
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ దమ్ బిర్యానీకి మరో గౌరవం దక్కింది. గత రెండు వారాలుగా ఢిల్లీలో జరుగుతున్న ఆది మహో త్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల వంటకాల పోటీల్లో దమ్ బిర్యానీకి మొదటి బహుమతి దక్కింది. దేశవ్యాప్తంగా గిరిజనులను ఏకం చేసేలా వారి సంస్కృతి, ఆహారపు అలవాట్లు, కళలు ప్రతిబింబించేలా కేంద్ర గిరిజన శాఖ ఏటా ఆది మహోత్సవం పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహి స్తోంది.
వీటిల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజనులు తమ ప్రాంతంలోని ప్రసిద్ధ వంటకాలతో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రం నుంచి గిరిజన ప్రాంతానికి చెందిన అశోక్‌కుమార్ దమ్ బిర్యానీ, ఇతర ప్రాంతీయ వంటకాలతో స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో దమ్ బిర్యానీ మొదటి బహుమతిని దక్కించుకుంది. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్ అవార్డు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment