కరీంనగర్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తామని డీజీపీ ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో నిఘాను పటిష్టం చేశామని చెప్పారు. ఆదివారం కరీంనగర్ జిల్లాకు వచ్చిన ప్రసాదరావు విలేకరులతో మాట్లాడారు.
అదనపు బలగాలను పంపాలని కేంద్రాన్ని కోరినట్టు డీజీపీ తెలిపారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాల సందర్భంగా, ఉద్యమకారులపై నమోదైన కేసుల్ని ఎత్తివేసే విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని డీజీపీ చెప్పారు.