► మాజీ డీజీపీ హెచ్‌జే దొర
పుట్టపర్తి : సత్యసాయి సేవా స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే దిశగా ప్రతి సాయిభక్తుడు అడుగులు వేయాలని సత్యసాయి సేవా సంస్థల సమ్మేళనంలో మాజీ డీజీపీ హెచ్‌జే దొర పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సత్యసాయి సేవా సమితులు, భజన మండళ్లు, జిల్లా పదాధికారుల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ఘనంగా ముగిసింది. హెచ్‌జే దొర మాట్లాడుతూ సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలను వారసత్వంగా భావించి కాపాడుకోవాలన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు చలం మాట్లాడుతూ ప్రతి సత్యసాయి భక్తుడు ధృడ సంకల్పం, చిత్తశుద్ధి,అంకితం భావంతో సత్యసాయి సేవా సంస్థలు నిరే్ధశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రాబోవు రోజులలో సత్యసాయి సేవలను విస్తృతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ముగింపు సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జె.రత్నాకర్‌రాజు సమ్మేళనానికి హాజరైన ప్రతినిధులకు నూతన వస్త్రాలను, సత్యసాయి ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రసాద్‌రావు, సత్యసాయి భజన మండళ్లు,సేవా సమితుల ప్రతినిధులు పాల్గొన్నారు.
బాబా సేవా స్ఫూర్తి కొనసాగింపే లక్ష్యం
Published Mon, Jun 13 2016 10:20 AM | Last Updated on Wed, Oct 3 2018 7:20 PM
Advertisement
Advertisement