తమిళనాడు:లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు మాజీ డీజీపీకి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీఎస్ అధికారి, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) రాజేశ్ దాస్‌ను విల్లుపురం న్యాయస్థానం దోషిగా తేల్చింది.
తోటి సీనియర్ అధికారి రాజేశ్ దాస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ఐపీఎస్ అధికారి 2021లో ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి కే పళనిస్వామి భద్రతపై విధులకు వెళ్లిన క్రమంలో తనను వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపై దాస్‌ను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దర్యాప్తు చేయడానికి ఆరుగురి వ్యక్తులతో కూడిన ఓ కమిటీని కూడా నియమించింది.
ఈ కేసు అప్పటి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఎన్నికల బరిలో నిలిచిన ఎంకే స్టాలిన్.. తనను గెలిపిస్తే ఈ కేసును న్యాయబద్దంగా దర్యాప్తు చేపిస్తానని ప్రజలకు హామీ కూడా అప్పట్లో ఇచ్చారు.
ఇదీ చదవండి:గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం..
Comments
Please login to add a commentAdd a comment