తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్‌పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు అన్నారు. అంతేకాక జేసీ ట్రావెల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. దీని ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్-4 వాహనాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు.