
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ కు ఉత్తమ అవార్డు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : సాక్షి దినపత్రిక మహబూబ్‌నగర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ వడ్ల భాస్కరాచారికి బెస్ట్ న్యూస్ పిక్చర్ విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. తెలంగాణ భాష సాంస్కృతికశాఖ, తెలంగాణ ఫొటో జర్నలి స్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19న ప్రపంచఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఫొటో జర్నలిస్టుల ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించారు. దీనిలో పాలమూరు జిల్లాలో కరువు పరిస్థితులకు అద్దం పట్టేలా భాస్కరాచారి తీసిన చిత్రానికి (నీరు లేక ఎండిపోయిన చెరువులో నడిచివస్తున్న రైతు) రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి లభించింది. ఈ నెల 26న జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అవార్డు అందజేయనున్నారు.