అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్ డాక్టర్ ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా దినేష్ రెడ్డి పదవీ కాలం ఈ రోజుతో ముగిసింది. ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రసాదరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొత్త డీజీపీగా ప్రసాదరావు పేరు దాదాపుగా ఖరారైందని భావిస్తున్న సమయంలో ప్రస్తుతానికి ఆయనకు అదనపు బాద్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Published Mon, Sep 30 2013 5:13 PM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement