విశాఖ: రాష్ట్రంలో ఒకేసారి అన్ని ఎన్నికలు రావటం పోలీసులకు పెను సవాలేనని డీజీపీ ప్రసాదరావు అన్నారు. ఆయన బుధవారం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉండటంతో స్పెషల్ జోనల్ కమిటీ చురుగ్గా పని చేస్తోందని అన్నారు. కమెండో బలగాలను మరింతగా పెంచనున్నట్లు డీజీపీ తెలిపారు. హిట్ లిస్ట్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు భద్రత పెంచుతామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అవసరం అనుకుంటే హెలికాఫ్టర్ కూడా ఉపయోగిస్తామన్నారు.
పోలీసులకు పెను సవాలే ....
Published Wed, Mar 12 2014 11:27 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement