బేగంపేట, న్యూస్‌లైన్: విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని డీజీపీ ప్రసాదరావు అన్నారు. సోమవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో 25వ నేషనల్ రోడ్ సేఫ్టీవీక్ వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాఫ్ట్‌వేర్ సంస్థ డిజి క్వెస్ట్ ట్రాఫిక్ నిబంధనలపై రూపొందించిన ఆరు షార్ట్‌ఫిల్మ్ సీడీలను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ ఈ షార్ట్‌ఫిల్మ్‌లను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సిని మా థియేటర్లలో ప్రదర్శిస్తామన్నారు. ప్రతి ఒక్క రూ హోదాలతో సంబంధం లేకుండా కచ్చితమైన క్రమశిక్షణ పాటిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అ వుతుందన్నారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్ర ముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ట్రాఫి క్ షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించడం ఆనందంగా ఉందన్నా రు. నగర కమిషనర్ అనురాగ్‌శర్మ, ట్రాఫిక్ అదన పు కమిషనర్ అమిత్‌గార్గ్, డీజీ క్వెస్ట్ సీఈఓ కె.బసిరెడ్డి, కాకతీయ హోటల్ జనరల్ మేనేజర్ వర్గీస్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
థియేటర్లలో ట్రాఫిక్ షార్ట్‌ఫిల్మ్‌ల ప్రదర్శన
Published Tue, Jan 14 2014 4:24 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement