సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు మిన్నంటుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతితో డీజీపీ బయ్యారపు ప్రసాదరావు శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లోను సమైక్య ఉద్యమం తీవ్రంగా ఉందని, ఆ తీవ్రతను తగ్గించడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన సీఎస్కు తెలిపారు.
మరోవైపు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో గత రాత్రి నుంచి పరిస్థితులు అదుపు తప్పాయని అక్కడకు ప్రత్యేకాధికారిగా వెళ్లిన విజయనగరం ఎస్పీ కార్తికేయ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 144 సెక్షన్ విధించామని, అందువల్ల ఎవరూ గుంపుగా తిరగొద్దని చెప్పారు. అల్లర్లకు పాల్పడుతున్న అందిరనీ గుర్తిస్తున్నామని, వారిపై కేసులు పెడతామని ఆయన అన్నారు.
ఉద్యమం తీవ్రంగా ఉంది.. చల్లారుస్తాం: డీజీపీ
Published Sat, Oct 5 2013 3:30 PM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement