నాలుగు గంటల్లో 41 శాతం.....
హైదరాబాద్ : సీమాంధ్రలో ఇప్పటి వరకూ నమోదు అయిన పోలింగ్ శాతంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లాలో నాలుగు గంటల్లో 41 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ మాట్లాడుతూ చెదురు మదురు ఘటనలు మినహా సీమాంధ్రలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్లలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో పోలీసులు గాలిలో కాల్పులు జరిగాయన్నారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని భన్వర్ లాల్ తెలిపారు. ఉదయం 11 గంటల వరకూ సీమాంధ్రలో 13 జిల్లల్లో 33 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. పోలింగ్ చురుకుగా కొనసాగుతోందని, ఓటర్లు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉన్నారన్నారు. 85 నుంచి 90 శాతం వరకూ పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని భన్వర్ లాల్ పేర్కొన్నారు.
వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ ఇలా ఉంది...
శ్రీకాకుళం........... ..33
విజయనగరం ..........34
విశాఖపట్నం......... ..28
తూర్పు గోదావరి జిల్లా....28
పశ్చిమ గోదావరి జిల్లా.... 35
కృష్ణాజిల్లా.................30
గుంటూరు................ 35
ప్రకాశం....................34
నెల్లూరు ..................33
వైఎస్ఆర్ జిల్లా.............32
కర్నూలు..................41
అనంతపురం ..............32
చిత్తూరు...................33