దినేశ్ రెడ్డి ప్రెస్మీట్ వాయిదా | former DGP dinesh reddy press meet postponed | Sakshi
Sakshi News home page

దినేశ్ రెడ్డి ప్రెస్మీట్ వాయిదా

Published Sat, Aug 13 2016 12:29 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

దినేశ్ రెడ్డి ప్రెస్మీట్ వాయిదా - Sakshi

దినేశ్ రెడ్డి ప్రెస్మీట్ వాయిదా

హైదరాబాద్: మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు దినేశ్ రెడ్డి విలేకరుల సమావేశం వాయిదా పడింది. బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ వద్దని ఆ  పార్టీ నాయకులు సూచించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మరోచోట ఆయన విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశముంది. ఎన్కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీంతో పలువురు పోలీసు మాజీ ఉన్నతాధికారులుకు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విలేకరుల సమావేశంలో ఆయన వివరణ ఇస్తారని భావిస్తున్నారు.

ఇప్పటికే మాజీ మంత్రి, టీడీపీ నాయకులు ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఈ వ్యవహారంపై వివరణయిచ్చారు. నయీం ముఠాతో తమకు ఎటువంటి సంబధాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రికి నయాం గ్యాంగ్ తో సంబంధాలున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement