Rishab Shetty Kantara Beats KGF 2 In IMDb Rating - Sakshi
Sakshi News home page

Kantara Movie: ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2లను వెనక్కు నెట్టిన కాంతార

Published Fri, Oct 14 2022 8:18 PM | Last Updated on Fri, Oct 14 2022 8:49 PM

Rishab Shetty Kantara Beats KGF 2 In IMDb Rating - Sakshi

కన్నడ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ కేజీఎఫ్‌ 2 రికార్డును తిరగరాసింది.

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార. సప్తమి గౌడ, కిశోర్‌ కుమార్‌, ప్రమోద్‌ శెట్టి, ప్రకాష్‌ తుమినాడు, అచ్యుత్‌ కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించారు. సెప్టెంబర్‌ 30న విడుదలైన ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు సృష్టిస్తోంది.

తాజాగా ఈ మూవీ కేజీఎఫ్‌ 2 రికార్డును బద్ధలు కొట్టింది.  ఐఎమ్‌డీబీలో కేజీఎఫ్‌ 2 మూవీకి 8.4, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు 8 రేటింగ్‌ ఉండగా కాంతార.. వీటిని వెనక్కు నెట్టి అత్యధికంగా 9.6 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ చిత్రంగా కాంతార నిలిచింది. కాగా అఖండ ప్రేక్షకాదరణ అందుకుంటున్న కాంతార నేడు హిందీలో రిలీజైంది. గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా శనివారం (అక్టోబర్‌ 15న) ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

చదవండి: ఎందుకింత ద్వేషం, అతడిని బతకనివ్వండి: నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement