సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఆటోల విక్రయాల్లోనూ వృద్ధి నెలకొంది. తద్వారా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పోల్చి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో 8.40 శాతం వృద్ధి నమోదైంది.
గత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే జాతీయ సగటును మించి రాష్ట్రంలో వృద్ధి చోటు చేసుకుంది. అలాగే ఇదే కాలానికి జాతీయ సగటును మించి రాష్ట్రంలో కార్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ఆటోల అమ్మకాల్లో ఏకంగా 795.28 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం.
గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు రవాణా ఆదాయం రూ.1,448.35 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,570.07 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా గూడ్స్ వాహనాల అమ్మకాలు పడిపోగా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో బాగుంటే వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
వాహనాల పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేíÙస్తున్నాం. కొనుగోలుదారులను ప్రోత్సహించేలా సంస్కరణలపై దృష్టి సారించాం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోళ్లు పెరిగాయి. రవాణా ఆదాయంలోనూ వృద్ధి నమోదవుతోంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ
Comments
Please login to add a commentAdd a comment