
బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన మూవీ 'కాంతార'. భాషతో సంబంధం లేకుండా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలై 50 రోజులు అయినా థియేటర్లలో క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా వసూళ్ల పరంగా మరో రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల (గ్రాస్) వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో కేజీయఫ్-2 రికార్డును అధిగమించి రూ.168.50 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది.
(చదవండి: ఓటీటీకి 'కాంతార'.. ఆ వివాదం వల్లే ఆలస్యమవుతోందా ?)
తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో 19.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.44.50 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్‌లో అయితే ఇప్పటివరకూ రూ.96 కోట్లు వచ్చినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అందరూ ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో డబ్ అయి, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో నిలిచింది. మొదటి స్థానంలో ‘కేజీయఫ్2’ రూ.185 కోట్ల టాప్‌లో ఉండగా, ఆ తర్వాత 2.ఓ (రూ.100కోట్లు), రోబో (రూ.72కోట్లు), కాంతార (రూ.60) ఐ (రూ.57కోట్లు) ఉన్నాయి.
‘KANTARA’ CROSSES ₹ 400 CR WORLDWIDE… #Kantara territory-wise breakup… Note: GROSS BOC…
— taran adarsh (@taran_adarsh) November 22, 2022
⭐️ #Karnataka: ₹ 168.50 cr
⭐️ #Andhra / #Telangana: ₹ 60 cr
⭐️ #TamilNadu: ₹ 12.70 cr
⭐️ #Kerala: ₹ 19.20 cr
⭐️ #Overseas: ₹ 44.50 cr
⭐️ #NorthIndia: ₹ 96 cr
⭐️ Total: ₹ 400.90 cr pic.twitter.com/CmBQbLrZvf