లని కొద్దిగా హడావిడి చేయమని చెప్పాను. దాంతో వాడు మెట్లదగ్గరే ఉండి వారిని బెదిరిస్తుంటాడు. ఈలోగా నేను లాడర్ సాయంతో పైకి ఎక్కొచ్చు కదా! వాడు ఇంజన్ వచ్చినట్టు గమనించివుంటే మాత్రం లాడర్పైకి ఎక్కినవారిని పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. అందుకని మా కింది సిబ్బంది నన్ను ఎక్కొద్దని వారించారు. నా భయమంతా పై అంతస్థులోని గదుల్లో చిక్కుకున్న ఆర్మీవారిపై హంతకుడు ఎక్కడ అటాక్ చేస్తాడోనని. ఇద్దరు కానిస్టేబుళ్లని ఇంజన్ దగ్గర నిలబెట్టాను. నేను పైకి ఎక్కుతున్నప్పుడు వాడుగాని నాపై ఫైర్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్లని కూడా ఫైర్ ఓపెన్ చేయమన్నాను. నా మాటలు విని లోపలున్న ఆర్మీఅధికారులు తలుపులు తీసారు. ఆయుధం లేకపోతే ఆర్మీవారు మాత్రం ఏం చేయగలరు? వారి ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నారు. మ్యాప్ వేయించి... ఎలాగోలా పై అంతస్థు కారిడార్లోకి వెళ్లాను. అక్కడి నుంచి వాడున్న మేడపైకి ఎలా వెళ్లాలో దారి తెలియలేదు. ముందు కారిడార్‌లో ఉన్న డోర్ కొట్టాను. నా మాటలు విని లోపలున్న ఆర్మీ అధికారులు తలుపులు తీసారు. ఆయుధం లేకపోతే ఆర్మీవారు మాత్రం ఏం చేయగలరు? అతనున్న మేడపైకి ఎలా వెళ్లాలని అడిగితే... మ్యాప్ గీసి చూపించారు. నేను, నాతో ఇద్దరు పోలీసులు అతనున్నవైపుకి కదిలాం. అప్పుడు నోరు తెరిచాడు. తనవైపుకొస్తే కాల్చేస్తానని బెదిరిస్తున్నాడు. ఎల్ ఆకారంలో ఉన్న కారిడార్‌లో ఒకవైపునుండి అతన్ని బుజ్జగించడం మొదలుపెట్టాం. ‘మేం ఆర్మీ సిబ్బంది కాదు... నీ బాధ మాకు తెలుసు. నేపాలివాళ్లకి దసరా చాలా పెద్ద పండగ. ఆ రోజు డబ్బుల్లేకపోతే మిమ్మల్నే నమ్ముకున్న భార్యపిల్లలు చాలా ఇబ్బందిపడతారు. నీకు సమయానికి శాలరీ అడ్వాన్స్ ఇవ్వకపోవడం నిజంగా తప్పే. నువ్వు పగతోనో, మరో ఉద్దేశ్యంతోనో కాల్పులు జరపలేదు కదా. అయినా మేజర్‌కి పెద్దగా ఏం ప్రమాదం జరగలేదు. నువ్వు గన్ పడేసి లొంగిపో...’’ అంటూ నేనూ, నాతో ఉన్న పోలీసులూ హిందీలో నచ్చచెప్పడం మొదలుపెట్టాం. ఇంతలో మేజర్ చనిపోయినట్టు హాస్పిటల్ నుంచి కబురొచ్చింది. రెండున్నర గంటల తర్వాత, మా బుజ్జగింపు మాటల్ని నమ్మి గూర్ఖా నోరు తెరిచాడు. ‘మీరు గన్స్ కింద పడేస్తే... నేనూ పడేస్తాను’ అన్నాడు. తీరా మేం వెపన్స్ పడేశాక వాడు ఎదురుగా వచ్చి కాల్పులు జరిపితే పరిస్థితి ఏంటి? అతను చెప్పిన మాట వినడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. వెపన్స్ కింద పడేశాం. వాడూ పడేశాడు. ముందుకెళ్లి వాడ్ని పట్టుకుని కిందికి తెచ్చాం. ఇది జరిగి 42 ఏళ్లు(1972) అవుతోంది. జీవితఖైదు... నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆ గుర్కా పేరు ధన్బహదూర్. ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. నిజంగానే నేపాలివాళ్లకి దసరా పెద్ద పండగ. పైగా బతుకుతెరువుకి మన ప్రాంతానికొచ్చినవాళ్లు అప్పులు చేసి అవసరాలు తీర్చుకోరు. ఉన్నంతవరకూ నమ్మకంగా ఉంటారు. వారిని ఇబ్బందిపెడితే రియాక్షన్ కూడా అదేస్థాయిలో ఉంటుంది. అందరు ఆర్మీ అధికారులతో మాట్లాడాక తెలిసిందేమి టంటే ధన్బహదూర్ మంచివాడు. జీతం విషయంలో విసిగిపోయాడు. అడిగిన వెంటనే ఇవ్వడానికి అధికారులకు పూనే నుంచి ఆర్డర్ రావాలి. ఆ విషయాన్నే పదే పదే చెపుతుంటే వాడికి కోపం వచ్చింది. ఫ్రస్ట్రేషన్లో కాల్పులు జరిపాడు. అంతకు మించి కారణం దొరకలేదు. ఉత్త పుణ్యానికి మేజర్ బలైపోయాడు. గూర్ఖాకీ జీవితఖైదు శిక్ష పడింది. పండగ రేపనగా ఓ సైనికుడ్ని కోల్పోయాం. అయితే మరో ప్రమాదం జరక్కుండా గూర్ఖాని చాకచక్యంగా పట్టుకున్నందుకు అందరూ మెచ్చుకున్నారు. గ్యాలంటరీ మెడల్... అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న బ్రిగేడియర్ బాలచందర్ నా సాహసాన్ని చాలా అభినందించారు. మాటలతో ఊరుకోలేదు. నా సాహసం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పటి ఐజి కళ్యాణరావుగారు నన్ను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. నేను హంతకుడ్ని పట్టుకున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నాకు గ్యాలంటరీ మెడల్ ప్రదానం చేసింది. ఆ మెడల్ అందుకున్న మొదటి ఐపీఎస్ నేనే. అంతా హ్యాపీయే కానీ మేజర్ మరణం గుర్తొచ్చినప్పుడు మాత్రం బాధేస్తుంది. రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: నోముల రాజేశ్‌రెడ్డి -
సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేయండి
హైకోర్టు ధర్మాసనం ముందు మాజీ డీజీపీ అరవిందరావు అప్పీల్.. తీర్పు వాయిదా సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారి సుందరకుమార్ దాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేయాలంటూ మాజీ డీజీపీ అరవిందరావు హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిని న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ ఎస్.వి.భట్టీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్‌రావు, దాస్ తరఫు న్యాయవాది వాద, ప్రతివాదాలు విన్న ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... అసలు పిటిషన్లో ప్రతివాదిగా లేని వ్యక్తిపై, అతని వాదనలు వినకుండానే కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేయవచ్చా? అని ప్రశ్నించింది. తరువాత ఈ వ్యాజ్యంలో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తను ఎస్సీని కావడంతో సరైన పోస్టింగ్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారంటూ అరవిందరావు అదనపు డీజీ(ఇంటెలిజెన్స్)గా ఉన్నప్పుడు దాస్ ఆయనపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని ఆయన హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు.. వాదనల అనంతరం దాస్ ఫిర్యాదు ఆధారంగా అరవిందరావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలివ్వడం తెలిసిందే. -
మధ్యాహ్నం హత్య
మాజీ డీజీపీ పేర్వారం రాములు చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ ‘‘ఉదయం పదకొండు గంటలకు కమిషనరేట్‌లో నా ఫోన్ మోగింది. హలో అనకుండానే అవతలివైపున పాతబస్తీ ఎస్ఐ హత్యవివరాలను హడావుడిగా చెప్పడం మొదలుపెట్టాడు. బెస్ట్ కేస్ పట్టపగలు... నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వస్త్రవ్యాపారిని కత్తులతో పొడిచి హత్య చేశారు. పాతబస్తీలో నాలుగు రాళ్లు రువ్వుకుంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలాంటిది హత్య. వస్త్రవ్యాపారి హత్య అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. వాళ్లకి పెద్దగా శత్రువులుండే అవకాశం ఉండదు. ఉన్నా... ఇలా రోడ్డుపై తెగబడాల్సిన పనిలేదు. ఎవరో మతతత్వశక్తులు ఇలాంటిపనికి పూనుకున్నారేమోనని నా కింది ఆఫీసర్లు వారి ఊహల్ని వినిపిస్తున్నారు. సెన్సిటివ్ కేసు. ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా దర్యాప్తు జరగాలి. మరు నిమిషమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారి దగ్గర నుంచి ఫోన్. ‘ఏమయ్యా... మన నగరంలో అసలు పోలీసులున్నారా? పట్టపగలు రోడ్డుపైన హత్య చేస్తుంటే ఏంచేస్తున్నట్టు? రేపు సాయంత్రంలోగా హంతకుడ్ని పట్టుకోవాలి’ అంటూ ఆర్డరు. వెంటనే నేను నాలుగు టీమ్‌లను సిద్దం చేసుకుని ముందుగా సంఘటనా స్థలానికి వెళ్లాం. అప్పటికే వ్యాపారి చనిపోయాడు. ఉదయం 10:30 గంటలకు... ఆ రోజు పాతబస్తీ యథావిధిగా తెల్లవారింది. ఓ వస్త్రవ్యాపారి బేగంపేటలోని తన దుకాణానికి స్కూటర్‌పై బయలుదేరాడు. పురానాపూల్ బ్రిడ్జ్ ఎక్కాడు. బ్రిడ్జ్ కదా... బండి స్లోగా వెళుతోంది. ఇంతలో ఇద్దరు కుర్రాళ్లు ఓ బండిపై వచ్చి వ్యాపారి బండిని ఢీకొట్టారు. ఉన్నపళంగా కిందపడ్డ వ్యాపారి ‘కళ్లు కనపడడం లేదా...’ అంటూ అరవబోతుండగానే అందులో బాగా బలీయంగా ఉన్న వ్యక్తి చొక్కాలోనుంచి చాకు తీసి వ్యాపారి పొట్టలో నాలుగైదు పోట్లు పొడిచాడు. వాహనదారులంతా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఒక్కరు కూడా ముందుకొచ్చి హంతకుల్ని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరో పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. మావాళ్లు వెళ్లేసరికి కొన ఊపిరితో ఉన్నాడు వ్యాపారి. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతుడి చొక్కాజేబులో ఉన్న వివరాల సాయంతో పాతబస్తీలో అతనున్న ఇంటికి చేరుకుంది మా టీమ్. 11:30 గంటలకు... చనిపోయిన వ్యాపారి మధ్యవయస్కుడు. భార్య, ఇద్దరు ప్లిలలు, తల్లి, తమ్ముడు ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం. అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హతుడికి ఎవరైనా శత్రువులున్నారేమోనని ఆరా తీస్తే... అలాంటివారెవరూ లేరని తెలిసింది. ఆస్తితగాదాలు కూడా లేవు. దుకాణం చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాం. తోటి వ్యాపారులతో, కస్టమర్లతో కలుపుగోలుగా ఉండేవాడని చెప్పారు. ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే... ‘చీమకు కూడా హాని తలపెట్టని నా బిడ్డను చంపే అవసరం ఎవరికుంటుంది సార్...’ అంటూ అతని తల్లి పోలీసుల చొక్కాపట్టుకుని రోదించింది. భార్య సంగతీ అంతే. తనతో భర్త ఎలాంటి విషయాలు చెప్పలేదంది. రెండురోజులుగా కొద్దిగా ఆందోళనగా ఉన్నట్టు చెప్పిందంతే. పోనీ ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ ఎవరితోనైనా గొడవపడేవాడా? గత మూడునాలుగేళ్లలో పాతబస్తీ వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. నేను మరో రెండు టీమ్‌లను నా దగ్గర పెట్టుకుని ఫోన్‌కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. హతుడి ఇంటి దగ్గరున్న టీమ్ నుంచి కాల్ వచ్చింది. ‘ఎలాంటి క్లూ దొరకడం లేదు సార్... వచ్చేయమంటారా’ అని. ‘మీరు ఇల్లంతా మరోసారి వెదకండి. చిన్న కాగితం ముక్క కూడా వదలకండి. అక్కడగానీ క్లూ దొరకకపోతే... ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం’ అని చెప్పాను. నా దృష్టిలో హత్యజరిగిన ఫస్ట్ అవర్ చాలా కీలకమైంది. ఆ సమయంలోనే చాలావరకూ విషయం తెలిసిపోవాలి. లేదంటే... సమయం చేతిలో మేం కీలుబొమ్మలం కావాల్సిందే. 12:00 గంటలకు... ఓ అరగంట తర్వాత ఫోన్ మోగింది. ‘గోడపైన క్యాలెండర్లో మూడు తేదీలు పెన్నుతో రౌండప్ చేసి ఉన్నాయి సార్... దానికి ముందు నెలలో కూడా అవే తేదీల్లో అలాగే రౌండప్ చేసి ఉంది. తేదీలకింద ఒకే రకమైన బండి నంబర్ నోట్ చేసి ఉంది’ అని చెప్పాడు ఎస్ఐ. నాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. కేసు కీలక మలుపు తిరిగిందనుకున్నాను. వెంటనే నేను మరో టీమ్‌కి ఆ బండి నంబర్ ఇచ్చి ఆర్టీఏ ఆఫీసుకి పంపించాను. 1:00 గంటకు... ఆ బండికలవాడి అడ్రసు పట్టుకున్నారు మా వాళ్లు. ఆ వస్త్రవ్యాపారి ఉన్న ప్రాంతంలోనే కొద్దిదూరంలో అతని అడ్రసు. ఇంటికెళితే అతను లేడు. తల్లి ఉంది. ‘అబ్బా... ఏం సతాయిస్తరు. మీకు రోజు మామూలు ఇవ్వాలా నా బిడ్డ’ అంటూ పోలీసుల్ని తిట్టడం మొదలుపెట్టింది. ఆ సందులో నలుగురితో మాట్లాడితే ఆ బండికలవాడు కిరాయి హంతకుడని, లోకల్ పోలీసులకు లంచం ఇచ్చుకుంటూ బతికేస్తాడని చెప్పారు. అప్పటికే అతనిపై బోలెడన్ని కేసులున్నాయి. బెయిల్‌పై బయటికి వచ్చినపుడు ఇలాంటి పనులకు పాల్పడుతుంటాడు. పోలీసులు గద్దించి అడగడంతో తన చెల్లెలు ఇంటిదగ్గర ఉన్నట్లు చెప్పింది. 2:00 గంటలకు... బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 దగ్గర మహ్మదీయలైన్స్ స్లమ్ ఏరియా. అన్నీ చిన్న చిన్న ఇళ్లు. మావాళ్లు సివిల్‌డ్రెస్‌లో హంతకుడి స్నేహితుల్ని వెంటబెట్టుకుని వెళ్లారు. తలుపు తట్టారు. ఎవరూ పలకలేదు. ఒక్కసారిగా లోపలికి చొరబడ్డారు. హంతకుడు బాత్రూమ్లో చేతులూ కాళ్లు కడుక్కుంటున్నాడు. అతని చేతుల రక్తపు మరకలు ఇంకా వదల్లేదు. ‘రెడ్ హ్యాండెడ్’గా పట్టుకోవడం