Kakatiya Hotel
-
బాదం టేస్టీ.. బ్యూటీ స్వీటీ
-
బాదం టేస్టీ.. బ్యూటీ స్వీటీ
కాలిఫోర్నియా ఆల్మండ్స్ సంస్థ ఆధ్వర్యంలో బేంగపేట్‌లోని కాకతీయ హోటల్లో ‘బాదం పప్పు – కుటుంబ ఆరోగ్యం’ అనే అంశంపై మంగళవారం చర్చావేదిక నిర్వహించారు. ఇందులో హీరో మహేష్‌బాబు సతీమణి, సినీ నటి నమ్రతా శిరోద్కర్ పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యక్రమంలో వెల్నెస్ నిపుణురాలు శీలా కృష్ణస్వామి, న్యూట్రీషనిస్ట్ రుతికా సమద్దార్, ఆర్జే షెజ్టీ పాల్గొన్నారు. – సోమాజిగూడ -
శిల్పారామానికి రూ.1.14 కోట్లు
హరిత కాకతీయ హోటల్‌కు కొత్త అందాలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరంలో నిర్మించనున్న శిల్పారామం ప్రాజెక్ట్‌కు రూ. 1.14 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర పర్యాటక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, నెల్లూరు, తిరుపతితోపాటు వరంగల్‌లో శిల్పారామం నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం 2010లో అనుమతులు జారీ చేసింది. ఒక్కో శిల్పారామానికి ఐదు కోట్ల రూపాయలు కేటాయిం చింది. అయితే నాలుగేళ్లుగా వరంగల్ శిల్పారామానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఇక్కడ నిర్మించే శిల్పారామానికి రూ.5 కోట్లు రావాల్సి ఉండగా... ఇప్పటివరకు రూ 1.25 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో రూ.10.08 లక్షలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రూ. 1.14 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన నిధులను సైతం త్వరితగతిన మంజూరు చేసి... శిల్పారామాన్ని సకాలంలో నిర్మించేలా ఇక్కడి ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో సుందరీకరణ పనుల్లో భాగంగా శిల్ప కళా ఖండాలను ఏర్పాటు చేసేందుకు మరో తొమ్మిది లక్షల రూపాయలు అదనంగా మంజూరయ్యాయి. -
పోలవరంపై న్యాయపోరాటం చేస్తాం
ఆదివాసీలతో పెట్టుకుంటే బాగుపడరు మానుకోట ఎంపీ అజ్మీర సీతారాంనాయక్ హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడంపై పార్లమెంట్లో గళం విప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తామని మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాంనాయక్ అన్నారు. శనివారం రాత్రి హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో ఎంపీ సీతారాంనాయక్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌బాస్కర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఇస్తూనే కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. ‘తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని ప్రత్యేక రాష్ట్రంగా కావాలని కోరితే కోత పెట్టింది.. స్వపరిపాలన కోరితే గవర్నర్ పాలన చేసింది.. హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా ఉండాలని అడిగితే ఉమ్మడి రాజధానిని చేసింది.. ప్రత్యేక హైకోర్టు కావాలంటే ఉమ్మడి హైకోర్టు ఏర్పాటు చేసింది.. అని అన్నారు. ఇదిలా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం వస్తూనే ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని, దీనిపై పార్లమెంట్లో న్యాయపోరా టం చేస్తామని స్పష్టం చేశారు. ఆదిమజాతికి చెందిన ఆదివాసీలతో పెట్టుకున్న వారు బాగుపడరని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు యూనివర్శిటీ నుంచి మొదలై అన్ని శాఖలకు విస్తరించాయని, మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నింటినీ అమలు చేయడానికి కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌బాస్కర్ మాట్లాడుతూ ‘కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు తనకు తెలుసు.. వారు చేసిన ప్రతి పోరాటంలో తాను పాల్గొన్నాను.. వాటిని పరిష్కరించే బాధ్యతను తీసుకుంటాను’ అని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాలు త్వరలో తీరుతాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక గౌరవ అధ్యక్షుడు, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, ఐక్య వేదిక కన్వీనర్ కొలిపాక మధు, ప్రతినిధులు పి.రాధాకృష్ణ, డాక్టర్ శరత్, డాక్టర్ రావుల జగదీశ్వర్‌ప్రసాద్, బార్గవ్ శాస్త్రి, మైదం రాజు, రమేశ్, అరుణాదేవి, సూర్యకిరణ్, శివకిరణ్, జానకీరాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
థియేటర్లలో ట్రాఫిక్ షార్ట్‌ఫిల్మ్‌ల ప్రదర్శన
బేగంపేట, న్యూస్‌లైన్: విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని డీజీపీ ప్రసాదరావు అన్నారు. సోమవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో 25వ నేషనల్ రోడ్ సేఫ్టీవీక్ వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ సంస్థ డిజి క్వెస్ట్ ట్రాఫిక్ నిబంధనలపై రూపొందించిన ఆరు షార్ట్‌ఫిల్మ్ సీడీలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ షార్ట్‌ఫిల్మ్‌లను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సిని మా థియేటర్లలో ప్రదర్శిస్తామన్నారు. ప్రతి ఒక్క రూ హోదాలతో సంబంధం లేకుండా కచ్చితమైన క్రమశిక్షణ పాటిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అ వుతుందన్నారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్ర ముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ట్రాఫి క్ షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించడం ఆనందంగా ఉందన్నా రు. నగర కమిషనర్ అనురాగ్‌శర్మ, ట్రాఫిక్ అదన పు కమిషనర్ అమిత్‌గార్గ్, డీజీ క్వెస్ట్ సీఈఓ కె.బసిరెడ్డి, కాకతీయ హోటల్ జనరల్ మేనేజర్ వర్గీస్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.