
మాజీ డీజీపీకి బెయిల్ మంజూరు
పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన శారద చిట్ ఫండ్ కుంభకోణంలో ఆ రాష్ట్ర మాజీ డీజీపీ, ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు రజత్ మజుందార్కు కోల్కతా హైకోర్టు సోమవారం బెయిల్ మజూరు చేసింది. స్కాంలో రజత్ ప్రమేయం ఉన్నట్లు సీబీఐ నిరూపించలేకపోయిందని రజత్ తరఫు న్యాయవాది వాదించగా, ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ సీబీఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.
ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం రూ. 11లక్షల వ్యక్తిగత పూచీకత్తు, పాస్ పోర్టుల స్వాధీనం వంటి షరతులతో రజత్కు బెయిల్ మంజూరుచేసింది.