పోలీసుల నుంచి తప్పించుకొని వెళుతూ గాయపడ్డ సిద్దార్థ్
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో ఏడు వేర్వేరు చోట్ల శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36/10 చౌరస్తాలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బల్వంతయ్య, జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 డైమండ్ హౌజ్ వద్ద బేగంపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. ముత్తు, జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లో ట్రాఫిక్ ఇంజనీరింగ్ సెల్ సీఐ ఆది ముత్తి, బీవీబీపీ జంక్షన్‌లో సైఫాబాద్‌ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ చౌరస్తాలో మారేడుపల్లి ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, నీరూస్ జంక్షన్‌లో ఎస్‌ఆర్ నగర్ ట్రాఫిక్ సీఐ రామలింగ రాజు ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. మోతాదుకు మించి మద్యం సేవించిన 149 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 74 ద్విచక్ర వాహనాలు, 49 కార్లు ఉన్నాయి. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.
తప్పించుకోబోయి కిందపడ్డ విద్యార్థి...
సనత్‌నగర్‌లో నివసించే సిహెచ్. సిద్దార్థ్ అనే ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లోస్నేహితులతో కలిసి మద్యం పార్టీ అనంతరం స్కూటీపై రోడ్ నెం. 10 మీదుగా వెళ్ళడానికి వస్తున్నాడు. అదే సమయంలోరోడ్ నెం.36/10 చౌరస్తాలో పోలీసుల తనిఖీలు జరుగుతుండటంతో స్కూటీని ఓ పక్కన ఆపి నడుచుకుంటూ ముందుకు వెళ్లాడు. తన స్నేహితుడిని రమ్మని చెప్పి మళ్ళీ రోడ్డుకుఅవతలి వైపు నుంచి స్కూటి పార్కింగ్ చేసిన వైపు వెళ్తూ మధ్యలోడివైడర్‌ను దాటడానికి ప్రయత్నిస్తుండగా డివైడర్ ఎత్తుగా ఉండటంతో తట్టుకొని కిందపడ్డాడు. దీంతో కాలువిరిగింది. పోలీసులు గమనించి ఏం జరిగిందని ఆరా తీస్తే జరిగిన విషయం చెప్పాడు. వెంటనే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment