సాక్షి, కోణార్క్: అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం –2022లో ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది. ఒడిశాలోని కోణార్క్ చంద్రభాగా బీచ్‌లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు జరిగిన పోటీల్లో ఏపీ తరపున ప్రాతినిథ్యం వహించిన ఆకునూరు బాలాజీ వరప్రసాద్ ప్రథమ స్థానం దక్కించుకున్నారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ చేతుల మీదుగా ఆయన.. పతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు.
ఐదు రోజుల పాటు జరిగిన పోటీల్లో వైవిధ్యమైన ఇసుక శిల్పాలతో బాలాజీ వరప్రసాద్ అందరినీ ఆకట్టుకున్నారు. ఒడిశా టూరిజం- కల్చర్, హాకీ వరల్డ్‌కప్ - 2023, భారతీయ సంస్కృతి- పండుగలు, ప్రపంచ శాంతి ఇతివృత్తాలతో సైకత శిల్పాలను తయారు చేశారు. పోటీదారులందరి కంటే మిన్నగా అద్భుత శిల్పాలను తయారు చేసి మొదటి బహుమతి సాధించారు. కాగా, 2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లోనూ ప్రథమ బహుమతి సాధించడం విశేషం.
సంతోషంగా ఉంది: బాలాజీ వరప్రసాద్
అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవంలో విజేతగా నిలవడం పట్ల బాలాజీ వరప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రం తరపున భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆయన కోరుకుంటున్నారు. (క్లిక్ చేయండి: ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..)
Comments
Please login to add a commentAdd a comment