
ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ సృష్టించిన సినిమా 'కాంతార'(Kantara Movie) . కేవలం రూ.15 కోట్లతో తీస్తే రూ.400 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం దీని ప్రీక్వెల్ తీస్తున్నారు. అక్టోబరు 2న రిలీజ్. అయితే షూటింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఓ అడ్డంకి వస్తూనే ఉంది. ఈ క్రమంలో హీరో-డైరెక్టర్ రిషభ్ శెట్టి(Rishab Shetty).. పంజర్లి దేవతని దర్శించాడు.
(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా)
సినిమాలో చూపించినట్లే కర్ణాటకలో పలు ప్రాంతాల్లో నిజంగానే జరుగుతూ ఉంటాయి. తాజాగా మంగళూరులోని పంజుర‍్లి దేవస్థానాన్ని రిషభ్ శెట్టి సందర్శించగా.. షాకింగ్ అనుభవం ఎదురైంది. పంజుర్లి పూనిన పూజరి మాట్లాడుతూ.. 'నీ చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారు. భారీ కుట్రకు తెరతీశారు. కానీ నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కచ్చితంగా కాపాడుతాడు' అని చెప్పుకొచ్చారు.

కాంతార తీస్తున్నప్పుడు పెద్దగా ఇబ్బందులు రాలేదు గానీ కొన్నిరోజుల క్రితం బెంగళూరుకి దగ్గర్లో ప్రీక్వెల్ షూటింగ్ చేస్తుండగా.. పర్యావరణానికీ హాని చేస్తున్నారని అటవీశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్ టైంలో పేలుడు పదార్థాలు ఉపయోగించారని ఫిర్యాదులు వచ్చాయి. ఓ యాక్సిడెంట్ జరగ్గా.. పలువురు యూనిట్ సభ్యులకు గాయాలయ్యాయి. ఇలా ఏదో ఓ సమస్య వస్తుండటంతోనే తాజాగా పంజుర్లిని రిషభ్ కలిశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)