first prize
-
Cannes 2024: కన్నడ జానపదానికి కాన్స్ బహుమతి
దక్షిణ భారత జానపద కథ కాన్స్ మొదటి బహుమతి గెలుచుకుంది. కోడి కూయకూడదని ఒక అవ్వ పుంజును దొంగిలిస్తే ఆ ఊళ్లో తెల్లారదు. తర్వాత ఏమవుతుందనేది 15 నిమిషాల షార్ట్ఫిల్మ్గా తీశాడు పూణె ఇన్స్టిట్యూట్ చిదానంద నాయక్. ప్రపంచవ్యాప్తంగా 2263 ఎంట్రీలు వస్తే చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్’కు మొదటి బహుమతి వచ్చింది. ఈ ఘనత సాధించిన చిదానంద పరిచయం.మారుమూల చిన్న పల్లెటూరు. ప్రతి ఉదయం కోడి కూయగానే తెల్లారుతుంది. ఆ రోజు కోడి కూయలేదు. తెల్లారలేదు. చీకటి. ఎక్కడ చూసినా చీకటి. సూర్యుడు ఎందుకు రావడం లేదు? కోడి కూయడం లేదు. కోడెందుకు కూయడం లేదు? ఊళ్లోని అవ్వ దానిని దొంగిలించి దాచేసింది. దేవుడా... పదండి కోడిని వెతకండి. ఊరంతా బయలుదేరింది. లాంతర్లు పట్టుకుని తలోదిక్కు. అంతేనా? దీనికంతటికీ కారణమైన అవ్వ కుటుంబాన్ని వెలేసింది. కోడి దొరక్క΄ోయినా అవ్వ కనపడక΄ోయినా ఆ ఊరిలో సూర్యుడు వచ్చేలా లేడు. తర్వాత ఏమైంది?చిదానంద నాయక్ తీసిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్వన్స్ టు నో’ (΄÷ద్దు తిరుగుడు పూలకే మొదట తెలుస్తుంది) షార్ట్‌ఫిల్మ్ చూడాలి. 15 నిమిషాల ఈ షార్ట్‌ఫిల్మ్‌కు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక బహుమతి దక్కింది.ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల కోసం...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో చదివే విద్యార్థులను ్ర΄ోత్సహించేందుకు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగం ఉంటుంది. దీనికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు గంట నిడివి లోపు ఉన్న షార్ట్‌ఫిల్మ్స్‌ను ఎంట్రీగా పంపవచ్చు. జ్యూరీ వీటిని పరిశీలించి ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు ఇస్తుంది. ఈసారి మొత్తం 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2263 ఎంట్రీలు వస్తే మొదటి ప్రైజ్ చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్’కు దక్కింది. దాదాపు పదమూడున్నర లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. ఇది సామాన్యవిషయం కాదు. మన దక్షిణాది జానపదానికి దక్కిన గౌరవం కింద లెక్క.దర్శకుడైన డాక్టర్చిదానంద నాయక్ది కర్ణాటక. చిన్నప్పటి నుంచి అకిరా కురసావా సినిమాలు చూస్తూ పెరిగాడు. సినిమా దర్శకుడు కావాలని ఉన్నా మెడిసిన్ చదవాల్సి వచ్చింది. ‘ఒక డాక్టర్‌గా అతి దగ్గరి నుంచి జననాన్ని, మరణాన్ని చూడటం నాకు మానవ జీవనసారాన్ని తెలిపింది. ఒక వైద్యుడిగా జీవించడమంటే క్షణంలో ఆనందం క్షణంలో దుఃఖాన్ని చూడటమే. మనుషుల మకిలి లేని నిజాయితీని ఆ సమయంలోనే చూస్తాం’ అంటాడు చిదానంద. డాక్టరయ్యాక కూడా మనసు సినిమా రంగంలోనే ఉన్నట్టు అర్థమయ్యి పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు.నాలుగు రోజుల్లో షూట్:‘సన్‌ఫ్లవర్స్’ షార్ట్‌ఫిల్మ్‌ను తన సంవత్సరాంత అభ్యాసంగా తీశాడు చిదానంద. ‘మా ఇన్స్టిట్యూట్కు 50 కిలోమీటర్ల దూరం లోపల షార్ట్‌ఫిల్మ్ తీయాలని నియమం. ఆ దూరంలోనే ఒక లోపలి పల్లెలో షూట్ చేశాం. నాలుగు రోజుల్లోనే తీయమని చె΄్పారు. కథంతా రాత్రే కాబట్టి నాలుగు రాత్రులు ఒళ్లు హూనం చేసుకుని పని చేశాం’ అని తెలి΄ాడు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులే– సూరజ్ (సినిమాటోగ్రఫీ), మనోజ్ (ఎడిటింగ్) సాంకేతిక శాఖలు నిర్వర్తించారు.నీ కోడి కూయక΄ోతే...‘నీ కోడి కూయక΄ోతే తెల్లారదా?’ అనేది లోకోక్తి. అంటే ఎదుటి వారంటే లెక్కలేక΄ోవడం, ఏదైనా లెక్క చేయకుండా ఉండటం ఈ మాటలో ఉంది. కాని ఈ జానపద కథ ప్రతి వ్యక్తి, ప్రతి అనుభవం, ప్రతి మేల్కొలుపు కూడా ముఖ్యమే అని చెబుతుంది. దేనినీ మర్చి΄ోకూడదని, నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తుంది. ‘మా కర్నాటకలో ప్రతి చిన్నపిల్లవాడికి ఈ కథ తెలుసు. దానిని షార్ట్ఫిల్మ్గా తీయడం, ఈ ప్రతిష్టాత్మక బహుమతి రావడం సంతోషంగా ఉంది’ అంటున్నాడు చిదానంద. -
అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం; ఏపీకి ఫస్ట్ ప్రైజ్
సాక్షి, కోణార్క్: అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం –2022లో ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది. ఒడిశాలోని కోణార్క్ చంద్రభాగా బీచ్‌లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు జరిగిన పోటీల్లో ఏపీ తరపున ప్రాతినిథ్యం వహించిన ఆకునూరు బాలాజీ వరప్రసాద్ ప్రథమ స్థానం దక్కించుకున్నారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ చేతుల మీదుగా ఆయన.. పతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఐదు రోజుల పాటు జరిగిన పోటీల్లో వైవిధ్యమైన ఇసుక శిల్పాలతో బాలాజీ వరప్రసాద్ అందరినీ ఆకట్టుకున్నారు. ఒడిశా టూరిజం- కల్చర్, హాకీ వరల్డ్‌కప్ - 2023, భారతీయ సంస్కృతి- పండుగలు, ప్రపంచ శాంతి ఇతివృత్తాలతో సైకత శిల్పాలను తయారు చేశారు. పోటీదారులందరి కంటే మిన్నగా అద్భుత శిల్పాలను తయారు చేసి మొదటి బహుమతి సాధించారు. కాగా, 2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లోనూ ప్రథమ బహుమతి సాధించడం విశేషం. సంతోషంగా ఉంది: బాలాజీ వరప్రసాద్ అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవంలో విజేతగా నిలవడం పట్ల బాలాజీ వరప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రం తరపున భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆయన కోరుకుంటున్నారు. (క్లిక్ చేయండి: ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..) -
‘కాంతార’ వేషంలో అలరించిన తహసీల్దార్.. ప్రశంసించిన జిల్లా కలెక్టర్
విజయనగరం (కొత్తవలస): ఆయనో తహసీల్దార్... కళలంటే ఆయనకు ఎనలేని అభిమానం. అవకాశం దొరికితే తనలో ఉన్న కళను ప్రదర్శించిన పదుగురిని ఆకర్షించి అభినందనలు అందుకుంటారు. ఆయనే కొత్తవలస తహసీల్దార్ డి.ప్రసాదరావు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల విడుదలైన సూపర్ డూపర్ హిట్ తమిళ డబ్బింగ్ చిత్రం కాంతారలో ఒక సీనుకు సంబంధించి తహసీల్దార్ ప్రసాదరావు ఏకపాత్ర అభినయం చేసి ప్రశంసలు అందుకున్నారు. గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఆరో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్లో ఆయన విజయనగరం జిల్లా తరఫున పాల్గొని అలరించారు. కల్చరల్ కార్యక్రమంలో భాగంగా కాంతార సినిమాలో హీరో పాత్రను ఏకపాత్ర అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి రెవెన్యూ సిబ్బంది పోటీ పడిన ఈ కార్యక్రమంలో కాంతార అభినయం ప్రశంసలు అందుకొంది. కాంతార హీరోకు సమాంతరంగా ప్రసాదరావు మేకప్ అయి అలరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రశంసల జల్లు కురిపించి సెల్ఫీ దిగారు. ప్రసాదరావుకు ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఈయనను రెవెన్యూ సిబ్బంది అభినందించారు. -
వరిలో కలుపు తీసే పరికరం
వరి సాగు చేస్తూ కలుపుతీతకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ఇంటర్ విద్యార్థి సులభంగా కలుపుతీసే పరికరాన్ని అతి తక్కువ ఖర్చుతో రూపొందించి ఇంజనీర్లను సైతం అబ్బురపరుస్తోంది. కోల్‌కతాలోని విజ్ఞానభారతి సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో వ్యవసాయం విభాగంలో ఈ పరికరానికి ప్రధమ బహుమతి లభించింది. ప్రశంసాపత్రం, జ్ఞాపికతోపాటు రూ. 11 వేల నగదు బహుమతిని అందుకున్న అశోక్ రాష్ట్రపతి భవన్లో జరిగే ఆవిష్కరణల ఉత్సవానికి ఎంపికైన నలుగురిలో ఒక్కరుగా నిలవడం విశేషం. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే. తారకరామారావు తదితరుల ప్రశంసలను సైతం అశోక్ అందుకున్నాడు. సృజనాత్మక పరికరం ఆవిష్కరణతో పిన్న వయసులోనే తన ప్రత్యేకతను చాటుకున్న ఆ విద్యార్థి పేరు గొర్రె అశోక్. ఊరు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని అంజలిపురం. మూడెకరాల రైతు గొర్రె నాగరాజు, సావిత్రి దంపతుల కుమారుడైన అశోక్ దేవరకొం డ పట్టణంలో ఒకేషనల్ జూనియర్ కాలేజీలో వ్యవసాయం కోర్సు రెండో సంవత్సరం చదువుతున్నాడు. నాగరాజు తనకున్న మూడెకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నారు. వరి మాగాణుల్లో కలుపు తీసే వారికి నడుము నొప్పి సమస్యగా మారింది. నడుము వంచాల్సిన పని లేకుండా నిలబడే ముదురు కలుపును సమర్థవంతంగా తీయటం ఎలా? అని అశోక్ ఆలోచించాడు. దీనికి ఏదైనా పరికరం రూపొందించి తమ తల్లిదండ్రులతోపాటు ఇతర రైతులు, వ్యవసాయ కార్మికులు సులువుగా పనులు చేసుకునేందుకు తోడ్పడేలా ఏదైనా పరికరం తయారు చేయాలనుకున్నాడు. ‘నేను తప్ప అందరూ ఇంజినీర్లే’ కోల్‌కతాలో జరిగిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో వ్యవసాయం విభాగంలో 120కి పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. అందులో అశోక్ రూపొందించిన కలుపు తీత పరికరానికి ప్రథమ బహుమతి లభించింది. ‘అక్కడికి వచ్చిన వారందరూ బీటెక్ చదివిన వారే. నేను ఒక్కడినే ఇంటర్ విద్యార్థిని. అయినా నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ప్రత్యేక ప్రశంసలు తనకు ఎంతో ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగించాయ’ని అన్నాడు అశోక్. తనతోపాటు సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనవారు కొందరు సెన్సార్లు అమర్చిన యంత్రాలను తయారు చేశారని, 30–40 వేల రూపాయల ఖరీదైన యంత్ర పరికరాలు తయారు చేశారని అంటూ.. మన దేశంలో 65 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులేనని, అంత ఖరీదైన యంత్ర పరికరాలను మన చిన్న రైతులు ఎలా ఉపయోగించగలరని అశోక్ ప్రశ్నిస్తున్నాడు. ఒంటి చేత్తో కలుపు తీయవచ్చు కూలీలు వరి నాట్లు వేసేటప్పుడు సాళ్లు సాఫీగా రావు, గజిబిజిగా వస్తాయి. అలాంటప్పుడు యంత్రాలతో కలుపు నిర్మూలన సాధ్యం కాదు. తాను తయారు చేసిన పరికరంతో సాళ్లు సరిగ్గా పాటించని వరి పొలంలో కూడా నిలబడి, ఒంటి చేత్తోనే సునాయాసంగా తీసేయవచ్చని, ముఖ్యంగా ముదురు కలుపు మొక్కలను సైతం సులువుగా నిర్మూలించవచ్చని అశోక్ తెలిపాడు. రూ. 250ల తోనే ఈ పరికరాన్ని సుమారు నెల రోజుల క్రితం తయారు చేశానన్నాడు. సైకిల్ బ్రేక్, ఐరన్ రాyŠ (చిన్నపాటి సీకు), ఇనుప కట్టర్లను ఉపయోగించి కలుపు తీత పరికరాన్ని రూపొందించాడు. ఇవన్నీ కూడా స్వల్ప ఖరీదైనవే కాకుండా, పాత ఇనుప సామాన్ల దుకాణాల్లో కూడా దొరుకుతాయన్నాడు. ఒక బ్లేడ్ కిందకు, మరో బ్లేడ్ పైకి ఉండేలా ఏర్పాటు చేయడం వల్ల.. ఈ బ్లేడ్ల మధ్యలో కలుపు మొక్కను ఉంచినప్పుడు కలుపు మొక్క తెగిపోకుండా వేర్లతో సహా పీకడానికి అవకాశం ఉంటుందన్నాడు. సాధారణంగా ముదురు కలుపు మొక్కలను చేతులతో పట్టుకొని పీకినప్పుడు వ్యవసాయ కూలీల చేతులు బొబ్బలు పొక్కుతుంటాయని, తాను రూపొందించిన పరికరంతో ఆ సమస్య ఉండబోదన్నారు. ఇది మూడో ఆవిష్కరణ అశోక్ ఇప్పటికి మూడు ఆవిష్కరణలు వెలువరించాడు. చెవిటి వారికి ఉపయోగపడే అలారాన్ని తయారు చేశాడు. అదేమాదిరిగా, చిన్న రైతులకు నాలుగు రకాలుగా ఉపయోగపడే యంత్ర పరికరాన్ని తయారు చేశాడు. ఇది పత్తి, మిరప పొలాల్లో కలుపు తీయడానికి, విత్తనాలు విత్తుకునే సమయంలో అచ్చు తీయడానికి, ఆరబోసిన ధాన్యాలను కుప్ప చేయడానికి, కళ్లాల్లో గడ్డిని పోగు చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ. 2 వేలు. అయితే, అప్పట్లో తన ఆవిష్కరణలను ఎవరికి చూపించాలో తెలియలేదన్నాడు. మూడో ఆవిష్కరణను వెలువరించడం, ప్రాచుర్యంలోకి తేవడానికి చాలా మంది తోడ్పడ్డారని అన్నాడు. నల్లగొండ జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, సికింద్రాబాద్‌లోని స్వచ్ఛంద సంస్థ పల్లెసృజన సహకారంతోనే తన ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి, ప్రదర్శనలకు తీసుకువెళ్లగలిగానని అశోక్ కృతజ్ఞతలు తెలిపాడు. వరిలో కలుపు తీసే పరికరం(ధర రూ. 250) కావాలని 16 ఆర్డర్లు వచ్చాయన్నాడు. సెలవు రోజుల్లో వీటిని తయారు చేసి వారికి అందిస్తానని అశోక్ (86885 33637 నంబరులో ఉ. 7–9 గం., సా. 5–9 గంటల మధ్య సంప్రదించవచ్చు) వివరించాడు. – కొలను రాము, సాక్షి, చందంపేట, నల్లగొండ జిల్లా -
హైదరాబాద్ బిర్యానీకి మొదటి బహుమతి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ దమ్ బిర్యానీకి మరో గౌరవం దక్కింది. గత రెండు వారాలుగా ఢిల్లీలో జరుగుతున్న ఆది మహో త్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల వంటకాల పోటీల్లో దమ్ బిర్యానీకి మొదటి బహుమతి దక్కింది. దేశవ్యాప్తంగా గిరిజనులను ఏకం చేసేలా వారి సంస్కృతి, ఆహారపు అలవాట్లు, కళలు ప్రతిబింబించేలా కేంద్ర గిరిజన శాఖ ఏటా ఆది మహోత్సవం పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహి స్తోంది. వీటిల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజనులు తమ ప్రాంతంలోని ప్రసిద్ధ వంటకాలతో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రం నుంచి గిరిజన ప్రాంతానికి చెందిన అశోక్‌కుమార్ దమ్ బిర్యానీ, ఇతర ప్రాంతీయ వంటకాలతో స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో దమ్ బిర్యానీ మొదటి బహుమతిని దక్కించుకుంది. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్ అవార్డు అందజేశారు. -
ముగ్గుల పోటీల్లో జిల్లా జడ్జికి ప్రథమ స్థానం
కర్నూలు (లీగల్): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళా న్యాయవాదులకు, న్యాయమూర్తులకు న్యాయవాది సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తికి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గంగాభవానికి ప్రథమ బహుమతులు వచ్చాయి. స్థానిక జిల్లా కోర్టు ఆవరణంలో జరిగిన ఈ పోటీల్లో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండో బహుమతి న్యాయవాదులు గీతామాధురి, హిందుమతి వేసిన ముగ్గులు ఎంపికయ్యాయి. మూడో బహుమతికి పరమేశ్వరి, ప్రేమలతలు వేసిన ముగ్గులు ఎంపికయ్యాయి. న్యాయ నిర్ణేతలుగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శివకుమార్, లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ వ్యవహరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు గాయత్రిదేవి, స్వప్నరాణిలతో పాటు సీనియర్ మహిళా న్యాయవాదులు సాయిలీల, నాగలక్ష్మిదేవి, యూవీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రథమ స్థానం
నల్లగొండ టౌన్ : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు ప్రథమస్థానంలో నిలిచింది. ఆదివారం విజేతలకు బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడారు. క్రీడారంగం అభివృద్ధికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడాబిల్లును ప్రవేశపెట్టనుందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రంగారెడ్డి జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారిణి ఎస్.అపర్ణకు రూ.2 వేల బహుమతి అందజేశారు. జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ క్రీడ అయిన హాకీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ముఖేష్‌కుమార్ లాంటి క్రీడాకారులు తయారు కావాలని ఆకాంక్షించారు. క్రీడలను ప్రోత్సహించడానికి రూ.50 వేలను హాకీ అసోసియేషన్‌కు అందజేస్తున్నట్లు ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్బంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ జట్లకు ఎస్పీ, ఎమ్మెల్సీలు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ముఖేష్ కుమార్, అసోసియేట్ చైర్మన్ డాక్టర్ ఎం.ఏ. హఫీజ్‌ఖాన్, అసోసియేషన్ అధ్యక్షుడు కొండకింది చినవెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం, డీఎస్డీఓ మక్బూల్ అహ్మ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఫోటో జర్నలిస్ట్‌కు ప్రధమ బహుమతి
-
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ కు ఉత్తమ అవార్డు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : సాక్షి దినపత్రిక మహబూబ్‌నగర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ వడ్ల భాస్కరాచారికి బెస్ట్ న్యూస్ పిక్చర్ విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. తెలంగాణ భాష సాంస్కృతికశాఖ, తెలంగాణ ఫొటో జర్నలి స్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19న ప్రపంచఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఫొటో జర్నలిస్టుల ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించారు. దీనిలో పాలమూరు జిల్లాలో కరువు పరిస్థితులకు అద్దం పట్టేలా భాస్కరాచారి తీసిన చిత్రానికి (నీరు లేక ఎండిపోయిన చెరువులో నడిచివస్తున్న రైతు) రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి లభించింది. ఈ నెల 26న జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అవార్డు అందజేయనున్నారు. -
భగవద్గీతపై ముస్లిం బాలికకు ఫస్ట్ ప్రైజ్
ముంబయి: భగవద్గీతపై నిర్వహించిన పరీక్ష పోటీలో ముస్లిం విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలిచింది. 3000 మంది పాల్గొన్న ఈ పోటీలో మిగితావారందరిని వెనుకకు నెట్టి ఆ బాలిక తొలిస్థానంలో నిల్చుని బహుమతి అందుకుంది. గత జనవరిలో ఇస్కాన్(ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్) సంస్థ 'గీతా చాంపియన్స్ లీగ్' అనే అంశంపై పరీక్ష పోటీ నిర్వహించింది. ఇందులో పలు పాఠశాలలనుంచి విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు. బహులైఛ్చిక ప్రశ్నల రూపంలో ఈ పరీక్ష నిర్వహించగా ఈ పరీక్షలో ఆరోతరగతి చదువుతున్న పన్నెండేళ్ల మర్యామ్ సిద్ధిఖీ తొలి బహుమతిని అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా మర్యామ్ మీడియాతో మాట్లాడుతూ తాను ఖాళీగా ఉన్న సమయాల్లో మతాలకు సంబంధించిన పుస్తక పఠనం చదువుతానని, ఎప్పుడైతే ఈ కాంపిటేషన్ గురించి విన్నానో అప్పుడే భగవద్గీత గురించి తెలుసుకునే అవకాశం వస్తుందని ఆలోచించి చదవడం నేర్చుకున్నానని తెలిపింది. ఆ ప్రిపరేషనే తనకు మొదటి బహుమతి రావడానికి కారణమైందని వివరించింది. ముంబైలోని మీరా రోడ్డులోగల కాస్మోపాలిటన్ రోడ్డులో ఈ బాలిక చదువుతుంది. పరీక్షకు నెల రోజుల ముందుగా ఇస్కాన్ సంస్థ వాళ్లే సంబంధిత మెటీరియల్ ఇచ్చారు. -
మహారాష్ట్ర శకటానికి మొదటి బహుమతి
సాక్షి, ముంబై: గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించిన మహారాష్ట్ర శకటానికి మొదటి స్థానం దక్కింది. వివిధ విభాగాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, పలు రాష్ట్రాలకు చెందిన మొత్తం 25 శకటాలను జనవరి 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌పై ప్రదర్శించారు. వీటిలో ‘వారీ నుంచి పండరిపూర్’ అన్న అంశాన్ని ప్రదర్శించిన మహారాష్ట్ర శకటానికి మొదటి బహుమతి లభించింది. పండరిపూర్‌లో జరిగే ఆశాడి ఏకాదశి ఉత్సవాలకు సంబంధించిన సందేశాత్మక అలంకరణ ఎంతో ఆకట్టుకుంది. యేటా పండరిపూర్‌లో ఘనంగా నిర్వహించే ఆశాడి ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు కాలినడకన 15 రోజుల ముందే బయలుదేరుతారు. ఆ రోజు చంద్రబాగ నదిలో స్నానాలుచేసి విఠల్, రుక్మాయిని దర్చించుకుంటారు. ఇలా భక్తులు కాలినడకన ఎలా చేరుకుంటారనే దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు ఆ శకటంలో చూపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంప్రదాయాలు, సంస్కృతులతోపాటు అశ్వాలతో నిర్వహించే ‘రింగన్ ఉత్సవ్’ ను కూడా శకటంపై ప్రదర్శించారు. ఈ సందేశాత్మక చిత్ర ప్రదర్శనను ప్రముఖ కళా దర్శకుడు చంద్రశేఖర్ మోరే రూపొందించారు. ఆయన మార్గదర్శనంలో మొత్తం 65 మంది కళాకారులు రేయింబవళ్లు శ్రమించి ఈ శకటాన్ని తీర్చిదిద్దారు. రాజ్పథలో జరిగిన పరేడ్‌లో మహారాష్ట్ర శకటం వెంట 31 మంది కళాకారులు పాల్గొన్నారు. శకటంపై ముందు భాగంలో తలపై కలశాన్ని ఎత్తుకున్న మహిళ, పండర్‌పూర్‌లో విఠల్, రుక్మాయి మందిరం నమూనా, అశ్వాల పరుగులు (రింగన్ ఉత్సవం), సంత్ జ్ఞానేశ్వర్, తుకారాం మహారాజ్‌ల భారీ విగ్రహాలు, శకటానికి ఇరుపక్కల పల్లకీతో బోయిలు, చేతిలో వీణ, మృదంగం పట్టుకున్న భక్తుల బృందం ఇలా పండరిపూర్ వైభవాన్ని ప్రదర్శించిన రాష్ట్ర శకటం న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుంది. -
ఆనందం చూడకుండానే...
చోడవరంటౌన్: జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాడు కాని ఆ బహుమతి తీసుకునే అదృష్టం ఆ బాలునికి లేకపోయింది. పోటీలకు హాజరైన శివకుమార్ దసరాకు రెండు రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ‘ప్రకృతి పచ్చదనం’పై అతడు గీసిన చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చినట్లు ఇప్పుడు పాఠశాలకు సమాచారం వచ్చింది. బహుమతి, ప్రశంసాపత్రం పాఠశాలకు వచ్చాయి. ఆ బహుమతి చూసిన పాఠశాల హెచ్ఎం విశ్వనాథం, ఇతర సిబ్బందికి కళ్లు చెమ్మగిల్లాయి. ఆ బాలుడి తల్లిదండ్రులకు బుధవారం బహుమతి అందచేశారు. ఒక వైపు బహుమతి వచ్చిన ఆనందం, మరో వైపు కుమారుడు లేడనే నిజం ఆ తల్లిదండ్రులను శోక సముద్రంలో ముంచింది. చోడవరం పట్టణానికి చెందిన తామరపల్లి ప్రసాద్ కుమారుడు శివకుమార్ స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి చదువుతూ గుంటూరులో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఆగస్టులో పోటీల్లో పాల్గొన్న శివకుమార్ దసరాకు రెండు రోజుల ముందు కుటుంబ సభ్యులతో కలిసి యాత్రకు వెళుతూ మృతి చెందాడు. -
సాక్షి ఫొటోజర్నలిస్టుకు ప్రథమ బహుమతి
సాక్షి; హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల సంఘం(ఏపీపీజేఏ) నిర్వహించిన రాష్ట్ర స్థాయి ‘న్యూస్ ఫొటో కాంపిటీషన్-2013’ పోటీల్లో సాక్షి ఫొటో జర్నలిస్టు ఎ.సతీష్ ప్రథమ బహుమతి గెలుపొందారు. ‘ది హిందూ’ ఆంగ్ల పత్రిక ఫొటో జర్నలిస్టు కె.రమేష్‌బాబుకు ద్వితీయ, ‘పోస్ట్‌నూన్’కు చెందిన ఎన్.శివకుమార్‌కు తృతీయ బహుమతి లభించింది. ఫలితాల్ని ఫొటో జర్నలిస్టుల సంఘం శుక్రవారం వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 15 మందికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్టు తెలిపింది. పోటీలకు న్యాయనిర్ణేతలుగా ‘ది హిందూ’ రెసిడెంట్ ఎడిటర్ కె.శ్రీనివాసరెడ్డి, ఐజేయూ కార్యదర్శి దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టు ఎ.లక్ష్మణరావు వ్యవహరించారు. మరోవైపు విద్యుత్ కోత, కరువుపై ఏపీపీజేఏ నిర్వహించిన ఫొటో కాంపిటిషన్లో సాక్షి-కర్నూలు ఫొటో జర్నలిస్టు డి.హుసేన్‌కు ప్రథమ బహుమతి వచ్చింది. 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజున హైదరాబాద్‌లోని దేశోద్ధారకభవన్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు ఏపీ ఫొటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కె.రవికాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.నరహరి శుక్రవారం తెలిపారు. ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు ఎ.సతీష్‌కు ప్రథమ బహుమతి వచ్చింది ఈ చిత్రానికే. కేదార్నాథ్ వరద బీభత్సానికి తార్కాణంగా నిలిచిన ఈ చిత్రం గౌరీకుంద్ సీతాపూర్ వద్ద తీసింది. వరదల్లో కొట్టుకొచ్చి రాళ్ల మధ్య చిక్కుకుపోయిన ఈ మృతదేహం ఓ పదేళ్ల బాలుడిది. విద్యుత్ కోత, కరువుపై నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్లో సాక్షి-కర్నూలు ఫొటో జర్నలిస్టు డి.హుసేన్‌కు ప్రథమ బహుమతి తెచ్చిన చిత్రమిది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం ఆమడగుంట్ల బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కొవ్వొత్తులతో చదువుకుంటున్న విద్యార్థుల కష్టాలను కళ్లకు కట్టేలా ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో తీసింది.