డిజిపి దినేష్ రెడ్డి పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. క్యాట్ తీర్పును హైకోర్టు సమర్ధించింది. దినేష్ రెడ్డి పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఇక ఆయన పదవీ కాలం పొడిగింపునకు అవకాశాలు మూసుకుపోయాయి. పదవీ విరమరణ వయస్సుతో సంబంధం లేకుండా డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు సేవ చేయొచ్చునని, ఆ మేరకు తన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని దినేష్ రెడ్డి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)లో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. దినేష్‌రెడ్డి విన్నపాన్ని తోసిపుచ్చింది. దాంతో ఆయన క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆదివారం వాదనలు ముగిశాయి. తీర్పును సాయంత్రం 5 గంటలకు ప్రకటించింది. క్యాట్ తీర్పునే హైకోర్టు సమర్ధించింది.