అంటారు కదా! అంటే ఎర్రటిరక్తపు చేతుల్ని పట్టుకోవడం అన్నమాట. అదే జరిగింది ఇక్కడ. వెంటనే అతని చేతికున్న బ్లడ్ శాంపిల్స్‌ని తీసుకున్నారు. వ్యాపారి రక్తంతో మ్యాచ్ అయ్యింది. అతని చేతులకు బేడీలు వేశాక హంతకుడన్న మాటలు మా టీమ్ ఎప్పటికీ మరచిపోలేదు. ‘మీరు పోలీసులా, సైతాన్‌లా... మీకెలా తెలిసింది నేనే చంపానని. పోలీసులకు దొరికిపోతానని తెలుసు. కానీ ఇలా రక్తపు చేతుల్తో పట్టుపడతానని ఊహించలేదు’. ఉదయం పదిన్నరకు హత్య జరిగితే మధ్యాహ్నం రెండున్నరకు హంతుకుడ్ని పట్టుకున్నాం. చనిపోయిన వ్యక్తికి ఎలాంటి శత్రువర్గం కానీ, హంతకుల జాడ కనిపెట్టగలిగే ఆధారం కానీ లేని పరిస్థితుల్లో గంటల్లో కేసుని చేధించినందుకు డిపార్టుమెంటు తరఫు నుంచే కాకుండా ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కూడా మంచి ప్రశంసలు అందాయి. ఎందుకు చంపినట్టు? ఇంతకీ హత్య వెనక ఎవరున్నారని అడిగిన వెంటనే చెప్పలేదు. మాదైన పద్ధతిలో ఇంటరాగేషన్ చేశాక చెప్పాడు. వ్యాపారి తమ్ముడే హత్య సూత్రధారి. హంతకుడు దొరికిన విషయం చెప్పకుండా వ్యాపారి ఇంటికి వెళ్లారు మావాళ్లు. తల్లిపక్కన కూర్చుని ఏడుస్తున్నాడు ఆ తమ్ముడు. చిన్న పని అని చెప్పి స్టేషన్‌కి తీసుకొచ్చి విచారిస్తే అసలు విషయం బయటపెట్టాడు. ‘‘మా అన్నయ్య పిసినారి సార్... బైక్ కావాలని నాలుగేళ్ల నుంచి బతిమిలాడుతున్నాను. స్నేహితులతో సరదాగా గడిపితే ఇష్టపడడు. డబ్బుల విషయంలో నరకం చూపిస్తున్నాడు. అందుకే మా పక్కవీధి కిరాయి రౌడీతో పదివేలకు డీల్ కుదుర్చుకున్నాను’’. హత్యచేసినవాడికి, చేయించినవాడికి ఇద్దరికీ జీవితఖైదు శిక్ష పడింది. క్యాలెండర్‌పై వ్యాపారి రౌండప్ చేసుకున్న మూడు తేదీలు బాగా ఉపయోగపడ్డాయి. ఆయా రోజుల్లో ఆ బండి తనను వెంబడించిందని అర్థం కావొచ్చు. పాపం అమాయకుడు ఎవరితో చెప్పకుండా క్యాలెండర్‌పై నోట్ చేసుకుని ఊరుకున్నాడు. మొత్తానికి ఒక్కరోజులో హంతకుడి చేతులకు బేడీలు వేసినందుకు నేనూ... మా టీమ్ ఊపిరి పీల్చుకున్నాం. రిపోర్టింగ్: భువనేశ్వరి -
అస్సాం మాజీ డీజీపీ బారువా ఆత్మహత్య
శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో కలత గువాహటి: అస్సాం మాజీ డీజీపీ శంకర్ బారువా ఆత్మహత్య చేసుకున్నారు. కోట్లాది రూపాయల ‘శారద’ చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో బారువా పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత నెలలో సీబీఐ ఆయన నివాసంలో సోదాలు జరిపింది. దీనిపై కలత చెందిన ఆయన బుధవారం గువాహటిలోని తన నివాసంలో పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బారువాను ఆసుపత్రికి తరలించగా.. ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారని గువాహటి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ) ఎ.పి.తివారీ తెలిపారు. ‘‘బారువా మరి లేరు. మేం కేసు దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం ఈ విషయంలో ఏమీ చెప్పలేం. దర్యాప్తు తరువాతే వివరాలు తెలపగలం’’ అని ఆయన చెప్పారు. గతవారం ఛాతీలో నొప్పి రావడంతో బారువా స్థానిక ఆసుపత్రిలో చేరారు. కోలుకున్న ఆయన్ను బుధవారం ఉదయమే డిశ్చార్జి చేశారు. ఆ తరువాత ఇంటికి చేరిన అరగంటలోపుగానే ఆయన మేడపైకి వెళ్లి పిస్టల్‌తో కాల్చుకున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందన్నాయి. శారదా కుంభకోణం కేసులో తన పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఆయన కలత చెందారని, దీనిపై టీవీ చానళ్లలో ప్రసారమైన వరుస కథనాలతో ఆయన తీవ్ర వేదనకు గురయ్యారని, ఆత్మహత్యకు ఇదే కారణమని ఆ వర్గాలు తెలిపాయి. -
శారద స్కాం కేసులో పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ అరెస్ట్
న్యూఢిల్లీ: శారద చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐ పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ రజత్ మజుందర్‌ను అరెస్ట్ చేసింది. డీజీపీగా పదవీవిరమణ చేసిన అనంతరం మజుందర్ శారద చిట్ ఫండ్ కంపెనీకి భద్రత సలహాదారుగా పనిచేశారు. కోట్లాది రూపాయిల కుంభకోణం కేసులో ఆయనపై మోసం, కుట్రపూరిత కేసులు నమోదయ్యాయి. గత నెలలో మజుందర్‌ను రెండు సార్లు విచారించిన సీబీఐ అధికారులు పలు పత్రాలు సీజ్ చేశారు. -
లోక్‌సభ బరిలో మాజీ డీజీపీ?
ఒకప్పుడు ఆయన సీనియర్ పోలీస్ బాస్... ఆ తర్వాత తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్...ఇప్పుడు అన్నాడీఎంకేలో నాయకుడు... ఆయనే మాజీ డీజీపీ ఆర్ నటరాజ్. పదవీ విరమణానంతరం మౌనంగా ఉన్న ఆయన హఠాత్తుగా అన్నాడీఎంకే కండువా వేసుకున్నారు. ఆ పార్టీ అధినేత్రి జయలలిత ఆశీస్సులతో పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఆయన్ను లోక్‌సభ బరిలో దించే వ్యూహంతో జయలలిత ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంటోంది. సాక్షి, చెన్నై: ‘ఆర్ నటరాజ్’ అంటే, తమిళనాట ఎవరైనా సరే గుర్తు పడుతారు. ఎందుకంటే, బుర్ర మీసాల పోలీసు అధికారి గనుక. తిరునల్వేలికి చెందిన నటరాజ్ 1975 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. తన సేవలను పూర్తి కాలం తమిళనాడుకు అందించారు. అన్నాడీఎంకేకు విధేయుడిగా ముద్ర పడిన ఆయన రెండు సార్లు చెన్నై పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. 2006లో అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి, ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి సైతం గురయ్యారు. ఏడీజీపీగా, డీజీపీగా పదోన్నతులు పొందిన ఆయన ఏకంగా డీఎంకే సర్కారుపై పెద్ద సమరమే చేశారు. తనకు దక్కాల్సిన శాంతి భద్రతల విభాగం డీజీపీ పదవిని, జూనియర్‌గా ఉన్న లతికా చరణ్‌కు అప్పగించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కోర్టులో పోరాడారు. అంతలోపు పదవీ విరమణ పొందాల్సి వచ్చింది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక, తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా ఆయన్ను నియమించింది. చతికిలబడి ఉన్న ఆ విభాగానికి పునరుత్తేజాన్ని ఆయన కల్పించారు. ఆ పదవీ కాలం గత ఏడాది ముగిసింది. విశ్రాంతిలో ఉన్న ఆయన ఉన్నట్టుండి మంగళవారం సీఎం జయలలితను కలుసుకుని, అన్నాడీఎంకేలో చేరారు. అన్నాడీఎంకేకు తన సేవలను అందించనున్నట్టు ప్రకటించారు. అయితే, ఇన్నాళ్లు మౌనంగా ఉండి, హఠాత్తుగా నటరాజ్ పార్టీలో చేరడం వెనుక ఆంతర్యం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయన్న ఎన్నికల బరిలో దించడం లక్ష్యంగా జయలలిత సమక్షంలో ఆగమేఘాలపై పార్టీలో సభ్యుడిగా చేర్పించాల్సి వచ్చిందన్న ప్రచారం ఊపందుకుంటోంది. నటరాజ్బాటలో మరి కొందరు మాజీ ఐపీఎస్‌లు అన్నాడీఎంకేలో చేరడానికి సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల బరిలో దిగేనా?: చెన్నై జిల్లా పరిధిలోని మూడు లోక్ సభ సెగ్మంట్లలో ఒక దాంట్లో అభ్యర్థి ప్రచారం అసంతృప్తిగా ఉన్నట్టు, ఆ అభ్యర్థి ఓటర్లను ఆకర్షించే రీతిలో లేనట్టుగా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం జయలలితకు చేరినట్టు సమాచారం. ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థిగా బలమైన వ్యక్తి ఉండటంతో, ఆయన్ను ఢీ కొట్టేందుకు తమ అభ్యర్థి సరి తూగే పరిస్థితుల్లో లేనట్టు తేలింది. ఈ దృష్ట్యా, బలమైన అభ్యర్థిగా, ఉన్నతాధికారి హోదాలో పనిచేసి పదవీ విరమణ పొందిన నటరాజ్‌ను ఆ స్థానంలో దించే వ్యూహంలో జయలలిత ఉన్నట్టు తెలిసింది. నటరాజ్ మాత్రం ఓ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూల్లో పోటీకి రెడీ అన్న సంకేతాన్ని ఇవ్వడం గమనార్హం. పోటీకి రెడీ: అన్నాడీఎంకేలో చేరిక గురించి ఓ మీడియా నటరాజ్‌ను ప్రశ్నించింది. హఠాత్తుగా రాజకీయాల్లోకి రావడం వెనుక కారణాల గురించి ప్రశ్నించగా, చిన్న నాటి నుంచి తనకు రాజకీయాలంటే చాలా ఇష్టం అని సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ అధికారిగా ప్రజా సేవ చేశానని, ఇప్పుడు బాధ్యత గల వ్యక్తిగా రాజకీయాల ద్వారా పూర్తి స్థాయిలో సేవకు సిద్ధం అయ్యానన్నారు. అన్నాడీఎంకేలో చేరడం వెనుక ఆంతర్యం గురించి ప్రశ్నించగా, తనకు అన్నాడీఎంకే అంటే చాలా ఇష్టం అని, సీఎం, పార్టీ అధినేత్రి జయలలిత ధైర్యం, నిక్కచ్చితనం, ఆమె తీసుకున్న నిర్ణయాలను ఎల్లప్పుడు తాను ఆహ్వానిస్తూనే ఉంటానన్నారు. సునామీ సమయంలో ఆమె సీఎంగా ఉన్నప్పుడు, వెన్నంటి ఉండి పనిచేశానని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? అని ప్రశ్నించగా, పోటీ చేయమని సీఎం జయలలిత ఆదేశించిన పక్షంలో తాను రెడీ అని, పార్టీ ఆదేశాల్సి శిరస్సా వహిస్తానని పేర్కొనడం గమనించాల్సిందే. అయితే, అన్నాడీఎంకే అభ్యర్థులందరూ నామినేషన్లు సమర్పించిన దృష్ట్యా, మార్పు జరిగేనా అన్నది అనుమానమే. చివరి క్షణంలో అభ్యర్థుల్ని మార్చిన సందర్భాలు జయలలితకు పరిపాటే గనుక, జరిగినా జరగొచ్చేమో.!