రాయల తెలంగాణ ప్రతిపాదన తెరపైకి రావడం, దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తుది నివేదిక ఇవ్వనుండటంతో రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
డీజీపీ ప్రసాదరావు బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి తాజా పరిణామాలపై చర్చించారు. ఐజీలు, డీఐజీలు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. జిల్లాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర పరిణామాలపై డీజీపీ సమీక్ష
Published Wed, Dec 4 2013 8:41 PM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement
Advertisement