తొమ్మిది గంటల వరకు 15శాతం పోలింగ్ | 15 percent votes polled till 9 am, says bhanwar lal | Sakshi
Sakshi News home page

తొమ్మిది గంటల వరకు 15శాతం పోలింగ్

Published Wed, May 7 2014 9:48 AM | Last Updated on Mon, Sep 17 2018 5:59 PM

తొమ్మిది గంటల వరకు 15శాతం పోలింగ్ - Sakshi

తొమ్మిది గంటల వరకు 15శాతం పోలింగ్

సీమాంధ్ర ప్రాంతంలో ఓటర్లు పోటెత్తుతున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, తొలి రెండు గంటల్లోనే 15 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు (మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు మినహా) పోలింగ్ జరగనున్నందున.. ఈసారి పోలింగ్ శాతం పెరగొచ్చని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉదయం 9 గంటల వరకు వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ ఇలా ఉంది... శ్రీకాకుళం - 14, విజయనగరం - 19, విశాఖ -11, తూర్పుగోదావరి- 10.5, పశ్చిమ గోదావరి- 17, కృష్ణా - 13, గుంటూరు- 12, ప్రకాశం - 14, నెల్లూరు - 11, కడప -15, కర్నూలు -15, అనంతపురం - 16, చిత్తూరు- 21

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement