ఝాన్సీ: యూపీలోని ఝాన్సీలోగల మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదం దరిమిలా ఆస్పత్రి పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన కృపాల్ సింగ్ రాజ్‌పుత్ మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ‘అనారోగ్యంతో బాధ పడుతున్న నా మనుమడిని ఆస్పత్రిలో చేర్పించాను. పిల్లాడు ఉంటున్న వార్డులో శుక్రవారం రాత్రి 10 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆ గదిలోనికి వెళ్లాను. ఆ వార్డులోని 18 పడకలపై 50 మందికిపైగా పిల్లలున్నారు. ఒక బెడ్‌పై ఆరుగురు శిశువులు ఉన్నారు. చుట్టూ మంటలు వ్యాపించాయి. అతికష్టం మీద 25 మంది పిల్లలను బయటకు తీసుకు వచ్చాను. నేను చూస్తుండానే 10 మంది శిశువులు కాలి బూడిదయ్యారు. నా కుమారుడు క్షేమంగానే ఉన్నాడు’ అని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న 25 మంది చిన్నారులను ప్రాణాలతో కాపాడిన కృపాల్ సింగ్‌ను ఆసుపత్రి సిబ్బంది, ఇతరులు అభినందనలతో ముంచెత్తారు.
కాగా వైద్య కళాశాలలో కేవలం 18 పడకలపై 54 మంది చిన్నారులకు చికిత్స అందించడాన్ని చూస్తుంటే ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని తెలుస్తోంది. అలాగే అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ఇంతటి దారుణ పరిస్థితి తలెత్తింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదానికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బ్రిజేష్ పాఠక్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Medical College Fire: చిన్నారుల మృతి హృదయవిదారకం: ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment