కర్నూలు (లీగల్): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళా న్యాయవాదులకు, న్యాయమూర్తులకు న్యాయవాది సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తికి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గంగాభవానికి ప్రథమ బహుమతులు వచ్చాయి. స్థానిక జిల్లా కోర్టు ఆవరణంలో జరిగిన ఈ పోటీల్లో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండో బహుమతి న్యాయవాదులు గీతామాధురి, హిందుమతి వేసిన ముగ్గులు ఎంపికయ్యాయి. మూడో బహుమతికి పరమేశ్వరి, ప్రేమలతలు వేసిన ముగ్గులు ఎంపికయ్యాయి. న్యాయ నిర్ణేతలుగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శివకుమార్, లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ వ్యవహరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు గాయత్రిదేవి, స్వప్నరాణిలతో పాటు సీనియర్ మహిళా న్యాయవాదులు సాయిలీల, నాగలక్ష్మిదేవి, యూవీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.