హైదరాబాద్ : కొత్త పోలీస్ బాస్గా ఏసీబీ డీజీ ప్రసాదరావు పేరు దాదాపు ఖరారైనట్లే. డీజీపీగా దినేష్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రసాదరావు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. మరోవైపు దినేష్ రెడ్డికి పోలీసు విభాగం ఘనంగా వీడ్కోలు పలికింది. కాగా దినేష్ రెడ్డి ఈరోజు ఉదయం గవర్నర్ నరసింహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.