దినేశ్ రెడ్డిపై సీబీఐ విచారణ షురూ
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ వి.దినేశ్ రెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ప్రారంభించింది. అతనిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రాథమిక విచారణ నివేదికను నమోదు చేసినట్టు బుధవారం సీబీఐ వర్గాలు తెలిపాయి. మరో ఐపీఎస్ అధికారి ఉమేశ్ కుమార్ ఫిర్యాదు మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
1977 బ్యాచ్కు చెందిన దినేశ్ రెడ్డి ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టి నాలుగు వారాల్లోగా విచారణ దశ నివేదికను సమర్పించాల్సిందిగా జస్టిస్ బి.ఎస్. చౌహాన్, ఎస్.ఎ. బొబ్దెతో కూడిన సుప్రీం ధర్మాసనం సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే.