DGP Prasadarao
-
పోలీసులకు పెను సవాలే ....
విశాఖ: రాష్ట్రంలో ఒకేసారి అన్ని ఎన్నికలు రావటం పోలీసులకు పెను సవాలేనని డీజీపీ ప్రసాదరావు అన్నారు. ఆయన బుధవారం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉండటంతో స్పెషల్ జోనల్ కమిటీ చురుగ్గా పని చేస్తోందని అన్నారు. కమెండో బలగాలను మరింతగా పెంచనున్నట్లు డీజీపీ తెలిపారు. హిట్ లిస్ట్‌లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు భద్రత పెంచుతామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అవసరం అనుకుంటే హెలికాఫ్టర్ కూడా ఉపయోగిస్తామన్నారు. -
అదనపు బలగాల కోసం కేంద్రాన్ని కోరాం: డీజీపీ
కరీంనగర్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తామని డీజీపీ ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో నిఘాను పటిష్టం చేశామని చెప్పారు. ఆదివారం కరీంనగర్ జిల్లాకు వచ్చిన ప్రసాదరావు విలేకరులతో మాట్లాడారు. అదనపు బలగాలను పంపాలని కేంద్రాన్ని కోరినట్టు డీజీపీ తెలిపారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాల సందర్భంగా, ఉద్యమకారులపై నమోదైన కేసుల్ని ఎత్తివేసే విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని డీజీపీ చెప్పారు. -
జీవోఎంకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు: డీజీపీ
-
జీవోఎంకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు: డీజీపీ
హైదరాబాద్ : రాష్ట్ర పోలీసుల తరపున జీవోఎంకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. హైదరాబాద్‌లోని జూబ్లీహాల్లో శాంతి భద్రతలపై డీజీపీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, అడిషనల్ డీజీ. ఐజీతో పాటు పోలీసు ఉన్నత అధికారులు హాజరు అయ్యారు. శాంతిభద్రతలపై ఇందులో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. సమీక్ష సమావేశం అనంతరం డీజీపీ మాట్లాడుతూ జీవోఎంకు తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాగా రాష్ట్ర విభజన వార్తల నేపథ్యంలో ముందస్తు చర్యలపై కూడా ఈ సమీక్షా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. -
పోలీసు యూనిఫాం ధరించడం అదృష్టం
సాక్షి, హైదరాబాద్: పోలీసు యూనిఫాం ధరించే అదృష్టం కొందరికే వస్తుంద ని, దాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి సేవ చేయాలని కొత్త డీజీపీ బి. ప్రసాదరావు అన్నారు. రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (ఏపీఎస్పీ) మొదటి బె టాలియన్‌లో గురువారం 268 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం పటిష్ట చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది కోసం క్యాంటిన్లు ఏర్పాటు చేయడంతోపాటు, యూనిట్ ఆస్పత్రులలో వైద్య సేవలను మెరుగుపరుస్తామని చెప్పారు. డీజీపీతోపాటు ఏపీఎస్పీ అదనపు డీజీ గౌతమ్‌సావంగ్, ఐజీ స్వాతిలక్రా, డీఐజీలు షేక్ మహ్మద్ ఇక్బాల్, జె. ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్లో దాక్కున్నది ఎవరో ఇంకా తేలలేదు: డీజీపీ
హైదరాబాద్ : చిత్తూరు జిల్లా పుత్తూరు ఘటనపై డీజీపీ ప్రసాదరావు స్పందించారు. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఆక్టోపస్ బృందాన్ని పుత్తూరుకు పంపించినట్లు ప్రసాదరావు పేర్కొన్నారు. చిత్తూరు ఎస్పీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఆ ఇంట్లో దాక్కున్నది ఎవరో ఇంకా తేలలేదని డీజీపీ చెప్పారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తమిళనాడు పోలీసులు ఈరోజు తెల్లవారుజామున పుత్తూరు మేదర వీధిలోని ఓ ఇంటిని చుట్టుముట్టి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.