Sand Artist
-
తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సైకత శిల్పం
-
Video: ఆస్కార్ ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్‌కు వెరైటీ విషెస్
నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు అంతర్జాతీయ శాండ్ యానిమేటర్ మాస కుమార్ సాహు సైకత యూనిమేటర్తో కళాత్మకంగా శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 7 గంటలపాటు నిర్విరామంగా శ్రమించి, 1 నిమిషం 50 సెకన్ల నిడివితో యానిమేటెడ్ వీడియో చిత్రీకరించినట్లు తెలిపారు. ఉత్తమ ఒరిజినల్ పాటగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మన జాతికి గర్వకారణమని అభినందించారు. అదేవిధంగా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఒడిశాలోని పూరి తీరంలో ఆస్కార్ అవార్డు విజేతల సైకత శిల్పాన్ని రూపొందించారు. అకాడమీ అవార్డులు గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్చిత్రంలోని ‘నాటు నాటు’ నృత్య చిత్రాన్ని, ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ లఘచిత్రంలోని గజరాజు శిల్పంతోపాటు మధ్యలో ఆస్కార్ ప్రతిమ ఉన్న ఆరడుగుల ఎత్తైన శిల్పాన్ని ఇసుకతో తయారుచేశారు. రెండు భారతీయ చిత్రాలకు అకాడమీ అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. Congratulations! Proud moment for Indian Cinema!. While ‘#NaatuNaatu’ from #RRR wins the #Oscars for the Best Original Song, #TheElephantWhisperers wins the Oscars for Best Documentary Short Film at the #Oscar2023. My SandArt at Puri beach in Odisha in india. pic.twitter.com/UtrnYX8RNI— Sudarsan Pattnaik (@sudarsansand) March 13, 2023 కాగా, ఈనెల 12న (భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలు)లాజ్ ఏంజిల్‌లో జరిగిన 95వ ఆస్కార్ ప్రదానోత్సవంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు(ఆర్ఆర్ఆర్)’ పాటకు అస్కార్ లభించింది. నాటు నాటు ప్రదర్శనకు అపురూపమైన స్టాండింగ్ ఒవేషన్‌తో పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ గెల్చుకున్న ఇండియన్ తొలి సాంగ్‌గా రికార్డును కొట్టేసింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సినిమా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ను ఆస్కార్ వరించింది. -
అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం; ఏపీకి ఫస్ట్ ప్రైజ్
సాక్షి, కోణార్క్: అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం –2022లో ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది. ఒడిశాలోని కోణార్క్ చంద్రభాగా బీచ్‌లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు జరిగిన పోటీల్లో ఏపీ తరపున ప్రాతినిథ్యం వహించిన ఆకునూరు బాలాజీ వరప్రసాద్ ప్రథమ స్థానం దక్కించుకున్నారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ చేతుల మీదుగా ఆయన.. పతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఐదు రోజుల పాటు జరిగిన పోటీల్లో వైవిధ్యమైన ఇసుక శిల్పాలతో బాలాజీ వరప్రసాద్ అందరినీ ఆకట్టుకున్నారు. ఒడిశా టూరిజం- కల్చర్, హాకీ వరల్డ్‌కప్ - 2023, భారతీయ సంస్కృతి- పండుగలు, ప్రపంచ శాంతి ఇతివృత్తాలతో సైకత శిల్పాలను తయారు చేశారు. పోటీదారులందరి కంటే మిన్నగా అద్భుత శిల్పాలను తయారు చేసి మొదటి బహుమతి సాధించారు. కాగా, 2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లోనూ ప్రథమ బహుమతి సాధించడం విశేషం. సంతోషంగా ఉంది: బాలాజీ వరప్రసాద్ అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవంలో విజేతగా నిలవడం పట్ల బాలాజీ వరప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రం తరపున భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆయన కోరుకుంటున్నారు. (క్లిక్ చేయండి: ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..) -
Akunuru Balaji Varaprasad: శాండ్ ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి: ఇసుక రేణువులను మునివేళ్లతో తాకుతూ.. అద్భుత శిల్పాలు చెక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన ఆకునూరు బాలాజీ వరప్రసాద్. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు ఒడిశాలోని కోణార్క్ చంద్రభాగా బీచ్‌లో జరుగుతున్న ‘అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం –2022’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొంటున్నాడు. చిత్రకళా పోటీల్లో చిన్ననాటి నుంచే అనేక బహుమతులు అందుకున్న బాలాజీ ఆ కళపై ఆసక్తి పెంచుకున్నాడు. డిగ్రీ చదివే రోజుల్లో సముద్ర తీరంలో స్నేహితులతో కలిసి ఇసుకతో ‘మత్స్య సుందరి’ పేరిట సైకత శిల్పాన్ని రూపొందించడం, అది పత్రికల్లో ప్రచురణ కావడంతో శాండ్ ఆర్ట్‌పైకి దృష్టి మరల్చాడు. ఎంతో సాధన చేసి సైకత శిల్పిగా, పోర్ర్‌టైట్ ఆర్టిస్ట్‌గా, స్పీడ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. సైకత కథలకు విశేష స్పందన భారతీయ ఇసుక శిల్పిగా, యానిమేషన్, కథకుడిగా బాలాజీ రూపొందించిన అనేక సైకత శిల్పాలు, సైకతరూపక కథలకు విశేష స్పందన లభిస్తోంది. వాటిని వీడియోలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు వీక్షిస్తున్నారు. ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ అవార్డులు, 8 జాతీయ అవార్డులు, రెండు పురస్కారాలు (ఉగాది, విశిష్ట వ్యక్తి పురస్కారం), రెండు ప్రపంచ రికార్డులు (అద్భుత ప్రపంచం, మేధావి ప్రపంచ రికార్డులు) సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక అంశాలపై 250కి పైగా ఇసుక శిల్పాలను చెక్కి ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. (క్లిక్: పిల్లలను లాలిస్తూ పాడిన పాటే.. బాధను మరిపిస్తోంది!) ఇసుక రేణువులతో చైతన్యం చిన్నప్పటి నుంచి డ్రాయింగ్, పెయింటింగ్, కాన్వాసింగ్‌పై మక్కువతో అనేక ప్రయోగాలు చేశాను. సైకత శిల్పాల సృష్టిలోనూ పట్టు సాధించాను. ఎటువంటి సంగీతం, ఇతర పరికరాలు అవసరం లేకుండానే ఇసుక శిల్పాలతో ప్రజలకు అతి తేలిగ్గా అర్థమయ్యే రీతిలో అంశాలను ప్రదర్శిస్తున్నాను. 2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లో 28 దేశాల నుంచి 104 మంది సైకత శిల్పులు పాల్గొనగా.. అంతర్జాతీయ ప్రథమ బహుమతి సాధించడం నా జీవితంలో మరిచిపోలేను. ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో జరుగుతున్న అంతర్జాతీయ పోటీల్లో కచ్చితంగా బహుమతి సాధించాలనే పట్టుదలతో సైకత శిల్పాన్ని రూపొందిస్తున్నాను. – ఆకునూరి బాలాజీ వరప్రసాద్, సైకత శిల్పి