
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చారు. ముజఫర్‌నగర్‌లో బుధవారం(ఏప్రిల్ 10) జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం మాఫియా దుస్థితి ఎలా ఉందో చూడొచ్చు.
ఎవరి పేరు చెబితే ఒకప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడేదో వాళ్ల పరిస్థితి మీరే చూస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాఫియా లీడర్ కాన్వాయ్‌కి ఏకంగా సీఎం కాన్వాయ్ దారి ఇచ్చే పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మాఫియా ప్యాంట్లు తడుస్తున్నాయి’అని యోగి అన్నారు.
ఇదీ చదవండి.. రూ.200 కోట్ల హవాలా గుట్టురట్టు