సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో సీఎంపై విమర్శలు వెల్లువెత్తాయి. దినేశ్ ఆరోపణలపై విచారణ జరిపి, నిజాలను బయటపెట్టాలని దాదాపు అన్ని పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ీకిరణ్‌పై క్రిమినల్ కేసు పెట్టి, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
కిరణ్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలని టీఆర్‌ఎస్ మరో ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. దినేశ్‌రెడ్డి ఆరోపణలు తీవ్రమైనవని, వెంటనే సీఎంను బర్తరఫ్ చేయాలని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. సీఎం జైలుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దినేశ్‌రెడ్డి ఆరోపణల నేపథ్యంలో సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. కిరణ్ సోదరుడిపై విచారణ జరపాలని సీపీఎం, సీపీఐల రాష్ట్ర కార్యదర్శులు రాఘవులు, నారాయణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసిన మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి ముసుగు త్వరలోనే తొలగుతుందని ్టమ్రంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. దినేశ్ రెడ్డివి పిచ్చోడి మాటలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
దినేశ్‌రెడ్డి ఆరోపణల నేపథ్యంలో.. సీఎంపై వెల్లువెత్తిన విమర్శలు
Published Wed, Oct 9 2013 4:24 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement