ex dgp
-
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయనపై ఇటీవల సోషల్‌మీడియాలో పలు అవినీతి ఆరోపణలు వ్యాప్తి చెందాయి. దీంతో మహేందర్‌రెడ్డి మంగళవారం తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నవని తెలియజేశారు. ‘నేను 36 ఏళ్ళకు పైగా ఎలాంటి కళంకం లేకుండా పదవీ విరమణ వరకు అంకిత భావంతో పనిచేశా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రంలో పోలీసు శాఖలో సుధీర్ఘ కాలం పనిచేశా. నా కెరీర్ మొత్తంలో.. నేను క్లీన్ రికార్డ్, ఖ్యాతిని కొనసాగించాను. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యంతో తప్పుడు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నాయి. నా ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్న/ సర్క్యులేట్ చేస్తున్న వారందరిపై క్రిమినల్ చర్యలు, పరువునష్టం దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని మహేందర్‌రెడ్డి తెలిపారు. -
TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మాహేందర్రెడ్డి
-
మణిపూర్ కోసం ముగ్గురు మాజీ మహిళా జడ్జీలతో కమిటీ.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: మణిపూర్ ఘటనలపై విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ హింసపై దర్యాప్తు కోసం ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు జడ్జిలతో కమిటీ కూడిన కమిటీని ప్రతిపాదించింది. దర్యాప్తు పరంగానే కాకుండా.. పునరావాసం, ఇతరత్రా అంశాలపైనా ఈ కమిటీ దృష్టిసారిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి డీజీఐ ర్యాంక్ అధికారులతో కూడిన 42 సిట్లు... సీబీఐయేతర కేసులు విచారణ చేపడతాయని తెలిపింది. ఒక్కో అధికారి ఆరు సిట్లను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘‘మా ప్రయత్నాలు చట్ట పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం. మేము ఒక స్థాయిలో ముగ్గురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ దర్యాప్తు మాత్రమే కాకుండా - సహాయక చర్యలను, నివారణ చర్యలు మొదలైనవాటిని కూడా పరిశీలిస్తుంది’’ అని చీఫ్ జస్టిస్ డీవైచంద్రచూడ్ ప్రకటించారు. ► ముగ్గురు సభ్యుల కమిటీలో జమ్ము కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలినీ జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ ఉన్నట్లు తెలిపింది. ► సీబీఐ దర్యాప్తు బృందంలో ఐదు రాష్ట్రాల నుంచి డిప్యూటీ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు ఐదుగురు ఉంటారని, సీబీఐ దర్యాప్తును మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రేయ పద్సల్గికర్ Dattatray ‘Datta’ Padsalgikar (మహారాష్ట్ర మాజీ డీజీపీ) పర్యవేక్షిస్తారని తెలిపింది. ► సీబీఐకి ట్రాన్స్ఫర్ కాని కేసుల్ని 42 సిట్లు విచారణ చేపడతాయి. ఈ సిట్లను మణిపూర్ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డీఐజీ ర్యాంక్ అధికారులు నేతృత్వం వహిస్తారు. దర్యాప్తు సక్రమంగా సాగుతుందో లేదో.. ఒక్కో అధికారి ఆరు సిట్లను చూసుకుంటారు అని తెలిపింది. అంతకు ముందు.. మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ వ్యక్తిగతంగా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరయ్యారు. ఎఫ్ఐఆర్ల వ్యవహారం తప్పుల తడకగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆయన్ని హాజరు కావాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక.. మణిపూర్ హింసపై దర్యాప్తునకు ఆరు జిల్లాల వారీగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్) ఏర్పాటు చేసినట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. బయట నుంచి కాకుండా.. సిట్లను జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేయించి దర్యాప్తునకు అనుతించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్‌కు తెలిపారు. అయితే సుప్రీం మాత్రం తమ ప్రతిపాదనకే మొగ్గు చూపించింది. -
లైంగిక వేధింపుల కేసులో మాజీ డీజీపీకి మూడేళ్ల శిక్ష
తమిళనాడు:లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు మాజీ డీజీపీకి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీఎస్ అధికారి, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) రాజేశ్ దాస్‌ను విల్లుపురం న్యాయస్థానం దోషిగా తేల్చింది. తోటి సీనియర్ అధికారి రాజేశ్ దాస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ఐపీఎస్ అధికారి 2021లో ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి కే పళనిస్వామి భద్రతపై విధులకు వెళ్లిన క్రమంలో తనను వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపై దాస్‌ను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దర్యాప్తు చేయడానికి ఆరుగురి వ్యక్తులతో కూడిన ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కేసు అప్పటి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఎన్నికల బరిలో నిలిచిన ఎంకే స్టాలిన్.. తనను గెలిపిస్తే ఈ కేసును న్యాయబద్దంగా దర్యాప్తు చేపిస్తానని ప్రజలకు హామీ కూడా అప్పట్లో ఇచ్చారు. ఇదీ చదవండి:గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం.. -
ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
మాజీ డీజీపీ ‘సారూ’ దొరికింది
బంజారాహిల్స్: మాజీ డీజీపీ అప్పారావు ఇంటి ముందు పెంచుకుంటున్న ఖరీదైన, అరుదైన బోన్సాయ్ మొక్కను దొంగిలించిన కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 18 లో నివసించే మాజీ డీజీపీ అప్పారావు, శ్రీదేవి దంపతులకు బోన్సాయ్ మొక్కల పెంపకంపై ఆసక్తి. కొన్నేళ్లుగా వీరు తమ ఇంటి ఆవరణలో అరుదైన బోన్సాయ్ మొక్కలను పెంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఎస్పీఆర్హిల్స్, ఓంనగర్‌కు చెందిన గొల్లపూడి ప్రసన్నాంజనేయులు తరచూ వాటిని చూస్తుండేవాడు. వీటి ప్రత్యేకతను తెలుసుకున్న అతను ఖరీదైన వాటిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆశించాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడు అభిషేక్‌తో కలిసి గతంలో రెండుసార్లు ఇంటి ముందున్న బోన్సాయ్ మొక్కలను దొంగిలించి అమ్ముకున్నాడు. ఒక్కో మొక్క రూ. 25 వేల వరకు ధర పలికాయి. దీంతో వారు మరోసారి ఇంకో మొక్కను దొంగి లించి అమ్ముకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 10న ఉదయం ఇద్దరూ బైక్‌పై వచ్చి ‘సారూ’ జాతికి చెందిన బోన్సాయ్ మొక్కను దొంగిలించారు.(చదవండి: జ్యువెలరీ షాపులో భారీ చోరీ) దీంతో ఉదయం మొక్క కనిపించకపోవడంతో అప్పారావు భార్య శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సీసీ టీవీలను పరిశీలించారు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ వైపు నుంచి బైక్‌పై మొక్క తీసుకుని వెళ్తున్న నిందితులను గుర్తించారు. రెండు రోజుల గాలింపు అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆంజనేయులు గతంలోను ఇక్కడ బోన్సాయ్ మొక్కలు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అభిషేక్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు డీఐ రమేష్ తెలిపారు. -
కర్నూలుకు వచ్చిన మాజీ పోలీస్‌బాస్
కర్నూలు: మాజీ పోలీస్‌బాస్ (డీజీపీ) జేవీ రాముడు కర్నూలుకు వచ్చి వెళ్లారు. అనంతపురంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యంలో శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ఏపీఎస్పీ పటాలంలో మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆకె రవికృష్ణ, పటాలం కమాండెంట్ గోగినేని విజయకుమార్, అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ శశికాంత్, గోపాలకృష్ణ తదితరులు ఆయనకు పూలబోకే ఇచ్చి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. జిల్లాలోని శాంతి భద్రతలతో పాటు ఏపీఎస్పీ రెండో పటాలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి జేవీ రాముడు ఆరా తీశారు. ఆయుధాగారంతో పాటు స్కూలు, పార్కు, పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, త్వరలో వాటిని ప్రారంభించనున్నట్లు కమాండెంట్ వివరించారు. -
సాంకేతిక భద్రతా వ్యవస్థతో సైబర్ నేరాల అదుపు
తిరుపతి మంగళం : సాంకేతిక భద్రతా వ్యవస్థతోనే సైబర్ నేరాల అదుపు సాధ్యమని మాజీ డీజీపీ కేసీ రెడ్డి పేర్కొన్నారు. ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో సోమవారం సైబర్ నేరాలు – భద్రత అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్వీయూ వీసీ దామోదరం జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేసీ రెడ్డి ‘ప్రపంచీకరణలో సైబర్ సెక్యూరిటీ అవశ్యకత – ఉపాధి అవకాశాలు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. సాంకేతికత పెరిగే కొద్ది సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోందన్నారు. నేరాలను అదుపు చేయడం ఒక్క సెక్యూరిటీ వ్యవస్థతోనే సాధ్యపడుతుందని తెలిపారు. ఉపాధి అవకాశాలున్న సైబర్ సెక్యూరిటీ కోర్సులను ఎంచుకుని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు. ఎస్వీయూ వీసీ మాట్లాడుతూ ఏ ఇతర యూనివర్సిటీల్లో లేనివిధంగా సైబర్ సెక్యూరిటీ కోర్సును ఎస్వీయూలో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టార్ భాస్కర్, సీఆర్‌రావు ఇన్స్టిట్యూట్ (హైదరాబాద్) ప్రతినిధి అరుణ్‌కుమార్, ఈఎస్ఎఫ్ ల్యాబ్ ఎండీ అనిల్, రాజగోపాలన్, ప్రొఫెసర్ సుదర్శనం, ఫ్రొఫెసర్ రామ్మోహన్‌రెడ్డిlపాల్గొన్నారు. -
మాజీ డీజీపీపై లారీ డ్రైవర్ దాడి
చెన్నై: అతివేగం వద్దన్నందుకు తమిళనాడు మాజీ డీజీపీ రామానుజన్‌పై ఓ లారీ డ్రైవర్ దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది. తమిళనాడు జైళ్ల శాఖ డీజీపీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన రామానుజన్ ప్రస్తుతం తన సొంత ఊరు అయిన సేలం సూరమంగళంలో నివసిస్తున్నారు. సోమవారం సాయంత్రం పని నిమిత్తం ఆయన కారులో సెవ్వాయ్‌పేట సత్రం వంతెనపై వెళ్తున్నారు. ఆ క్రమంలో ఎదురుగా ఓ లారీ అతివేగంతో ఎదురు వచ్చింది. దీంతో కారు ఆపి... కిందకి దిగిన రామానుజన్... లారీని ఆపి... ఎందుకు అంత వేగంగా నడుపుతున్నావంటూ లారీ డ్రైవర్‌ను మందలించారు. దీంతో లారీడ్రైవర్ మాజీ డీజీపీతో దుర్భాషలాడడంతో పాటు పిడిగుద్దులు కురిపిస్తూ దాడికి పాల్పడ్డాడు. కిందపడి పోయిన రామానుజన్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు లారీ డ్రైవర్ పాండియన్ (28)ను అరెస్ట్ చేశారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కబ్జాలకు సహకరించనందునే కక్షకట్టారు
సీఎంపై దినేశ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు కిరణ్ సోదరుడు ఎన్నో భూ కబ్జాలకు పాల్పడ్డారు సీఎం, ఆయున తమ్ముడి కుంభ కోణాలపై న్యాయపోరాటం చేస్తా ఎవరికీ భయపడను.. ఇది ఎవరయ్య జాగీరూ కాదు అనంతపురం ఎస్పీని నిజామాబాద్‌కు బదిలీచేసి డీఎస్‌కు చెక్పెట్టాలన్నారు.. తెలంగాణ వస్తే నక్సలైట్ల సమస్య పెరుగుతుందని చెప్పమన్నారు ఏపీఎన్జీవోల సభకు సీఎం ఒత్తిడితోనే అనుమతి ఆయున చెప్పినవి చేయునందునే నన్ను తప్పించారు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు సంతోష్‌రెడ్డి ఎన్నో భూ కబ్జాలకు పాల్పడ్డాడు... అందుకు సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గరున్నాయి... సీఎం తమ్ముడి భూ కబ్జాలకు సహకరించనందునే డీజీపీగా కొనసాగించకుండా నన్ను తప్పించారు... నన్ను తప్పించేందుకు ముఖ్యమంత్రి కుట్రచేశారు.... అని మాజీ డీజీపీ వి.దినేశ్ రెడ్డి వుంగళవారం తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని ఒక హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో దినేశ్ రెడ్డి మాట్లాడారు. భూ కబ్జాలకోసం ముఖ్యమంత్రి సోదరుడు సంతోష్‌రెడ్డి ఎన్నోమార్లు తనకు ఫోన్‌చేశారని, కానీ తాను అంగీకరించలేదని స్పష్టంచేశారు. వుుఖ్యవుంత్రి పదవిని అడ్డంపెట్టుకుని సీఎం తమ్ముడు కొన్ని వేలకోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారన్నారని, ఈ అక్రమాలు చేయించేందుకు ముఖ్యమంత్రి కూడా తన వద్దకు ఎంతో మందిని పంపారని, అక్రవూలకు అంగీకరించనందునే ఆయున తనపై కక్ష కట్టారని దినేశ్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానన్నారు. సీఎం కక్షకట్టి ఏదైనా చేస్తారనే భయం తనకు లేనేలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ఇది ఎవరయ్య జాగీరూకాదు. నేనెవరికీ భయపడబోను. ఎవరినైనా ఎదుర్కొనే సత్తా నాకూ ఉంది. నేనేం బలహీనుడిని కాదు. అన్ని విధాలా ఎదుర్కొనేందుకు నా వాళ్లూ ఉన్నారు. సమర్థంగా ఎదుర్కొనగలను’’ అని ఆయున ఆవేశంతో చెప్పారు. ముఖ్యమంత్రి, అతని సోదరుడి అక్రమాలపై న్యాయపోరాటానికి సిద్ధమని, ఎవరైనా న్యాయ పోరాటం చేస్తాన న్నా తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను అందిస్తానని వురో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అనంతపురం ఎస్పీని తప్పించాలన్నారు తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) నిర్ణయుం అనంతపురం జిల్లాలో జరిగిన ఆందోళన సందర్భంగా జాతీయ నేతల విగ్రహాల ధ్వంసం కేసుల్లో నిందితులను అరెస్టుచేసినందుకు ఆ జిల్లా ఎస్పీని బదిలీకోసం సీఎం, తనపై ఒత్తిడిచేశారని, ఎస్పీని నిజామాబాద్‌కు బదిలీచేసి మాజీ పీసీసీ అధ్యక్షడు డి శ్రీనివాస్‌కు చెక్‌పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆరోపించారు. అరుుతే, శాంతిభద్రతల రక్షణలో సమర్ధంగా వ్యవహరించినందున ఆ ఎస్పీ బదిలీకి తాను అంగీకరించలేదన్నారు. మరికొందరు ఐపీఎస్ అధికారులు, డీఎస్పీల బదిలీలపై కూడా సీఎం ఒత్తిడి తెచ్చారని, ఎన్నికల కమిషన్ ఇచ్చిన పోస్టింగ్‌ల విషయంలో బదిలీలకు సీఎం పట్టుపట్టారని దినేశ్ రెడ్డి చెప్పారు. తెలంగాణ వస్తే నక్సల్స్ సమస్య పెరుగుతుందని చెప్పమన్నారు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నక్సలైట్ల సమస్య పెరుగుతుంద ంటూ ముఖ్యమంత్రి, కేంద్రానికి నివేదిక ఇచ్చారని, అది ఊహాజనితం వూత్రమేనని తాను ఢిల్లీలో మీడియాతో చెప్పినందుకే కిరణ్‌కుమార్ రెడ్డి తనపై కినుక వహించారన్నారు. ఢిల్లీకి వెళ్లినపుడు తనతో మాట్లాడకుండానే సీఎం వెళ్లిపోవడాన్ని కొందరు ఎంపీలు గవునించారని, నక్సలైట్ల సమస్యపై తనకు అనుకూలంగా మాట్లాడనందునే ఆయున కోపంగా ఉన్నారని ఎంపీలు తనతో చెప్పారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే నక్సలైట్ల సమస్య పెరుగుతుందని చెప్పాల్సిందిగా సీఎం తనపై ఒత్తిడితెచ్చారని ఆరోపించారు. విభజనపై సీడబ్ల్యుసీ ప్రకటనకు 15 రోజులు ముందుగానే కేంద్రంలోని తన బ్యాచ్ అధికారుల సహకారంతో 40 కంపెనీల బలగాలను సీమాంధ్ర జిల్లాలకు తెప్పించానని, అదనపు బలగాలను సీమాంధ్రకు ముందుగానే తరలించడం ఇష్టంలే క, ముఖ్యమంత్రి తనపై ఆగ్రహం వ్యక్తంచేశారని. ‘‘ఎవరినడిగి అదనపు బలగాలు తెప్పించారు. ఏం చేస్తున్నావో నీకు అర్ధవువుతోందా?’’ అని వుుఖ్యవుంత్రి అన్నారని వివరించారు. గచ్చిబౌలిలో సీమాంధ్ర న్యాయవాదుల సభకు అనుమతిపై ముఖ్యమంత్రి ఒత్తిడితెచ్చినా తాను ఒప్పుకోనందునే ఆయున తనపై కోపంపెంచుకున్నారన్నారు. ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభకు సీఎం ఒత్తిడితోనే అనుమతివ్వాల్సి వచ్చిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎం నమ్మించి మోసం చేశారు డీజీపీగా పదవీ కాలం పొడిగింపుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనను నమ్మించి మోసంచేశారని దినేష్‌రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ తన పదవీ కాలం కొనసాగించాల్సి ఉందని, ఎవరూ కోర్టుకు వెళ్లకుండా నివారించేందుకు, పొడిగింపు జీవోను చివరి నిమిషయంలో ఇస్తానని సీఎం గతంలో తనకు హామీ ఇచ్చారని, చివరకు తాను కోర్టుకు వెళ్లడానికి వీల్లేకుండా సెప్టెంబర్ 27న తన పదవీ విరమణ నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు.వుుఖ్యవుంత్రి ఇలా తనను నమ్మించి వెన్నుపోటు పొడిచారన్నారు. అత్యంత విఫలమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డేనని, అతన్ని తొలగించాలనే స్థాయి తనదికాదని అన్నారు. మంత్రికో న్యాయం...నాకో న్యాయమా...! సీబీఐ ఆరోపణలు ఎదుర్కొన్న రాష్ట్ర మంత్రులను తొలగించకుండా, అదే సీబీఐ కేసును సాకుగా చూపుతూ తనను డీజీపీగా కొనసాగించకపోవడం ఏమిటని దినేశ్ రెడ్డి ప్రశ్నించారు. హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలున్న రాష్ట్రమంత్రి ఒకరికి సంబంధించి కీలక సాక్ష్యాధారాలను సీఎంకు అందించినా, సదరు మంత్రిని కొనసాగించారని ఆరోపించారు. మరో హత్య కేసులో ఐపీఎస్ అధికారిపై ఛార్జిషీటు దాఖలైనా, ఆ అధికారిని తప్పించకుండా కొనసాగించారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా దినేశ్ రెడ్డి చెప్పారు. ఒక పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయబోతున్నారన్నది, కేవలం ఊహాగానమేనన్నారు. అమెరికాకు వెళ్లి రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకునే ఆలోచనలో ఉన్నానన్నారు. -
కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ సీఎం: దినేష్ రెడ్డి