Prasada Rao
-
విశాఖ పశు వైద్యుడికి జాతీయ అవార్డు
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ జిల్లా పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్న డాక్టర్ మాదిన ప్రసాదరావు జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పథకాలు, పశు పోషణలో నూతన ఆవిష్కరణలపై ఆయన పాడి రైతులకు అవగాహన కల్పించడంలో చేసిన విశేష కృషికి గాను ‘ఉత్తమ విస్తరణ అధికారిగా’ జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఈ నెల 27న హైదరాబాద్‌లో భారత ప్రభుత్వ సంస్థ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ సదస్సులో ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రస్తుతం డాక్టర్ ప్రసాదరావు విశాఖ జిల్లా పశు సంవర్థకశాఖ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్నారు. ఆయన ఇక్కడ శిక్షణ విభాగంలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించుకునేలా చేయడం, పాడి పశువులు, కోళ్ల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, శాస్త్రీయ, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడంలో కృషి చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ పథకాలపై ఆయన లఘు చిత్రాలు, స్వీయ రచనలు చేయడంతో పాటు వీడియోలు రూపొందించారు. వాటి ద్వారా పాడి రైతులకు సులువైన పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంతవరకు ఆయన ఆరు పుస్తకాలు, 200 పైగా వ్యాసాలు రాశారు. ప్రసాదరావు మాట్లాడుతూ యూ ట్యాబ్ చానల్ పెట్టి 140 వీడియోలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
కార్ల అమ్మకాలు రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఆటోల విక్రయాల్లోనూ వృద్ధి నెలకొంది. తద్వారా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పోల్చి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో 8.40 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే జాతీయ సగటును మించి రాష్ట్రంలో వృద్ధి చోటు చేసుకుంది. అలాగే ఇదే కాలానికి జాతీయ సగటును మించి రాష్ట్రంలో కార్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ఆటోల అమ్మకాల్లో ఏకంగా 795.28 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు రవాణా ఆదాయం రూ.1,448.35 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,570.07 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా గూడ్స్ వాహనాల అమ్మకాలు పడిపోగా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో బాగుంటే వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వాహనాల పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేíÙస్తున్నాం. కొనుగోలుదారులను ప్రోత్సహించేలా సంస్కరణలపై దృష్టి సారించాం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోళ్లు పెరిగాయి. రవాణా ఆదాయంలోనూ వృద్ధి నమోదవుతోంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ -
డాక్టర్ ప్రసాదరావుకు ఐఏసీటీఎస్ పురస్కారం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ప్రముఖ గుండె శస్త్ర చికిత్స నిపుణుడు, నిమ్స్ మాజీ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాదరావుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియో వాస్కులర్ టోరాసిక్ సర్జన్స్ (ఐఏసీటీఎస్) ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. కోయంబత్తూర్‌లో జరిగిన సదస్సులో హార్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా 69వ వార్సిక సదస్సులో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. తమిళనాడు ఆరోగ్య శాఖమంత్రి ఎంఏ సుబ్రమణియన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ జైల్‌సింగ్ మెహర్వాల్ కూడా పాల్గొన్నారు. కరోనరీ బైపాస్ సర్జరీ, హార్ట్ వాల్వ్ సర్జరీ, ఇతర గుండె ఆపరేషన్లలో ప్రసాదరావు నిష్ణాతుడైన వైద్యుడిగా, పలువురికి ప్రాణదానం చేసి అందరి మన్ననలు అందుకున్నారు. నిమ్స్‌లో అనేక అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమ్స్ యూనివర్సిటీ కోసం కూడా స్థల సేకరణలో కీలకపాత్ర పోషించారు. మెడిసిటీ, కేర్ ఆస్పత్రుల వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా విశేష సేవలు అందించారు. 2001లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. -
‘కాంతార’ వేషంలో అలరించిన తహసీల్దార్.. ప్రశంసించిన జిల్లా కలెక్టర్
విజయనగరం (కొత్తవలస): ఆయనో తహసీల్దార్... కళలంటే ఆయనకు ఎనలేని అభిమానం. అవకాశం దొరికితే తనలో ఉన్న కళను ప్రదర్శించిన పదుగురిని ఆకర్షించి అభినందనలు అందుకుంటారు. ఆయనే కొత్తవలస తహసీల్దార్ డి.ప్రసాదరావు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల విడుదలైన సూపర్ డూపర్ హిట్ తమిళ డబ్బింగ్ చిత్రం కాంతారలో ఒక సీనుకు సంబంధించి తహసీల్దార్ ప్రసాదరావు ఏకపాత్ర అభినయం చేసి ప్రశంసలు అందుకున్నారు. గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఆరో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్లో ఆయన విజయనగరం జిల్లా తరఫున పాల్గొని అలరించారు. కల్చరల్ కార్యక్రమంలో భాగంగా కాంతార సినిమాలో హీరో పాత్రను ఏకపాత్ర అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి రెవెన్యూ సిబ్బంది పోటీ పడిన ఈ కార్యక్రమంలో కాంతార అభినయం ప్రశంసలు అందుకొంది. కాంతార హీరోకు సమాంతరంగా ప్రసాదరావు మేకప్ అయి అలరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రశంసల జల్లు కురిపించి సెల్ఫీ దిగారు. ప్రసాదరావుకు ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఈయనను రెవెన్యూ సిబ్బంది అభినందించారు. -
వంగపండుకు సుస్థిర స్థానం
మార్పు కోసం తూర్పు కొండల్లో ఉదయించిన ప్రజాగాయకుడు, వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావుకు ఏపీ ప్రభుత్వం విశేష గుర్తింపునిచ్చింది. ఆయన పేరుమీద జానపద పురస్కారం ఏర్పాటు చేయటమేకాక, నిరుపేద జీవితం గడిపిన ఆయన కుటుంబానికి పదిలక్షల పారితోషకం అందిస్తూ సాంస్కృతిక శాఖ జీఓను విడుదల చేసింది. వంగపండు వర్థంతి అయిన ఆగస్టు 4న ప్రతి ఏటా పురస్కారం ఇచ్చేందుకు సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. గద్దర్ వంటి వారితో కలిసి సుదీర్ఘ కాలం జననాట్యమండలి కోసం పనిచేసిన వంగపండు,ఉమ్మడి రాష్ట్రంలో పల్లెపల్లెనా పలు ప్రదర్శనలు ఇచ్చి తమ పాటతో జన చైతన్యానికి కృషి చేశారు. ఆయన పాడిన పాటల్లో జజ్జనకరి జనారే, యంత్రమెట్ట నడుస్తున్నదంటే వంటివి విశేష ఆదరణ పొందాయి. 300కి పైగా జాపపదాలు రచించారు. బాణీకట్టి, తానే స్వయంగా కాలికి గజ్జెకట్టి ఆడి, పాడే ఆయన తెలియనివారు ఎవరూ ఉండరు. పార్వతీపురం దగ్గర్లోని పెదబొండపల్లి ఆయన స్వగ్రామం. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ.. ఏం పిల్లో ఎల్దమొస్తవా’ అంటూ ఆయన రాసి, పాడిన పాట ఎంత సంచలనం కలిగించింది. తెలుగు సమాజాలకు ఉత్తరాంధ్ర అందించిన ఉత్తమ కళాకారులలో ఆయన అగ్రగణ్యులు. ప్రజాకళాకారుడు. మూడు వందల పాటల సృజనతో, ఎడతెగని ప్రదర్శనలతో, ఏళ్ల తరబడి ఆడిన నాటకాలతో వంగపండు తన సాహిత్య, కళా, ప్రజాజీవితాన్ని సుసంపన్నంగా గడిపారు. నిజమైన అర్థంలో కార్మిక కవి. ‘జజ్జనకరి జనారే... ఏం పిల్లడో ఎల్దుమొస్తవా..’, యంత్రమెట్టా నడుత్తు ఉందంటే’, ఓడా నువ్వెళ్లిపోకే’, ‘మా కంపెనీకి జీతాలు పెరిగినయ్’... ‘ఉందర్రా మాలపేట’ వంటి పాటలు ప్రజాబాహుళ్యంలో ఉర్రూ తలూగిం చాయి. వంగపండు దళితసంవేదనను పలికించారు. కుల నిర్మూలన భావజాలంతో గజ్జెకట్టి ఆడిపాడారు. భూమిభాగోతం – వంగపండు రాసిన నృత్యరూపకం. ఈ రూపకాన్ని తెలుగునేలపై ఎన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారో తెలియదు. ఒక వెనుకబడిన ప్రాంతానికి, అదే సమయంలో సాహిత్య కళా రంగాలలో గొప్ప వారసత్వమున్న ప్రాంతానికి, వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన వంగపండు చరిత్రలో చిరస్థానాన్ని సాధించుకున్నారు. అటువంటి మహా కళాకారుడికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అత్యున్నత గుర్తింపు ఇవ్వడమేకాక, ఆయన కుటుంబాన్ని ఆదుకోవడం అభినందనీయం. – నేలపూడి స్టాలిన్ బాబు (04–08–2021న వంగపండు ప్రథమ వర్థంతి సందర్భంగా) -
మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో డీజీపీగా సేవలందించిన మాజీ ఐపీఎస్ అధికారి బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. ఇటీవల అమెరికా వెళ్లిన ఆయన ఆదివారం రాత్రి ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో మృతిచెందారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జన్మించిన ప్రసాదరావు మద్రాస్ ఐఐటీలో ఎమ్మెస్సీ (ఫిజిక్స్) చేశారు. 1979లో ఐపీఎస్ సర్వీసులో చేరారు. ఉమ్మడి ఏపీకి ఆఖరి డీజీపీ ఆయనే కావడం గమనార్హం. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలకు ఎస్పీగా, విశాఖపట్నం, హైదరాబాద్‌లకు కమిషనర్‌గా పనిచేశారు. ఇంగ్లిష్ భాషపై, సైన్స్‌పై ఆయనకు మంచి పట్టు ఉండేది. ఏపీఎస్ ఆర్టీసీకి ఎండీగా కూడా ఆయన సేవలందించారు. ప్రసాదరావు సమర్థుడైన అధికారి అని, తన తరువాత తరాలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని పలువురు ఐపీఎస్ అధికారులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. పోలీసు విభాగంలో విద్యావేత్త..! సాధారణంగా ఎవరైనా ఫోన్ ఎత్తగానే హలో అంటుంటారు. అయితే ‘నమస్తే ప్రసాదరావు’అనడం ఆయనకే సొంతం. 1955 సెప్టెంబర్ 11న పుట్టిన ప్రసాదరావు ఇంటర్ వరకు గుంటూరు జిల్లాలో తెలుగు మీడియంలో చదువుకున్నారు. ఆంధ్రా లయోలా కాలేజ్‌లో డిగ్రీలో చేరాక ఆంగ్లంలో మాట్లాడటానికి ఇబ్బందులు ఎదురుకావడంతో ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలని నిర్ణయించుకున్నారు. అలా ప్రారంభమైన తపన దాదాపు 11 వేల పదాలు ఆయన మేధస్సు అనే నిఘంటువులో నిక్షిప్తం అయ్యే వరకు వెళ్లింది. అయినప్పటికీ ప్రసాదరావు చేపట్టిన ‘ఆపరేషన్’కు పుల్‌స్టాప్ పడలేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఆయన పత్రికలు, పుస్తకాలు, నవలల నుంచి 20కి తక్కువ కాకుండా సాధ్యమైనన్ని కొత్త పదాలను ఎంపిక చేసుకుని, నిఘంటువు ద్వారా అర్థాలు తెలుసుకుంటూ జాబితా తయారు చేసేవారు. ఇలా ‘ఎ’టు ‘జెడ్’వరకు అన్ని అక్షరాలకు సంబంధించిన పదాలతో దాదాపు 500 కథనాలు రాసిన ఆయన 11 వేల ఆంగ్ల పదాలను ఔపోశన పట్టారు. వీటిలో ‘సి’అక్షరానికి సంబంధించిన 640 పదాలతో రూపొందించిన కథనాల సమాహారాన్ని ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’పేరుతో పుస్తకంగా మలిచారు. దీన్ని 2012లో ఆవిష్కరించారు. ఇక సైన్స్ పట్ల కూడా ప్రసాదరావు ఎంతో ఆసక్తి చూపేవారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లోనే పెద్ద ఫిజిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ శాస్త్రంపై మంచి పట్టు సాధించిన ఆయన, సుదీర్ఘ పరిశోధన చేసి ‘థియరీ ఆఫ్ లైట్’లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ ‘న్యూ లైట్ ఆన్ లైట్’సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగారు. దీంతో ప్రసాదరావును డాక్టరేట్ వరించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం మాజీ డీజీపీ ప్రసాద్‌రావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రసాద్‌రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏపీ గవర్నర్ సంతాపం.. మాజీ డీజీపీ ప్రసాదరావు మృతి పట్ల ఏపీ గవర్నర్ హరిచందన్ సంతాపం తెలిపారు. ప్రసాద్‌రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గవర్నర్, సీఎం సంతాపం ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా సేవలందించిన ప్రసాదరావు మరణం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డీజీపీ, కొత్వాల్ దిగ్భ్రాంతి ప్రసాదరావు మృతిపై డీజీపీ మహేందర్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతి తెలిపారు. ప్రసాదరావు మరణించారనే వార్త షాక్‌కు గురి చేసిందని, ఆ విద్యావేత్తకు ఆంగ్లంలో కష్టమైన పదాలు నేర్చుకునే ఆసక్తి ఉండేదని నగర కొత్వాల్ అంజనీకుమార్ అన్నారు. ప్రసాదరావు లేరనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపీరెడ్డి అన్నారు. చదవండి: కాంట్రాక్టరు పాపం, అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు ఏం జరిగిందో ఏమో.. యువతి అనుమానాస్పద మృతి -
జనం గుండెల్లో రాజన్న సంక్షేమం
‘‘రాజు మరణించు నొకతార రాలిపోయే కవియు మరణించు నొకతార గగనమెక్కె రాజు జీవించు రాతి విగ్రహములందు సుకవి జీవించు ప్రజల నాలుకల యందు’’ ఇక్కడ మహాకవి జాషువా పద్యపంక్తులు సందర్భోచితం. ఆయన సుకవిని కీర్తించినా రాజన్న విషయంలో సుపరిపాలకునికి అన్వ యించుకోవడం సముచితమే. తారగా రాలిపోయినా ధృవతారగా జనం గుండెల్లో వెలుగొందడం రాజన్నకే సాధ్య మయింది. అంతేకాదు.. సుపరిపాలకుడు ప్రజల నాలుకలపై జీవించే వుంటాడని రాజన్న శిలాశాసనం రాశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ప్రజల కోసం కలలు కన్నారో ఆ జనం గుండెల నిండా సుపరిపాలనా ప్రతిమగా నిలిచి నేడు పండువెన్నెల్లా ప్రకాశిస్తు న్నారు. అందరి నోటా రాజన్న తనయుడు జగనన్న నామస్మరణే నేడు మారుమోగుతోంది. నాటి అపరభగీరథుని శ్రమ నేడు ఆంధ్రప్రదేశ్ అంతటా హరితహారమై పరిమళిస్తోంది. రాజన్న కలల సాకారానికి జగనన్న పాలన నిండు నిదర్శనంగా నిలిచింది. (చదవండి: నాకు తెలిసిన మహనీయుడు) ప్రజాహృదయాల్లో జీవించే వున్న రాజన్న స్మృతి చిరస్మరణీయం. దశాబ్దకాలం రైతుల్ని కాలదన్ని, వ్యవసాయాన్ని వ్యర్థమన్న కార్పొరేట్ పాలన కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసిన విమోచకుడు వైఎస్సార్. 2004కి ముందు గడిచిన తొమ్మిదేళ్ళ పాలన రాజన్నకు ఎన్నో చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోనే భవిష్యత్’ అనే అబద్ధాన్ని నినాదంగా ప్రచారం చేసి మిగతా చదు వుల్ని, రంగాల్ని నిరుత్సాహానికి గురిచేసిన సందర్భాన్నీ ఆయన గుర్తుంచుకున్నారు. మిగతా చదువులు, రంగాల భవితవ్యాన్ని ఆలోచ నలో వుంచుకున్నారు. భారీగా విద్యుత్ చార్జీలు పెంచి వినియోగదా రుల్ని నడ్డివిరిచిన నిర్ణయాన్ని ఆయన పత్రికల సాక్షిగా దుయ్యబ ట్టారు. నిరసనగా రైలుపట్టాల మీద కొచ్చిన కాల్దరి రైతుల రక్తం కళ్ళ చూసిన ప్రభుత్వ హత్యల్ని నిలదీశారు. రాజధానిలోనే విద్యార్థుల మీద బుల్లెట్ల వర్షం కురిపించిన కర్కశంపై రాజన్న కదం తొక్కారు. (చదవండి: ఇక్కడెవరైనా అమృతం తాగి ఉన్నారా?) ప్రతిపక్షనాయకునిగా ఆనాటి ప్రభుత్వ కఠిన నిర్ణయాల్ని కాలినడకన ప్రచారం చేసి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపిన మహాపాద యాత్రకుడా యన. రక్తం కార్చిన అరికాళ్ళ పాదముద్రల ప్రమాణంగా కోట్లాది మంది ప్రజానీకానికి బతుకు భరోసా కల్పించారు. కఠిన నిర్ణయాల మధ్య కాలం వెళ్లదీసిన ప్రజలు, సహకారం సన్నగిల్లి వ్యవసాయాన్ని పక్కనబెట్టిన రైతు, పనుల్లేక కునుకుతీసిన కూలీలు, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగులు రాజన్న వెంట నడి చారు. ఆయనకు ఊరూరా నీరాజనాలు అందించారు. జనం జనం కలిసి ప్రభంజనమై వైఎస్ రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. రైతులకు, పేదలకు ఉచిత విద్యుత్ దస్త్రం మీద తొలి సంతకాన్ని దస్తూరీగా చేసి మాటతప్పని మహానాయకునిగా అవతరించారు. రాజన్నగా తన పేరును ప్రజల పిలుపుగా మార్చుకున్నారు. ప్రజల కలల సాకారానికి నిలువెత్తు సాక్షిగా నిలిచిన పాలకుడు రాజన్న. రాజకీయాల్లో యువతరం ప్రాధాన్యత పెంచడానికి ఒక చారిత్రక అవసరంగా రాజన్న రాజకీయ అరంగేట్రం జరిగింది. 1978లో పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పులిబిడ్డగా తొలిసా రిగా ఎన్నికైన తర్వాత ఆయన విజయపరంపర అంతిమక్షణం వరకు వెన్నుతట్టి విజయపథం వైపు నడిపించింది. శాసనసభలోనైనా, లోక్ సభలోనైనా తనదైన బాధ్యతాయుతమైన పాత్ర జనం మెచ్చిన నిజమై రగిలింది. అంతర్గత ఆధిపత్య పోరుల్లో కోల్పోయిన అవకాశాలు తనలో పట్టుదలను రేకెత్తించాయి. చెవులతో వినడమే తప్ప కళ్ళతో చూడటం తెలియని అధిష్టానం కళ్ళు తెరిపించిన ఘనత అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ వైఎస్‌దే. (చదవండి: అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం.. అదే గమ్యం ) చివరిగా తనకు తాను కాలినడకన ప్రత్యక్షంగా ప్రజలందరినీ పలకరిస్తే తప్ప అధిష్టానం కళ్ళుతెరచి నిజాన్ని చూడలేకపోయింది. అనంతరం ముఖ్యమంత్రిగా అవతరించిన డాక్టర్ వైఎస్ సంక్షేమ సంతకంగా, మాటల మనిషిగా కాదు చేతల మనిషిగా ప్రజాజీవితాలతో మమేకమైపోయారు. వైఎస్సార్ రైతు సాగు నీటి కోసం, తాగు నీటి కోసం వెలిగొండ, గుండ్లకమ్మ, రామతీర్థ ప్రాజెక్టులై ప్రవహించారు. కోట్లాది రూపాయల రుణమాఫీతో నష్టాల్లో ఉన్న రైతులను వైఎస్సార్ ఆదుకున్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే అభివృద్ధి సాధ్యమని భావించిన రాజన్న అపర భగీరథునిగా అవతరించారు. నిలువనీడ లేనివారికి పక్కా ఇళ్లు, భూమి పంపిణీ చేశారు. వృద్ధాప్య పింఛన్లు రాష్ట్రంలో గొప్ప పేదరిక నిర్మూలన విప్లవం. తనను మహానేతను చేసిన ప్రజలకు తన పాలనను కళ్ళారా చూపించాలని ఆలోచన చేసిన రాజన్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కోట్లాదిమంది జనం ఆయుష్షు పెంచారు. అన్ని కులాల, మతాల, వర్గాల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. ఉచిత విద్యుత్తుతో ప్రతి ఇంటా వెలుగులు విరజిమ్మిన విశాలహృదయుడు రాజన్న. సంక్షేమంలో ‘చెరగనిముద్ర’గా, రాయితీల్లో ‘రైతు పక్షపాతి’గా, విద్యావిషయకమై ‘విశాలహృదయుని’గా, ప్రజారోగ్యంలో ‘ఆరోగ్య శ్రీమంతుని’గా అశేషప్రజానీకానికి విశేషసేవలందించిన ‘విశ్వన రుడు’ రాజన్న. ‘రచ్చబండ’ దగ్గరే రాజకీయం నిగ్గు తేల్చాలనుకు న్నారు. ఊరిజనాన్ని ఒక్కచోట, ఒకేతాటిపై నిలపాలనుకున్నారు. సమస్యలకు సత్వర పరిష్కారం ఇవ్వాలనుకున్నారు. సకలజన సౌభాగ్యాన్ని స్వాగతించాలనుకున్నారు. ప్రమాదవశాత్తూ స్వప్నకథగా మిగిలిన ఆయన జీవితం జనజీవన స్రవంతిలో సాక్షాత్కారమయింది. తండ్రి పోరాట జవసత్వాలతో రాజకీయంగా జనించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి స్వాభిమాన పోరాటాన్ని పతాకగా ఎగురవేశారు. అభిమానంతో ప్రజలే సహజ కవచకుండలాలుగా జగన్‌తో జతకట్టారు. రాజన్న సంక్షేమమే పరమావధిగా పాలన కొనసాగిస్తున్న వైఎస్ జగన్ ప్రజాభిమానం చూరగొన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అలుపెరగలేదు. తనయుడు జగన్మోహన్రెడ్డి సైతం అంతే.. తండ్రి అడుగుల్లో అడుగులేసి సమస్త జనావళి ముఖారవిందాలను ప్రేమగా ముద్దాడే తీరునే సొంతం చేసుకున్నారు. తండ్రి జ్ఞాపకాల్నీ తనివితీరా ఆస్వాదించే పాలనే చేస్తున్నారు. జనం గుండెల్లో రాజన్న సంక్షేమాన్ని నిండా నింపుతున్నారు. డా. జీకేడీ ప్రసాదరావు -వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం -
గజ్జెకట్టిన పాటెళ్లిపోయింది
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ పార్వతీపురంటౌన్/సాక్షి, అమరావతి: ‘ఏం పిల్లో ఎల్దమొస్తవా‘... అంటూ ప్రజలను ఉర్రూతలూగించిన ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు(77) ఇకలేరు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్లో మంగళవారం వేకువ జామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వంగపండు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పదునైన పదాలకు సొంపైన బాణీలతో స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి పాడే వంగపండు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు. సీఎం జగన్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వరులు దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా వంగపండు అంత్యక్రియలను పూర్తి చేశారు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో వంగపండు రచించిన గీతాలను ఆలపిస్తూ విప్లవ జ్యోతికి తుది వీడ్కోలు పలికారు. వంగపండు కుమార్తె ఉష వైఎస్సార్సీపీలో ఉన్నారు. రాష్ట్ర సృజనా త్మక, సాంస్కృ తిక కమి షన్ చైర్ పర్సన్‌గా సేవలందిస్తున్నా రు. తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే ఆమె పార్వతీపురం చేరుకున్నారు. తండ్రితో కలసి పలు ప్రదర్శనల్లో పాల్గొని విప్లవ గీతాలతో చైతన్యం రగిల్చారు. ఆ గుర్తులను తలచుకుని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి భౌతిక కాయం వద్ద విలపిస్తున్న కుమార్తె వంగపండు ఉష విప్లవ గీతాలకు పెట్టింది పేరు 1943 జూన్‌లో పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో జగన్నాథం, చినతల్లి దంపతులకు వంగపండు జన్మించారు. తన రచనలతో, పాటలతో ప్రజలను చైతన్యం చేశారు. 1972లో నాటి పీపుల్స్ వార్ సాం స్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించి 400కి పైగా జానపద గీతా లను రచించారు. ముఖ్యమంత్రి జగన్ సంతాపం ప్రజా గాయకుడు, కవి వంగపండు ప్రసాదరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పామును పొడిచిన చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఆయన ఓ మహాశిఖరంగా నిలిచిపోతారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’’ అని సీఎం ట్వీట్ చేశారు. చైతన్య స్ఫూర్తిని కోల్పోయాం.. వంగపండు మృతి పట్ల ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సంతాపం తెలిపారు. జన పదాలతో ప్రజల గొంతుక వినిపించిన వంగపండు మృతితో చైతన్య స్ఫూర్తిని కోల్పోయామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గళంతోనే జగత్తును కదిలించిన ప్రజాకవి వంగపండు మృతి పట్ల వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, ఏపీడబ్లు్యజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.ఆంజనేయులు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సీఐటీయూ నాయకుడు గఫూర్ తదితరులు సంతాపం తెలిపారు. -
జేసీ జాతీయ స్థాయి భారీ కుంభకోణం
-
జేసీ ట్రావెల్స్‌పై రూ.100 కోట్ల జరిమానా!
సాక్షి, అనంతపురం: తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్‌పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు అన్నారు. అంతేకాక జేసీ ట్రావెల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. దీని ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్-4 వాహనాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. కానీ దీనికి విరుద్ధంగా అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్-3 వాహనాలు గుర్తించామని తెలిపారు. అయితే వీటిని స్క్రాబ్ కింద విక్రయించామని అశోక్ లేలాండ్ కంపెనీ తమకు వివరాలు పంపిందని వెల్లడించారు. (నకిలీలు 'జేసి'!) సుప్రీం నిబంధనలకు విరుద్ధంగా.. ‘నాగాలాండ్‌లో బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చారు. ఇందులో ఆరు వాహనాలు జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ జరిగాయి. ఒక వాహనం జేసీ ట్రావెల్స్ సంస్థ జటాధర ఇండస్ట్రీస్ పేరిట రిజిస్టరయ్యాయి. మరో నాలుగు లారీలు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి జేసీ ఉమారెడ్డి పేరిట రిజిస్టరయ్యాయి. దీనిపై వన్‌టౌన్ పీఎస్‌లో జేసీపై ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న జేసీ ట్రావెల్స్‌పై విచారణ చేయాలని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా పర్మిట్లు లేని వ్యవహారంతోపాటు, ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీతో జేసీ బ్రదర్స్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజా ఫిర్యాదుతో రవాణాశాఖ ఉన్నతాధికారులు జేసీ ట్రావెల్స్ అక్రమాలను వెలికితీసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పోలీసుల జోలికి వెళ్లే పతనమయ్యావ్! -
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా రిలే దీక్షలు
ఏలూరు: రాష్ట్రంలో ఉన్న 19 లక్షల 20 వేల మంది అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ కమిటీ వేసిందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ రావూరి ప్రసాద రావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పార్టీ కార్యాలయంలో రావూరి విలేకరులతో మాట్లాడారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే లక్షా 16 వేల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వానికి అగ్రిగోల్డ్ ఆస్తులపై ఉన్న ఆసక్తి బాధితులకు న్యాయం చేసే విషయంలో లేదన్నారు. రాష్ట్రంలో అధికారికంగా 260 మంది అగ్రిగోల్డ్ బాధితులు మరణిస్తే 143 మందికి మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల కోసం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రస్తుతం రూ.30 వేల కోట్ల ధర పలుకుతున్నా ప్రభుత్వం న్యాయం చేయడంలో అశ్రద్ధ వహిస్తోందని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల ఆసరా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ స్పందించకపోతే 30వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలియజేస్తామన్నారు. -
మరో వివాదంలో మాజీ ఏఎస్ఐ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌లోని కెన్‌క్రెస్ట్ పాఠశాల అధినేత ప్రసాదరావు ఆత్మహత్య కేసు లో ప్రధాన నిందితుడిగా ఉన్న అక్రమ ఫైనాన్స్ నిర్వాహకుడు, మాజీ ఏఎస్ఐ బి.మోహన్‌రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఓ కేసు విచారణ నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో సెటిల్మెంట్ చేసి.. ఎస్కార్టు పోలీసులతో ఏసీ కారులో బయటకు వెళ్తున్న వీడియో దృశ్యాలు బయటపడ్డాయి. వీడియో దృశ్యాలను చిత్రీకరించిన మోహన్‌రెడ్డి బాధితు ల సంఘం, లోక్‌సత్తా ఈ వ్యవహారాన్ని మీడియాకు రిలీజ్ చేసింది. సబ్‌కోర్టులో కేసు నం 416లో విచారణ నిమిత్తం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో జిల్లా కోర్టు పక్కన గల ‘రెడ్డిగారి వంటిల్లు’లో భోజనానికి వెళ్లి సన్నిహితులతో ములాఖత్ కావడం వివాదా స్పదంగా మారింది. గతంలో కోర్టు ముందు గల ఉడిపి హోటల్లో సెటిల్మెంట్ నిర్వహించి డబ్బులు పంపిణీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా బట్టబయలయ్యాయి. ఈ వ్యవహారంలో ఎస్కార్టు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఈ నెల ఒకటిన కరీంనగర్ కోర్టుకు వచ్చినప్పు డు సమీపంలోని భోజనశాలలో కూర్చొని సన్నిహితులతో ములాఖత్ నిర్వహించడం మరోమారు వివాదాస్ప దమైంది. మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డితోపా టు ఆయనకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్‌రెడ్డి, సాయన్న ఒక ప్రకటనలో కోరారు. ప్రైవేట్ వాహనాన్ని అనుమతించి మోహన్‌రెడ్డి ప్రైవేట్ ములాఖత్‌కు సహకరించిన ఎస్కార్ట్ పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణకు కూడా ఆదేశించామని కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
నిమ్న కులాలంటే బాబుకు ఎప్పుడూ చిన్నచూపే
గూడూరు: నిమ్న కులాలను తక్కువగా చూడటం చంద్రబాబుకు అలవాటేనని మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. సీఎంగా అసమానతలు తగ్గించాల్సిందిపోయి ఇంకా పెరిగేలా బాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పట్టణంలోని ఆస్పత్రి రోడ్డు ప్రాంతంలో ఉన్న సీఆర్ మార్ట్‌లో ఆదివారం తిరుపతి పార్లమెంట్ పరిధిలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలకు చెందిన బీసీ నాయకుల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన వరప్రసాద్రావును ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి చింతల రాజశేఖర్ అతిథులను సన్మానించారు. వెలగపల్లి మాట్లాడు తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీరని అన్యాయం చేస్తు న్న చంద్రబాబుకు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారని, ఆ పదవికి ఒక క్లర్క్‌ను కూడా బదిలీ చేసే పవర్ లేదన్నారు. బీసీలకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా రిజర్వేషన్ కల్పించినప్పుడే నిజ మైన ప్రజాస్వామ్యం వచ్చినట్లన్నారు. పేదల నుంచి ఎకరం, అరెకరం పొలాలను పరిశ్రమల పేర బలవంతంగా లాక్కొని వారిని భిక్షగాళ్లను చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే బీసీలంతా ఐక్యంగా ఉండాలన్నారు. బాబుకు అర్హత లేదు వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ బీసీ కులాలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తారన్నారు. రూ.10 వేల కోట్లు బీసీల అభివృద్ధి కోసం కేటాయిస్తానన్న మాటలేమయ్యాయని ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదన్నారు. కుప్పం సీటు బీసీలకు ఇచ్చి, మరోచోట బాబు పోటీ చేయొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. జగనన్న చట్టసభల్లో కూడా బీసీలకు స్థానం కల్పించాలనే థృక్పధంతో ఉన్నారన్నారు. జగనన్నతోనే సాధ్యం వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేట సంజీవయ్య మాట్లాడుతూ టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, దీంతో రాష్ట్ర పాలన పూర్తిగా గాడితప్పిందన్నారు. వైఎస్ హయాంలా రామరాజ్యం రావాలంటే అది ఒక్క జగనన్నతోనే సాధ్యమన్నారు. వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో ఆయన అన్ని బీసీ కులాలను తనతోపాటు చట్టసభల్లోకి తీసుకెళ్తానని చెప్పారన్నారు. దీనిని బట్టే ఆయన వ్యక్తిత్వం అర్థమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారన్నారు. పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్న జగనన్నకు రాçష్ట్ర ప్రజానీకం బ్రహ్మరథం పడుతోందన్నారు. ఆయన నడుస్తూనే అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయీ బ్రాహ్మణులను అనాగరికంగా మాట్లాడి ఆయన అసలు రూపాన్ని బయటపెట్టారన్నారు. అనంతరం జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ పొట్టేళ్ల శిరీషా, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ యారం మంజుల, నాయకులు కోడూరు మీరారెడ్డి తదితరులు మాట్లాడారు. బీసీ నాయకులు తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో పార్టీ సీజీసీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు గూడూరు రాజేశ్వరరెడ్డి, మెట్టా రాధాకృష్ణారెడ్డి, వంకా రమణయ్య, కౌన్సిలర్లు నాశిన నాగులు, చోళవరం గిరిబాబు, రమీజా, జిల్లా కార్యదర్శి తాళ్లూరు శ్రీనివాసులు, దాసరి వెంకటేశ్వర్లు, ఎల్లా శ్రీనివాసులురెడ్డి, బత్తిని విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిక సూళ్లూరుపేట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదరపాకం బాలసుబ్రహ్మణ్యం, బీసీ సంఘం నాయకులు కొండూరు జనార్దన్‌తోపాటు పలువురు కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి మాజీ ఎంపీ వరప్రసాద్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు కిలివేటి సంజీవయ్య, మేరగ మురళీధర్, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఉన్నారు. ఈ మేరకు వారిని పార్టీలో చేర్పించేందుకు సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి, తిరుమూరు రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాండవుల కొండను కొల్లగొట్టేస్తున్నారు!
► మడ్డువలసలో అక్రమ క్వారీ నిర్వహణ ► అనుమతుల్లేకున్నా..అడ్డుగోలుగాతవ్వకాలు ► రవాణాకు రంగం సిద్ధం చేస్తున్న వైనం ► పొరుగు జిల్లా మంత్రి పేరుతో దందా మడ్డువలస..ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే గొర్లె శ్రీరాములునాయుడు (మడ్డువలస) ప్రాజెక్టు. పక్కనే పంచ పాండవుల కొండ. ఈ రెండింటికి ముప్పు వాటిల్లేలా కొంతమంది బరితెగించారు. పాండవుల కొండపై అక్రమంగా కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్ తవ్వకాలు చేపడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ తతంగమంతా పొరుగు జిల్లాకు చెందిన మంత్రి అనుచరుల అండదండలతో సాగిపోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కనీసం దృష్టిసారించలేదనే విమర్శలు వస్తున్నారుు. వంగర: అక్రమ మైనింగ్‌పై కొంతమంది కన్నేశారు. కోట్ల రూపాయల విలువైన కొండలను పిండి చేసేస్తున్నారు. పక్కా ప్లాన్‌తో, ఎటువంటి అనుమతులు లేకుండా గ్రానైట్‌ను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ అక్రమ డిజైన్‌కు పచ్చరంగు పులుముకుంది. వంగర మండల పరిధి మడ్డువలస ప్రాజెక్టును ఆనుకొని ఉన్న పాండవుల పంచ కొండపై అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారు. వాస్తవంగా ఇది పటువర్థనం బౌండరీకి చెందిన కొండ అరుునా మడ్డువలసకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అటు వైపు ఎవరూ వెళ్లరూ.. అక్కడ ఏమి జరిగినా గోప్యమే. అందరి కళ్లు కప్పి ప్రారంభించిన ఈ గ్రానైట్ తవ్వకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఈ ప్రాంతంలో 35 ఏళ్ల క్రితం నుంచి ఎంటర్ప్రైజ స్ అండ్ ఎంటర్ పైజింగ్ కంపెనీ పేరుతో గ్రానైట్ క్వారీ నడుస్తుంది. ఆ క్వారీని అనుసరించినదే కొత్తగా తవ్వకం చేపడుతున్న క్వారీ అని జనాన్ని అక్కడ బినామీ దారులు నమ్మించారు. సరేలే అనుమతి ఉన్న కొండ కదా అని జనం అంతా నమ్మి ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అరుుతే ఇటీవల కొం త మంది దళారులు వంగర తహశీల్దార్ కార్యాలయానికి రావడాన్ని గమనించిన ‘సాక్షి’ ఆరా తీయగా అసలు రంగు బయటపడింది. అక్కడకు వెళ్లి చూడగా అనుమతులు లేని గ్రానైట్ కొండని, చేస్తున్నది అక్రమని తేలింది. అక్రమంగా తవ్వకం ! మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టును అనుసరించి గ్రానైట్ కొండ ఉంది. దీన్ని పేలుడు పదార్థాలను వినియోగించి రారుుని కొల్లగొడుతున్నారు. పెద్ద పేలుళ్లు సంభవిస్తే ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గత నెల రోజులుగా నడుస్తున్న చీకటి పనుల్లో వందల సంఖ్యలో గ్యాంగ్‌సైజ్ బ్లాకులు కట్ చేశారు. వీటిపై కొనుగోలుదారుల పేరుతో ముద్రలు కూడా వేశారు. ఎవరికీ తెలియకుం డా వీటిని విక్రరుుంచేందుకు, పొరుగు క్వారీ పేరుతో గ్యాంగ్బ్లాకులు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కోట్లాది రూపాయల విలువ చేసే ఎరుుర్కంపర్షన్, రూప్కటింగ్ మిషన్, పొక్లరుునర్ వంటి భారీ యంత్రాలను కూడా గ్రానైట్ తవ్వకాలకు వినియోగిస్తున్నారు. రారుుని పేల్చేందుకు ప్రత్యేక పరికరాలను వాడుతున్నారు. కొండపైకి వెళ్లేందుకు పక్కా రహదారిని కూడా అక్రమార్కులు నిర్మించేశారు. పొరుగు జిల్లా మంత్రి అండదండలతో... పొరుగు జిల్లా అరుున విజయనగరానికి చెందిన ఓ మంత్రి అండదండలతో టీడీపీకి చెందిన ఈ ప్రాంత నాయకులు అక్రమ గ్రానైట్ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నారుు. విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులతో ఈ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు చేతులు కలిపి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు లేకపోరుునా ఇష్టారాజ్యంగా....గుట్టు చప్పుడు లేకుండా తవ్వకాలకు పాల్పడుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన బ్లాకులను ఇప్పటికే సిద్ధం చేసేశారు. అరుుతే ఇటీవల ఈ ప్రాంతంలో ఉన్న ఎంటర్‌ప్రైజస్ అండ్ ఎంటర్ప్రైజింగ్ కంపెనీ పేరుతో నడుస్తున్న గ్రానైట్ క్వారీని తనిఖీ చేసేందుకు వెళ్లిన అధికారుల దృష్టిలో అక్రమ గ్రానైట్ తవ్వకాలు పడినట్టు భోగట్టా. ప్రతిష్టాత్మకం పాండవుల కొండ .. పాండవుల కొండకు ఎంతోపేరుంది. కొండ వెనుక భాగంలో ప్రతిష్టాత్మక పాండవుల పంచ ఉంది. ద్వాపర యుగంలో పాండవులు ఈ ప్రాంతంలో సంచరించినట్లు కొండపై ఆనవాళ్లున్నారుు. ఇక్కడ ఉన్న ఓ గుహలో పాండవులు నివాసం ఉన్నట్లు పూర్వీకులు చెబుతుండేవారని ఈ ప్రాంతీయులు కథలుకథలుగా చెబుతుంటారు. ఇటువంటి ప్రాముఖ్యత ఉన్న కొండపై అక్రమ గ్రానైట్ తవ్వకాలు చేయడంపై ఈ ప్రాంతీయుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరికీ లీజుకు ఇవ్వలేదు పటువర్థనం గ్రామం పరిధిలో ఈ కొండ బౌండరీ ఉంది. 341 సర్వే నంబరులో ఐదెకరాల విస్తీర్ణంలో కొండ ప్రాంతం ఉంది. అరుుతే ఈ కొండ ప్రాంతం ఏ ఒక్కరికీ లీజుకు ఇవ్వలేదని వీఆర్ఓ పి.సుధాకర్ నివేదిక ఇచ్చారని తహశీల్దార్ పందిరి అప్పారావు ‘సాక్షి’కి తెలిపారు. మైనింగ్ ఏడీ ఏమన్నారంటే.. మైనింగ్‌శాఖ ఏడీ ప్రసాదరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఇటీవల క్వారీని తనిఖీ చేసి నిర్వహకులకు నోటీలు అందజేశామన్నారు. -
'ఆ అధికారం స్పీకర్‌కు ఉండదు'
-
జిల్లాలో 136 డెంగ్యూ కేసులు
డీఎంఓ ప్రసాదరావు తుమ్మపాల: జిల్లాలో 136 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు అన్నారు. మండలంలోని బవులవాడ పంచాయతీ దర్జీనగర్, తుమ్మపాల పీహెచ్‌సీని ఆయన గురువారం పరిశీలించారు. దర్జీనగర్‌లో రెండేళ్ల బాలుడు టి. మోహిత్‌కు డెంగ్యూ నిర్దారణ కావడంతో ఆయన పర్యటించారు. గ్రామంలో నీటి నిల్వలున్న చోట దోమలు వ్యాప్తి చెందుతాయని, నిల్వలు ఉండకుండా జాగ్రత్త పడాలని గ్రామస్తులకు సూచించారు. దోమల మందును ఇంటింటా పిచికారి చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 17 వరకు 136 డెంగ్యూ కేసులు, 57 చికున్ గున్యా, 6,160 మలేరియా కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీంతో అన్ని గ్రామాల్లో అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. డెంగ్యూ నివారణలో ఆరోగ్య శాఖ, పంచాయతీ అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించి ఇళ్లల్లోని గోళాలలో నీటిని ఎప్పటికప్పుడు పొడిగా ఉంచాలన్నారు. చిన్నపిల్లలు దోమకాటుకు గురికాకుండా పూర్తిస్థాయిలో దుస్తులను వేయించాలన్నారు. ఏఎంఓ పి. రామారావు, జిల్లా కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాసరావు తుమ్మపాల పీహెచ్సీ వైద్యాధికారి ఐ. ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. ఉగ్గినపాలెంలో ముగ్గురికి డెంగ్యూ కశింకోట: మండలంలోని ఉగ్గినపాలెంలోనూ ముగ్గురికి డెంగ్యూ వ్యాధి సోకినట్లు నిర్థారణ అయింది. గాలి మంగ, కలగ కనకరత్నం, బుదిరెడ్డి రమణలకు వ్యాధి సోకినట్లు తాళ్లపాలెం పీహెచ్సీ వైద్యాధికారి లూసీ కార్డిలియా తెలిపారు. పది మంది రక్త నమూనాలు విశాఖ కేజీహెచ్‌కు పంపగా ఈ నివేదిక వచ్చిందన్నారు. వైద్య శిబిరంలో ముగ్గురికి, జి.భీమవరం శిబిరంలో పది మందికి జ్వరాలు ఉన్నట్లు తేలిందన్నారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్న పది మందికి పీహెచ్సీలో వైద్యమందించినట్టు తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపమే వ్యాధులకు కారణమన్నారు. అనకాపల్లి వంద పడకల ఆసుపత్రి వైద్యుడు రత్నకుమార్ జి.భీమవరంలో వైద్య సేవలందించారు. -
ప్రయోగాత్మకంగా స్వర్ణ రథ పరిశీలన
తిరుమల: తిరుమలలో సోమవారం శ్రీవారి స్వర్ణరథాన్ని ప్రయోగాత్మకంగా ఊరేగించి పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు రథ మండపం నుంచి రథాన్ని వెలుపలకు తీసారు. ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు లాగారు. ఎస్ఈ రమేష్‌రెడ్డి, ఈఈలు జీవీ కృష్ణారెడ్డి, నరసింహమూర్తి, ఏఈ దేవరాజులు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ సీఎండీ ప్రసాదరావు, ఇతర ఇంజనీరింగ్ నిపుణులు .. రథం పనితీరును పరిశీలించారు. రథచక్రాల హైడ్రాలిక్ వ్యవస్థ ఎలా పనిచేస్తోందో చూశారు. మలుపుల వద్ద ఎంత దూరంలో ఉన్నప్పుడు ముందుజాగ్రత్తలు తీసుకునే విషయంపై అధ్యయనం చేశారు. శ్రీవారి చక్రస్నానం తిరుమలలో సోమవారం శ్రీవారి చక్రస్నానం నిర్వహించారు.ఏటా భాద్రపద మాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య చక్రస్నానం నిర్వహించారు. -
కేంద్రీయ విద్యాలయ స్థలాన్ని పరిశీలించిన ఎంపీ వైవీ
రాజంపల్లి(పెద్దారవీడు) : మార్కాపురం డివిజన్ విద్యలో ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయిస్తున్నామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గిద్దలూరు, కంభం, మార్కాపురం ప్రాంతాల్లో ఎక్కువ మంది మిలటరీలో ఉద్యోగాలు చేస్తుండడంతో ఈ ప్రాంతానికి పాఠశాల ఆవశ్యకతను గుర్తించామన్నారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ వైవీ, ఎమ్మెల్యే డేవిడ్‌రాజు గురువారం మండలానికి వచ్చారు. గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి ఆలయ సమీపంలో విద్యాలయానికి అవసరమైన ప్రభుత్వ భూమిని ఎంపీ పరిశీలించారు. ఒంగోలు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ప్రసాదరావు ఉన్నారు. రాజంపల్లి గ్రామంలోని శ్రీ గొడ్రాలి కొండ తిరుమలనాథ స్వామి దేవాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలను ఆలయ చైర్మన్ ఏర్వ నారాయణరెడ్డి, ఆలయ మేనేజర్ ఏవీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు భవానీ ప్రసాద్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ చైర్మన్, మేనేజర్‌తోపాటు ఎంపీపీ ఏర్వ భాగ్యలక్ష్మి దంపతులు వారికి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. జెడ్పీటీసీ సభ్యులు దుగ్గెంపూడి వెంకటరెడ్డి, అమిరెడ్డి రామిరెడ్డి, మంత్రునాయక్, ఆలయ మాజీ చైర్మన్ ఏర్వ చిన్న కోటిరెడ్డి, పార్టీ నేతలు గొట్టం శ్రీనివాసరెడ్డి, జంకె ఆవులరెడ్డి, కాసు వెంకటరెడ్డి, ఎస్కే బుజ్జి, ఏర్వ బ్రహ్మానందరెడ్డి, గొట్టం సూర్య నారాయణరెడ్డి, మూడమంచు కొండగురవయ్య, సాయి కృష్ణ, కాశయ్య, డీ వెంకటరెడ్డి, నందిరెడ్డి రఘునాథరెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, ఏర్వ చలమారెడ్డి, అల్లు చలమారెడ్డి, బి.సాలయ్య, సర్వేయర్ శివశంకర్, వీఆర్వో శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ కొలగొట్ల వెంకట నారాయణరెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు ముంపు పరిధిలోని కలనూతల గ్రామస్తులు తమకు నష్టపరిహారం ఇప్పించాలని ఎంపీకి వినతి పత్రం అందజేశారు. -
ఎవరి బాధ్యతలు వారే..
ఎవరికి వారే చార్జ్ తీసుకున్న ఇరు రాష్ట్రాల డీజీపీలు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రానికి చివరి డీజీపీగా వ్యవహరించిన ప్రసాదరావు సోమవారం రెండు రాష్ట్రాల డీజీపీలకు బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా.. ముందుగానే ఆయన వైదొలగడంతో సాధ్యం కాలేదు. సాధారణం గా డీజీపీగా పని చేస్తూ బదిలీ అయిన, పదవీ విరమణ పొందిన అధికారులు తమ బాధ్యతల్ని ఒక్కరికే అప్పగిస్తారు. కానీ, ఈసారి ప్ర సాదరావు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీజీపీలకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే దీని కి ముందే సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బాధ్యతల స్వీకారం, అప్పగింతలకు సంబంధించిన చార్జ్ డైరీని తన నివాసానికి తెప్పించుకున్న ప్రసాదరావు తాను రిలీవ్ అవుతున్నట్లు సంతకం చేశారు. ఆపై సచివాలయానికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కేటాయించిన సీఐడీ భవనంలో జేవీ రాము డు, ప్రస్తుత డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ ఎవరికి వారే బాధ్యతల్ని స్వీకరించారు. ఎవరికి వారు తమ చాంబర్స్‌లోకి వెళ్లి సహాయకుల ద్వారా చార్జ్ డైరీలో బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకాలు చేశారు. గుంటూరులో డీజీపీ క్యాంప్ కార్యాలయం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ క్యాంపు ఆఫీస్ గుంటూరులో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రా జధాని విజయవాడ-గుంటూరు మధ్య ఉండనుంద ని, నాగార్జున వర్సిటీలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల్లోనే డీజీపీకి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. -
'రెండు రాష్ట్రాలూ కలసి పని చేసుకోవాలి'
-
మాజీ పోలీస్ బాస్‌లతో డీజీపీ ఆత్మీయ సమావేశం
అనుభవాలను పంచుకున్న తాజా, మాజీ అధికారులు హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు మంగళవారం పలువురు మాజీ డీజీపీలతో తన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కలయికలో 13 మంది పోలీసు మాజీ బాస్‌లకు ప్రసాదరావు విందు ఇచ్చారు. దీనికి ఆనందరామ్, ఆర్.ప్రభాకర్‌రావు, తాళ్లూరి సూర్యనారాయణ రావు, ఎంవీ భాస్కరరావు, రాగాల, ఎమ్మెస్ రాజు, విజయరామారావు, హెచ్‌జే దొర, పేర్వారం రాములు, స్వరణ్‌జిత్‌సేన్, అజిత్ కుమార్ మహంతి, కె.అరవిందరావు, దినేష్‌రెడ్డి వంటి మాజీ డీజీపీలు పలువురు హాజరయ్యారు. వీరు డీజీపీ ఆఫీసులోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, చాంబర్లను వీక్షించారు. పాత తరం అధికారులు కొత్త పరిజ్ఞానం పని విధానం తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. ఉల్లాసంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ బాస్‌లు తమ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి చివరి డీజీపీగా ప్రసాదరావు నిర్వహించిన పాత్ర, శాంతి భద్రతలను అదుపు చేయడంలో తీసుకున్న చర్యలను మాజీలు ప్రశంసించారు. ఈ సందర్భంలో పలువురు ఉన్నతాధికారులు కలిసి వారితో తమ గతానుభవాల్ని గుర్తుచేసుకున్నారు. -
డీజీపీ కార్యాలయం నుంచి ‘స్పెషల్ ట్రాకింగ్’
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో బుధవారం పోలింగ్ సందర్భంగా జరిగిన భద్రత చర్యలను డీజీపీ ప్రసాదరావు, ఇతర ఉన్నతాధికారు లు డీజీపీ కార్యాలయం నుంచి హైటె క్ పరిజ్ఞానంతో పర్యవేక్షించారు. ఈ తరహాలో బందోబస్తు, అధికారులు విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాలను నిరంతరం పరిశీలించడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌కు చెందిన క్వాడ్రివియం సంస్థ తయారు చేసిన స్పెషల్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన అత్యాధునిక పరికరాన్ని డీజీపీ కార్యాలయంలోని ఎలక్షన్ సెల్లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ రూపొందించిన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను ఎన్నికల విధుల్లో ఉన్న డీఎస్పీలు, ఆపై స్థాయి అధికారులు సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేశారు. ఆ ఫోన్లకు ఉన్న జీపీఎస్ వ్యవస్థను యాక్టివేట్ చేయడంతో సంబంధిత అధికారి ఫోన్ సర్వర్‌కు అనుసంధానమౌతుంది. దీని ఆధారంగా ఆయన ఎక్కడ విధుల్లో ఉన్నారనేది ఎలక్షన్ సెల్లో ఉన్న డిజిటల్ తెరపై కనిపిస్తుంటుంది. -
'ఎన్నికలకు భారీగా భద్రతా ఏర్పాట్లు'
-
అనుక్షణం అప్రమత్తం
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయండి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రెట్టింపు బందోబస్తు డీజీపీ ప్రసాదరావు ఆదేశం ఉత్తరాంధ్ర జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష సాక్షి, విశాఖపట్నం: ‘ఈ ఎన్నికలు పోలీసుశాఖకు ప్రతిష్టాత్మకం. ఎన్న డూ లేనివిధంగా ఒకేసారి మూడు ఎన్నికలు వచ్చాయి. ఎటువంటి అల్ల ర్లు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోండి. మద్యం, డబ్బు ప్రవాహాన్ని అరికట్టడానికి రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయండి. ఉత్తరాంధ్ర జిల్లాలకు మావోయిస్టుల ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటి నుంచి కూంబింగ్ ముమ్మరంచేసి మావోయిస్టులపై ఆధిపత్యం సాధించండి’ అని పోలీస్ ఉన్నతాధికారులకు డీజీపీ ప్రసాదరావు సూచించారు. వరుసగా మున్సిపల్, జెడ్పీ, అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఆయన ఆదివారం విశాఖలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఎస్పీలు, విశాఖ రేంజ్ డీఐజీ, నగర పోలీస్ కమిషనర్ తదితరులతో సమావేశమయ్యారు. ఉత్తరాంధ్రలో పోలింగ్ సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలపై డీజీపీ జిల్లాల వారీగా సమీక్షించారు. మావోయిస్టుల ప్రభావం మూడు జిల్లాలకు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాలకన్నా మావోయిస్టు ప్రభావిత నియోజక వర్గాల్లో బందోబస్తు రెట్టింపుస్థాయిలో మోహరించాలని సూచించారు. అదే సమయంలో మావోయిస్టుల ప్రభావం తగ్గించడానికి ఏమేం చర్యలు తీసుకుంటున్నారో ఆయా ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికలకు ఎంతో సమయం లేనందున కూంబింగ్ ముమ్మరం చేయాలన్నారు. ప్రత్యేక బలగాలు, సీఆర్పీఎఫ్ బలగాలతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సాయంతో మావోయిస్టులను మట్టుబెట్టాలని ఆదేశించారు. అదే సమయంలో ఏజెన్సీ పరిధిలోని పోలీసుస్టేషన్ల ఆధునికీకరణపై చర్చ జరిగింది. చాలా స్టేషన్లకు ఏజెన్సీల్లో కనీస సమాచార వ్యవస్థ లేకపోవడం బలహీనంగా మారుతున్న నేపథ్యంలో వీటిని సమకూర్చుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్నందున హెలికాప్టర్లద్వారా కూంబింగ్, ఇతర ఎన్నికల పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్పీ దుగ్గల్ వివరించారు. అనంతరం డీజీపీ వీరిని ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాల వారీగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వివరాలపై అధికారులకు పలు సూచనలు అందించారు. -
టెర్రరిస్టులకు, సీమాంధ్ర నేతలకు తేడా లేదు
సీమాంధ్ర నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నేతలపై దేశద్రోహుల కింద కేసులు నమోదు చేయాలని హరీశ్ రావు బుధవారం హైదరాబాద్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెర్రరిస్టులకు, సీమాంధ్ర నేతలకు కొంచం కూడా తేడా లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నేతలపై డీజీపీ బి.ప్రసాదరావు అనుసరిస్తున్న వైఖరిపై కూడా హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణ నేతలపై డీజీపీ సుమోటో కింద కేసులు బనాయిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అయితే సీమాంధ్ర వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన ఈ సందర్భంగా డీజీపీని ప్రశ్నించారు. -
వీఆర్ఏల కలకలం
ఆలంపల్లి, న్యూస్‌లైన్: పెంచిన జీతాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె. మహంతి, డీజీపీ ప్రసాదరావు వాహనాలను అడ్డుకున్నారు. ఆదివారం అనంతగిరి అడవిలో జింకలు వదిలే కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న వారి వాహనాలను సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట అడ్డుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ‘లాఠిన్యం’తో పలువురికి గాయాలు.. చాలీచాలని జీతాలతో తమ బతుకు దుర్భరంగా మారిందని వీఆర్ఏలు వికారాబాద్ పట్టణంలో మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం అనంతగిరికి వచ్చిన సీఎస్ పి.కె మహంతికి వినతిపత్రం ఇవ్వాలని భావించామని, వాహనాలు అడ్డుకోవాలని తమ ఉద్దేశం కాదని వీఆర్ఏలు తెలిపారు. పోలీసుల చేతుల్లో చావుదెబ్బలు తినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు తాము ఉదయం నుంచి పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. మరోమార్గం లేక సీఎస్, డీజీపీ వాహనాలను అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కాగా అంతకు ముందు రోడ్డుపై బైఠాయించిన వీఆర్ఏలకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అంతలోనే సీఎస్, డీజీపీ వాహనాలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ వెంకటస్వామి రంగంలోకి దిగి సిబ్బందితో కలిసి ఆందోళనకారులను చితకబాదారు. అధికారుల తీరుకు నిరసనగా సీఐటీయూ డివిజన్ కార్యద ర్శి మహిపాల్ నినాదాలు చేయడంతో పోలీసులు ఆయనపై తమ ప్రతాపాన్ని చూపించారు. బూటు కాళ్లతో తన్నడంతో మహిపాల్ రోడ్డుపై సొమ్మసిల్లిపడిపోయారు. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిరసనలో పాల్గొన్న పలువురు మహిళలను కూడా పోలీసులు తోసేశారు. నిరసనకారుల్ని పోలీసులు చెదరగొట్టి సీఎస్, డీజీపీ వాహనాలను పంపించి వేశారు. కాగా భద్రత చర్యల్లో పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారని డీజీపీ అసహనం,ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా వాహనాలను అడ్డుకున్న పదిమందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ లచ్చిరాంనాయక్ తెలిపారు. విధులు నిర్వహిస్తున్నారా..? లేక నిద్ర పోతున్నారా..? వీఆర్ఏలు అడ్డుకుంటున్న సమాచారం తనకు ముందే ఎందుకు సమాచారం ఇవ్వలేదని వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన సిబ్బందిపై ఎస్పీ రాజకుమారి మండిపడ్డారు. విధులు నిర్వహిస్తున్నారా..? నిద్రపోతున్నారా.? అని తీవ్రంగా మందలించారు. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు..? సెట్లో సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఓ కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వివరణ ఇవ్వాలంటూ ఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసుల దాడి అమానుషం.. సమస్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించేందుకు వచ్చిన తమపై పోలీసులు లాఠీలతో దాడి చేయడం అమానుషమని జిల్లా వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు జి.నర్సింలు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం ఖండించారు. -
థియేటర్లలో ట్రాఫిక్ షార్ట్‌ఫిల్మ్‌ల ప్రదర్శన
బేగంపేట, న్యూస్‌లైన్: విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని డీజీపీ ప్రసాదరావు అన్నారు. సోమవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో 25వ నేషనల్ రోడ్ సేఫ్టీవీక్ వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ సంస్థ డిజి క్వెస్ట్ ట్రాఫిక్ నిబంధనలపై రూపొందించిన ఆరు షార్ట్‌ఫిల్మ్ సీడీలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ షార్ట్‌ఫిల్మ్‌లను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సిని మా థియేటర్లలో ప్రదర్శిస్తామన్నారు. ప్రతి ఒక్క రూ హోదాలతో సంబంధం లేకుండా కచ్చితమైన క్రమశిక్షణ పాటిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అ వుతుందన్నారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్ర ముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ట్రాఫి క్ షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించడం ఆనందంగా ఉందన్నా రు. నగర కమిషనర్ అనురాగ్‌శర్మ, ట్రాఫిక్ అదన పు కమిషనర్ అమిత్‌గార్గ్, డీజీ క్వెస్ట్ సీఈఓ కె.బసిరెడ్డి, కాకతీయ హోటల్ జనరల్ మేనేజర్ వర్గీస్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర పరిణామాలపై డీజీపీ సమీక్ష
రాయల తెలంగాణ ప్రతిపాదన తెరపైకి రావడం, దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తుది నివేదిక ఇవ్వనుండటంతో రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. డీజీపీ ప్రసాదరావు బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి తాజా పరిణామాలపై చర్చించారు. ఐజీలు, డీఐజీలు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. జిల్లాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
పోలీసు యూనిఫాం ధరించడం అదృష్టం
సాక్షి, హైదరాబాద్: పోలీసు యూనిఫాం ధరించే అదృష్టం కొందరికే వస్తుంద ని, దాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి సేవ చేయాలని కొత్త డీజీపీ బి. ప్రసాదరావు అన్నారు. రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (ఏపీఎస్పీ) మొదటి బె టాలియన్‌లో గురువారం 268 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం పటిష్ట చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది కోసం క్యాంటిన్లు ఏర్పాటు చేయడంతోపాటు, యూనిట్ ఆస్పత్రులలో వైద్య సేవలను మెరుగుపరుస్తామని చెప్పారు. డీజీపీతోపాటు ఏపీఎస్పీ అదనపు డీజీ గౌతమ్‌సావంగ్, ఐజీ స్వాతిలక్రా, డీఐజీలు షేక్ మహ్మద్ ఇక్బాల్, జె. ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
హింసకు పాల్పడితే సహించం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయని, మిగతా జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి ప్రసాదరావు తెలిపారు. హింసకు పాల్పడితే సహించబోమని, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సీమాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 45 కంపెనీల పారా మిలటరీ దళాలకు అదనంగా 34 కంపెనీలను మోహరిస్తున్నట్లు వివరించారు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధుల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ప్రజలు దాడులుచేస్తున్నందున ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భ ద్రతను పెంచామన్నారు. విజయనగరంలో పరిస్థితి చేయిదాటడంతో ఆంధ్రా రీజియన్ ఐజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు స్వయంగా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆందోళనల్లోకి అసాంఘిక శక్తులొచ్చాయనే కోణంలో పరిశీలన జరుపుతున్నామని డీజీపీ తెలిపారు. ఉద్యమం పేరుతో అసాంఘిక శక్తులు దాడులకు పాల్పడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స చేసిన విమర్శపై విలేకరుల అడిగిన ప్రశ్నకు డీజీపీ పై విధంగా స్పందించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఆందోళనల్లో చొరబడే అసాంఘిక శక్తులు లూటీలు వంటి దుశ్చర్యలకూ పాల్పడే అవకాశం లేకపోలేదన్నారు. అలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జగన్ దీక్షకు భద్రత కల్పిస్తున్నాం సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ నిరశనకు భద్రత కల్పిస్తున్నారని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. లోటస్‌పాండ్‌లోని తన ఇంటి వద్దే జగన్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినందున పోలీసుల అనుమతి అవసరం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జగన్ దీక్షను అడ్డుకుంటామని కొందరు ప్రకటించడం, అడ్డుకునేందుకు ప్రయత్నించినందున నగర పోలీసులు తగిన భద్రత కల్పిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఏపీఎస్పీ, పారా మిలటరీ బలగాలను సిద్ధంగా ఉంచామన్నారు. -
ఉద్యమం తీవ్రంగా ఉంది.. చల్లారుస్తాం: డీజీపీ
సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు మిన్నంటుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతితో డీజీపీ బయ్యారపు ప్రసాదరావు శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లోను సమైక్య ఉద్యమం తీవ్రంగా ఉందని, ఆ తీవ్రతను తగ్గించడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన సీఎస్‌కు తెలిపారు. మరోవైపు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో గత రాత్రి నుంచి పరిస్థితులు అదుపు తప్పాయని అక్కడకు ప్రత్యేకాధికారిగా వెళ్లిన విజయనగరం ఎస్పీ కార్తికేయ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 144 సెక్షన్ విధించామని, అందువల్ల ఎవరూ గుంపుగా తిరగొద్దని చెప్పారు. అల్లర్లకు పాల్పడుతున్న అందిరనీ గుర్తిస్తున్నామని, వారిపై కేసులు పెడతామని ఆయన అన్నారు. -
ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు
-
కొత్త డీజీపీగా ప్రసాదరావు దాదాపు ఖరారు
హైదరాబాద్ : కొత్త పోలీస్ బాస్‌గా ఏసీబీ డీజీ ప్రసాదరావు పేరు దాదాపు ఖరారైనట్లే. డీజీపీగా దినేష్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రసాదరావు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. మరోవైపు దినేష్ రెడ్డికి పోలీసు విభాగం ఘనంగా వీడ్కోలు పలికింది. కాగా దినేష్ రెడ్డి ఈరోజు ఉదయం గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
తాత్కాలిక డీజీపీగా ప్రసాదరావు?
-
అనంతుని సేవలో ఏసీబీ డెరైక్టర్
అనంతగిరిగుట్టలోని శ్రీ అనంతపద్మనాభస్వామి వారిని ఆదివారం రాష్ట్ర ఏసీబీ డెరైక్టర్ ప్రసాద్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రసాద్‌రావుకు తీర్థప్రసాదాలను అందించి స్వామివారి మహిమను, ఆలయ చరిత్రను ఆయనకు వివరించి శాలువాతో సన్మానించారు. ప్రసాద్‌రావు వెంట జిల్లా ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ నర్సింలు, సీఐ లచ్చీరాంనాయక్, ఎస్ఐ రమేష్, ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, మేనేజర్ శేఖర్‌గౌడ్ తదితరులున్నారు.