డీజీపీ కార్యాలయం నుంచి ‘స్పెషల్ ట్రాకింగ్’ | special tracking from DGP office: prasada rao | Sakshi
Sakshi News home page

డీజీపీ కార్యాలయం నుంచి ‘స్పెషల్ ట్రాకింగ్’

Published Thu, May 8 2014 4:53 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

డీజీపీ కార్యాలయం నుంచి ‘స్పెషల్ ట్రాకింగ్’ - Sakshi

డీజీపీ కార్యాలయం నుంచి ‘స్పెషల్ ట్రాకింగ్’

సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో బుధవారం పోలింగ్ సందర్భంగా జరిగిన భద్రత చర్యలను డీజీపీ  ప్రసాదరావు, ఇతర ఉన్నతాధికారు లు డీజీపీ కార్యాలయం నుంచి హైటె క్ పరిజ్ఞానంతో పర్యవేక్షించారు. ఈ తరహాలో బందోబస్తు, అధికారులు విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాలను నిరంతరం పరిశీలించడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌కు చెందిన క్వాడ్రివియం సంస్థ తయారు చేసిన స్పెషల్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన అత్యాధునిక పరికరాన్ని డీజీపీ కార్యాలయంలోని ఎలక్షన్ సెల్‌లో ఏర్పాటు చేశారు.
 
 ఈ సంస్థ రూపొందించిన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను ఎన్నికల విధుల్లో ఉన్న డీఎస్పీలు, ఆపై స్థాయి అధికారులు సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేశారు. ఆ ఫోన్లకు ఉన్న జీపీఎస్ వ్యవస్థను యాక్టివేట్ చేయడంతో సంబంధిత అధికారి ఫోన్ సర్వర్‌కు అనుసంధానమౌతుంది. దీని ఆధారంగా ఆయన ఎక్కడ విధుల్లో ఉన్నారనేది ఎలక్షన్ సెల్‌లో ఉన్న డిజిటల్ తెరపై కనిపిస్తుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement