
పోలీసు యూనిఫాం ధరించడం అదృష్టం
సాక్షి, హైదరాబాద్: పోలీసు యూనిఫాం ధరించే అదృష్టం కొందరికే వస్తుంద ని, దాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి సేవ చేయాలని కొత్త డీజీపీ బి. ప్రసాదరావు అన్నారు. రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (ఏపీఎస్పీ) మొదటి బె టాలియన్‌లో గురువారం 268 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం పటిష్ట చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది కోసం క్యాంటిన్‌లు ఏర్పాటు చేయడంతోపాటు, యూనిట్ ఆస్పత్రులలో వైద్య సేవలను మెరుగుపరుస్తామని చెప్పారు. డీజీపీతోపాటు ఏపీఎస్పీ అదనపు డీజీ గౌతమ్‌సావంగ్, ఐజీ స్వాతిలక్రా, డీఐజీలు షేక్ మహ్మద్ ఇక్బాల్, జె. ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.