
టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు
సీమాంధ్ర నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నేతలపై దేశద్రోహుల కింద కేసులు నమోదు చేయాలని హరీశ్ రావు బుధవారం హైదరాబాద్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెర్రరిస్టులకు, సీమాంధ్ర నేతలకు కొంచం కూడా తేడా లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ నేతలపై డీజీపీ బి.ప్రసాదరావు అనుసరిస్తున్న వైఖరిపై కూడా హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణ నేతలపై డీజీపీ సుమోటో కింద కేసులు బనాయిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అయితే సీమాంధ్ర వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన ఈ సందర్భంగా డీజీపీని ప్రశ్నించారు.