లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)లో ఆదివారం(జనవరి19) అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి సెక్టార్ 19లో భక్తులు, సాధువుల కోసం వేసిన గుడారాల్లో రెండు వంట గ్యాస్ సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలి మంటలు చెలరేగాయి. దీంతో గుడారాల్లోని భక్తులు భయంతో పరుగులు తీశారు. మొత్తం ముప్పై దాకా గుడారాలు మంటల్లో దగ్ధమయ్యాయి.
అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మంటల ధాటికి గుడారాల్లో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. కుంభమేళాకు ఆదివారం ఒక్కరోజు 17 లక్షల మంది భక్తులు విచ్చేశారు. ఇప్పటివరకు 7 కోట్లకుపైగా భక్తులు కుంభమేళాకు విచ్చేసి పవిత్ర స్నానమాచరించారు.
#WATCH | Prayagraj, Uttar Pradesh | A fire breaks out at the #MahaKumbhMela2025. Fire tenders are present at the spot.
More details awaited. pic.twitter.com/dtCCLeVIlN— ANI (@ANI) January 19, 2025
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. ఆదివారం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం సంగమంలో స్నానం చేసి, మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment