‘కాంతార’ వేషంలో అలరించిన తహసీల్దార్‌.. ప్రశంసించిన జిల్లా కలెక్టర్‌ | Vizianagaram MRO Prasada Rao Mesmerizing As Kantara Monologue | Sakshi
Sakshi News home page

‘కాంతార’ వేషంలో అలరించిన తహసీల్దార్‌.. ప్రశంసించిన జిల్లా కలెక్టర్‌

Published Mon, Nov 14 2022 12:27 PM | Last Updated on Mon, Nov 14 2022 6:16 PM

Vizianagaram MRO Prasada Rao Mesmerizing As Kantara Monologue - Sakshi

విజయనగరం (కొత్తవలస): ఆయనో తహసీల్దార్‌...  కళలంటే ఆయనకు ఎనలేని అభిమానం. అవకాశం దొరికితే తనలో ఉన్న కళను ప్రదర్శించిన పదుగురిని ఆకర్షించి అభినందనలు అందుకుంటారు. ఆయనే కొత్తవలస తహసీల్దార్‌ డి.ప్రసాదరావు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల విడుదలైన సూపర్‌ డూపర్‌ హిట్‌ తమిళ డబ్బింగ్‌ చిత్రం కాంతారలో ఒక సీనుకు సంబంధించి తహసీల్దార్‌ ప్రసాదరావు ఏకపాత్ర అభినయం చేసి ప్రశంసలు అందుకున్నారు.

గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఆరో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ రెవెన్యూ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ మీట్‌లో ఆయన విజయనగరం జిల్లా తరఫున పాల్గొని అలరించారు. కల్చరల్‌ కార్యక్రమంలో భాగంగా కాంతార సినిమాలో హీరో పాత్రను ఏకపాత్ర అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి రెవెన్యూ సిబ్బంది పోటీ పడిన ఈ కార్యక్రమంలో కాంతార అభినయం ప్రశంసలు అందుకొంది. కాంతార హీరోకు సమాంతరంగా ప్రసాదరావు మేకప్‌ అయి అలరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు ప్రశంసల జల్లు కురిపించి సెల్ఫీ దిగారు. ప్రసాదరావుకు ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఈయనను రెవెన్యూ సిబ్బంది అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement