ముఖ్యమంత్రి అంటే వైఎస్సారే.
తాను చూసిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అత్యంత గొప్పవారని, తండ్రి ఆశయ సాధన కోసం జగన్ పార్టీ స్థాపించారని వైఎస్సార్ సీపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి, విశ్రాంత డీజీపీ దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదర్‌నగర్‌లోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మనిషీ సమాజసేవ చేయాలని ఆలోచిస్తాడని, మానవసేవే మాధవ సేవగా భావించి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పోలీస్ శాఖలో ఉన్నప్పుడు కూడా విలువలకు కట్టుబడి ఉన్నానని, నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ పడకుండా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీలో ఉన్నప్పుడు అప్పుల్లో ఉన్న సంస్థను మూడేళ్లలో అభివృద్ధి పథంలోకి తీసుకొనివచ్చానని ఈ సందర్భంగా విరించారు.
జగన్‌ను నమ్ముకొని పార్టీలో చేరినవెంటనే మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం ఇచ్చారన్నారు. మల్కాజ్‌గిరి మిని ఇండియా అని, అందరం కలిసి ముందుకు సాగుదామని దినేష్‌రెడ్డి అనగానే సభకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో నే షనల్ మజ్దూర్ యూనియన్ నాయకుడు మహబూబ్, పార్టీ నాయకులు జంపన ప్రతాప్, నవీన్‌కుమార్, డి.శివనారాయణ, కొలన్ శ్రీనివాసరెడ్డి, సురేష్‌రెడ్డి, సత్యం శ్రీరంగం, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.